ప్రధాన మంత్రి కార్యాలయం

రికార్డులను అధిగమించిన సంఖ్యలో టీకాలు వేయడాన్ని అభినందించిన - ప్రధానమంత్రి

Posted On: 21 JUN 2021 7:58PM by PIB Hyderabad
రికార్డులను అధిగమించిన సంఖ్యలో ఈ రోజు టీకాలు వేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ముందు వరుసలో పనిచేస్తున్న కరోనా యోధుల కృషిని ఆయన ప్రశంసించారు.
 
ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ, 

"రికార్డులను అధిగమించిన సంఖ్యలో ఈ రోజు టీకాలు వేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. కోవిడ్-19 తో పోరాడటానికి టీకా, మనకు బలమైన ఆయుధం గా నిలిచింది. టీకాలు వేయించుకున్న వారందరికీ శుభాకాంక్షలు. పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు వేయించుకునేలా నిర్ధారించడానికి కృషి చేస్తున్న ఫ్రంట్-లైన్ యోధులు అందరికీ అభినందనలు. 

ఈ విషయంలో భారతదేశం చాలా మంచిగా పని చేసింది." అని పేర్కొన్నారు. 

*****(Release ID: 1729258) Visitor Counter : 176