ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

కొత్త ఐ.టి. నిబంధనలపై హక్కుల మండలి ఆందోళనకు భారత్ ప్రతిస్పందన

విస్తృత సంప్రదింపులతోనే నిబంధనలు ఖరారైనట్టు
భారతీయ పర్మనెంట్ మిషన్ స్పష్టీకరణ..

సామాజిక మాధ్యమాల సాధారణ వినియోగదారుల
సాధికారతే తమ లక్ష్యమని వివరణ


Posted On: 20 JUN 2021 1:13PM by PIB Hyderabad

  భారతదేశపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి)కి సంబంధించి రూపొందించిన 2021వ సంవత్సరపు నిబంధనలపట్ల మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగం వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ స్పందించింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి, జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు అనుబంధించిన భారతీయ పర్మనెంట్ మిషన్ తన ప్రతిస్పందను వ్యక్తం చేసింది. పర్మనెంట్ మిషన్ ఈ మేరకు రాసిన లేఖలో ఈ కింది అంశాలు ఉన్నాయి. :

 

 

“మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగానికి ఐక్యరాజ్యసమితికి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారతీయ పర్మనెంట్ కమిషన్ అభినందనలు తెలుపుతోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన వెలువడిన ఒ.ఎల్.-ఐ.ఎన్.డి. 8/2021 నంబరు కలిగిన ఉమ్మడి సమాచార నివేదిక గురించి ప్రత్యేక ప్రతినిధి ద్వారా ప్రస్తావించడం తమకు దక్కిన గౌరవంగా కమిషన్ పరిగణిస్తోంది. భావప్రకటన, వాక్స్వాతంత్ర్య స్వేచ్ఛా హక్కులకు ప్రోత్సాహం, పరిరక్షణ అన్న అంశాలపై ఈ సమాచార నివేదికను రూపొందించారు. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులు, వ్యక్తిగత రహహ్యాల హక్కు వంటి అంశాలపై కూడా ఈ నివేదికను వెలువరించారు. భారతదేశపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తనావళి)కి సంబంధించి 2021వ సంత్సరపు నిబంధనలపై ఒక ప్రకటననను కూడా ఈ సందర్భంగా వెలువరించారు.

   కాగా, ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనల రూపకల్పన కోసం కేంద్ర ఎలెక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2018లో విస్తృత స్థాయిలో అనేక సంప్రదింపులు నిర్వహించినట్టు భారతీయ పర్మనెంట్ కమిషన్ ఈ సందర్భంగా తెలియజేయ దలుచుకుంది. ఈ అంశంపై పలువురు వ్యక్తులు, పౌర సమాజ ప్రతినిధులు, పారిశ్రమల, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సహా పలువురు భాగస్వామ్య వర్గాలతో చర్చలు నిర్వహించారు. నిబంధనలను తయారు చేసే ముందు ప్రజలనుంచి కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. ఆ తర్వాత, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమావేశం జరిగింది. వివిధ వర్గాలనుంచి అందిన అభిప్రాయాలు, వ్యాఖ్యలపై విపులంగా చర్చించిన మీదటే తుది నిబంధనలు ఖరారయ్యాయి.

  భారతీయ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, విలువలకు ఎంతో గుర్తింపు ఉందని కూడా పర్మనెంట్ కమిషన్ ప్రధానంగా స్పష్టం చేయదలుచుకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్స్వాతంత్ర్య హక్కులకు భారత రాజ్యాంగం పూచీ కల్పిస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ, పటిష్టమైన సమాచార సాధనాల వ్యవస్థ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగాలే.

  ఈ నేపథ్యంలో, ఈ లేఖతో జతపరిచిన సమాచారాన్ని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకవవెళ్లాలని పర్మనెంట్ కమిషన్ కోరుతోంది.

  ఇందుకు సంబంధించిన హామీలను గురించి మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగానికి అత్యున్నత స్థాయిలో మరోసారి వివరించేందుకు ఇది సదవకాశంగా భారతీయ పర్మనెంట్ కమిషన్ పరిగణిస్తోంది.”

 

భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

(మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తనావళి)

2021వ సంవత్సరపు నిబంధనలపై క్లుప్తంగా సమాచార నివేదిక

 

  2021వ సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తనావళి) నిబంధనలను భారత ప్రభుత్వం రూపొందించింది. 2000 సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 87(2) ప్రకారం ప్రభుత్వానికి దఖలు పడిన అధికారాలతో ఈ నిబంధలకు రూపకల్పన జరిగింది. 2011వ సంవత్సరపు మార్గదర్శక సూత్రాల స్థానంలో ఈ కొత్త నిబంధనలు రూపకల్పన జరిగింది. 'నూతన ఐ.టి. నిబంధనల' పేరిట  ఈ నిబంధనావళిని ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన నోటిఫికేషన్ ద్వారా వెలువరించారు. ఇవే నిబంధనలు మధ్యంతరంగా ఈ ఏడాది మే నెల 26వ తేదీనుంచి అమలులోకి వచ్చాయి. కొత్త ఐ.టి. నిబంధనలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ అనుబంధంలో కూడా పొందుపరిచారు.

  సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వినియోగదారులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ నిబంధనలకు రూపకల్పన చేశారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం కారణంగా నష్టపోయన బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఒక వేదిక ఏర్పాటుకు కూడా ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి.

  సామాజిక, డిజిటల్ మాధ్యమ వేదికల దుర్వినియోగం జరుగుతున్న ఉదంతాలు పెరిగిన కారణంగా విస్తృత స్థాయిలో వెలువడిన ఆందోళనల నేపథ్యంలో కొత్త ఐ.టి. నిబంధనలకు రూపకల్పన చేయాల్సి వచ్చింది. ఉగ్రవాదుల నియామకాన్ని ప్రేరేపించడం, అసభ్యకరమైన అంశాల వ్యాప్తి, సామరస్యాన్ని దెబ్బతీసే అంశాలను ప్రచారం చేయడం, ఆర్థిక అవతకలకు పాల్పడటం, హింసను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను దెబ్బతీయడం వంటి వాటికి సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతున్న సంఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడింది.

  ఇక బాలలపై నీలి చిత్రాల చిత్రీకరణ, ఆన్ లైన్ వేదికలపై ఈ  అంశాలను, ఇతరత్రా సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి దుష్పరిణామాలను నిర్మూలించాలని సుప్రీంకోర్టు 2018, 2019 సంవత్సరాల్లో వెలువరించిన రెండు తీర్పుల్లో భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018వ సంవత్సరపు ప్రజ్వల కేసులో, 2019వ సంవత్సరపు ఫేస్ బుక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పులు వెలువరించింది. అభ్యంతరకమైన సందేశాలను, అంశాలను మొట్టమొదటగా తయారు చేయడానికి కారకులైన వ్యక్తులు, సంస్థలు, సంఘాలను కనిపెట్టడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి అంటూ రెండవ కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మధ్యవర్తులనుంచి సేకరించడం అవసరంగా మారింది.

  సామాజిక మాధ్యమాల వేదికలు భారతీయ చట్టాల కింద జవాబ్దారీగా వ్యవహరించేలా చూసేందుకు న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలని భారతీయ పార్లమెంటు (ఎగువ సభ-రాజ్యసభ) కూడా పదే పదే భారత ప్రభుత్వాన్ని కోరింది.

  దీనితో కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు కలసి 2018లో వివిధ భాగస్వామ్య వర్గాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపుల ప్రక్రియను నిర్వహించాయి. వివిధ వ్యక్తులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, పరిశ్రమల, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఈ చర్చలు నిర్వహించారు. అనంతరం ప్రజలనుంచి కూడా అభిప్రాయ సేకరణ జరిపి సంబంధిత నిబంధనలను రూపొందించారు. మంత్రిత్వ శాఖల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి, వివరంగా చర్చించి, సమావేశాల్లో అందిన అభిప్రాయాలకు అనుగుణంగా నిబంధనలను ఖరారు చేశారు.

   ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన కొత్త ఐ.టి. నిబంధనలను ఒక నోటిఫికేషన్ ద్వారా వెలువరించారు. మూడు నెలల్లోగా కొత్త నిబంధనలను అనుగుణంగా పనిచేయాలని గడువు విధించారు. కొత్త నిబంధనల ప్రకారం వివాదాల పరిష్కారానికి భారతదేశానికే చెందిన అధికారిని, నోడల్ అధికారిని నియమించుకోవలసి ఉంటుంది. బాధితులు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా ఈ నియామకం జరపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వెలువరించడానికి ముందు, సామాజిక మాధ్యమ దుర్వినియోగంపై బాధితులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు.

  కొత్త ఐ.టి. నిబంధనల ప్రకారం నియమితుడైన పరిష్కార యంత్రాంగం అధికారి (గ్రీవెన్స్ ఆఫీసర్) ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా తనకు చేరిన ఫిర్యాదుల వివరాలను సదరు అధికారి ప్రతినెలా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.

   భారతీయ ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు ఎంతో ఎంతో విస్తృతమైన గుర్తింపును కలిగి ఉన్నాయి. భారతీయ రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి హామీ ఇచ్చింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ పాలనా వ్యవస్థ, పటిష్టమైన సమాచార సాధనాల వ్యవస్థ కూడా భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగాలే.

   సామాజిక మాధ్యమాల్లో తొట్ట తొలుత సమాచారం పొందుపరిచిన వ్యక్తిని పసిగట్టేందుకు కొత్త ఐ.టి. నిబంధనల ప్రకారం పరిమిత సమాచారం మాత్రమే అవసరమవుతుందని గమనించాలి. ఇప్పటికే బహిరంగ చలామణీలో ఉన్న సమాచారం, లేదా సందేశం హింసాకాండను ప్రేరేపించేలా, దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగించేలా ఉన్నా, మహిళలను కించపరిచేలా ఉన్నా, చిన్నపిల్లలను లైంగికంగా వేధించేలా ఉన్నా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేవీ పనిచేయనప్పుడు సదరు సందేశాలను మొదటగా ఎవరు పొందుపరిచారన్న సమాచారం తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల్లో మధ్యవర్తుల అవసరం ఏర్పడుతుంది.

  అయితే, భారీ సంఖ్యలో ఫిర్యాదులను దాఖలు చేయడానికి కొత్త ఐ.టి. నిబంధనలు దుర్వినియోగం కావచ్చని, దీనితో సామాజిక మాధ్యమాల్లో ఏర్పాటు చేసే పరిష్కార యంత్రాంగాలు ఫిర్యాదులతో వెల్లువెత్తువచ్చని వచ్చిన ఆందోళనలు కూడా సరైనవికావు. ఈ ఆందోళనలు అతిశయోక్తితో కూడుకున్నవేగానీ, సిసలైనవి కానే కాదు.

  కె.ఎస్. పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం వ్యక్తిగత రహస్యాల హక్కును ప్రభుత్వం పూర్తిగా గుర్తిస్తోంది. ఆ హక్కును సముచితంగా గౌరవిస్తోంది. వ్యక్తి అస్థిత్వం విషయంలో కీలక పాత్ర వహించేది వ్యక్తిగత రహస్య హక్కు.  ఈ నేపథ్యంలో కొత్త ఐ.టి. నిబంధనల ప్రకారం కేవలం చలామణీలో ఉన్న సందేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలుసుకోవలసి ఉంటుంది. ఐ.టి. చట్టంలోని చట్టబద్ధమైన అధికారాలను వినియోగించడంలో భాగంగానే ఈ నిబంధనలకు రూపకల్పన జరిగింది.

అనుబంధం..

2021వ సంవత్సరపు ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తనావళి) నిబంధనల ముఖ్యాంశాలు

 

  • మధ్యవర్తిత్వ సంస్థలు పాటించవలసిన జాగరూకత: సామాజిక మాధ్యమ సంస్థలు, సంబంధింత మధ్యవర్తిత్వ సంస్థలకు తగిన జాగరూకతను నిబంధనలు నిర్దేశిస్తాయి. ఈ జాగ్రత్తలను సదరు సంస్థలు పాటించని పక్షంలో వారికి భద్రతా నిబంధనలను వర్తింపజేయరు.

 

  • ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం: సామాజిక మాధ్యమ సంస్థలు, మధ్యవర్తిత్వ సంస్థలు ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ నూతన నిబంధనలను రూపొందించారు. తద్వారా సాధారణ వినియోగదారులకు, బాధితులకు  తగిన సాధికారత లభిస్తుంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక అధికారిని మధ్యవర్తిత్వ సంస్థలు నియమిస్తాయి. సదరు అధికారి పేరును, ఇతర వివరాలను ఆ సంస్థలు బహిరంగంగా వెల్లడి చేస్తాయి. సదరు అధికారి కూడా 24గంటల్లోగా ఫిర్యాదును గుర్తించడంతోపాటుగా, 15రోజుల్లోగా ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

 

  • ఆన్ లైన్ భద్రతకు హామీ. ప్రత్యేకించి మహిళా నినియోగదారుల గౌరవ మర్యాదల రక్షణకు చర్యలు: ఏదైనా సామాజిక మాధ్యమ సంస్థ ఎలాంటి అసభ్యతకు పాల్పడినా సదరు సంస్థ ఇంటర్నెట్ అనుసంధానాన్ని మధ్యవర్తిత్వ సంస్థ 24 గంటల్లోగా తొలగిస్తుంది. ఆన్ లైన్లో వ్యక్తుల మర్మ అవయవాలను ప్రదర్శించడం, పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నత్వాన్ని ప్రదర్శించడం, మార్ఫింగ్ ఫొటోలను ప్రదర్శించడం వంటివాటికి పాల్పడినపుడు మధ్యవర్తిత్వ సంస్థ ఈ చర్య తీసుకుంటుంది ఇందుకు సంపబంధించి ఎవరైనా వ్యక్తిగానీ, అతను లేదా ఆమె తరఫున మరొకరు గానీ ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.

 

  • రెండు రకాల సామాజిక మాద్యమ మధ్యవర్తిత్వ సంస్థలు: సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలను రెండు రకాలుగా కొత్త నిబంధనలను వర్గీకరించాయి. సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలు, ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటిని వర్గీకరించారు. సామాజిక మాధ్యమ వేదికపై వాటిని వినియోగించే వారి సంఖ్య ఆధారంగా చేసుకుని ఈ వర్గీకరణ జరిపారు. రెండు రకాల సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలకు ఉన్న వినియోగదారుల బలాన్ని గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తద్వారా ప్రముఖ సామాజిక మాద్యమ మధ్యవర్తిత్వ సంస్థలు అదనంగా పాటించవలసిన జాగరూకతలను కూడా కొత్త నిబంధనలు సూచించాయి.

 

  • ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థ పాటించవలసిన అదనపు జాగ్రత్తలు:

 

    • చట్టంలోని నిబంధనలను సక్రమంగా అనుసరించేలా చూసేందుకు చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్ ను నియమించడం. సదరు వ్యక్తి భారతదేశం నివాసి అయి ఉండాలి.
    • పోలీసు యంత్రాంగం లాంటి, చట్టాల అమలు యంత్రాంగాలతో నిర్విరామంగా సమన్వయం కొసం నోడల్ కాంటాక్ట్ పర్సన్ ను నియమించడం. సదరు వ్యక్తి తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.
    • ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం పరిధిలో విధి నిర్వహణకోసం రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించడం. సదరు వ్యక్తి కూడా భారతదేశ నివాసిగా ఉండాలి.
    • అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను, ప్రముఖ సామాజక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థ తొలగించిన అంశాలపై నెలవారీగా ఒక నివేదికను ప్రచురించాలి.
    • దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు, విదేశాలతో మైత్రీ సంబంధాలకు, శాంతి భద్రతలకు భంగం కలిగించారన్న నేరానికి సంబంధించి అంశాలను నివారించేందుకు, గుర్తించేందుకు, దానిపై దర్యాప్తు చేసేందుకు, శిక్ష విధించేందుకు వీలుగా, తొట్టతొలుత సదరు సమాచారం ఎక్కడ ఆవిర్భవించిందన్న విషయాన్ని పసిగట్టేందుకు ప్రమఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలు తగిన సేవలందిస్తాయి.  మానభంగం, అసభ్య అంశాల ప్రచురణ, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు వంటి అంశాల విషయంలో కూడా మధ్యవర్తిత్వ సంస్థలు అవసరమైన సేవలందిస్తాయి. ఈ నేరాలకు ఐదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష ఉంటుంది. ఇందుకు సంబంధించిన తన సందేశాల్లోని అంశాలనుగానీ, సమాచారం తొలుత ఎక్కడ ఆవిర్భించిందన్న అంశాన్ని గానీ మద్యవర్తిత్వ సంస్థలు ఎక్కడా వెల్లడి చేయాల్సిన అవసరం లేదు,
    • యూజర్ వెరిపికేషన్ కు స్వచ్ఛంద యంత్రాగం: వినియోగదారులు తమ సామాజిక మీడియా ఖాతాలను స్వచ్ఛందంగా సరిచూసుకునేందుకు తగిన యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచేందుకు కొత్త నిబంధనలు దోహదపడతాయి.
  • చట్టవ్యతిరేక సమాచారం తొలగింపు: భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు, విదేశాలతో మైత్రీ సంబంధాలకు ముప్పు కలిగించే సమాచారం, ప్రచురణార్హంగాని చట్ట వ్యతిరేకమైన సమాచారం తొలగించడానికి ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థకు అధికారం ఉంటుంది.
  • కొత్తగా రూపొందించిన నిబంధనలు,.. గెజిట్ ప్రచురణ తేదీనాటినుంచి వెంటనే అమలులోకి వస్తాయి. అదనపు జాగ్రత్తలు పాటించవలసిన ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థల విషయంలో మాత్రం ఈ నిబంధనలు ప్రచురణ తేదీనుంచి 3నెలల తర్వాత అమలులోకి వస్తాయి.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అమలు జరపవలసిన డిజిటల్ మీడియా, ఒ.టి.టి. వేదికల నైతిక సూత్రాల నియమావళి.:

  డిజిటల్ మీడియా, ఒ.టి.టి. వేదికల ద్వారా ప్రచురితమయ్యే అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆందోళన నెలకొంది. ఇందుకు సంబంధించి నియంత్రణకోసం తగిన సంస్థాగత యంత్రాగం ఉండి తీరాలని  పౌర సమాజం, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నాయకులు, వాణిజ్య సంస్థలు, సంఘాలు అభిప్రాయపడుతూ వచ్చాయి. తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుతోపాటుగా  వివిధ హైకోర్టులు కూడా ప్రభుత్వానికి సూచించాయి.

  ఈ అంశం మొత్తం డిజిటల్ వేదికలకు సంబంధించినది కాబట్టి, డిజిటల్ మీడియా, ఒ.టి.టి.కి సంబందించిన అంశాలపై నిబంధనల అమలును సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలనే ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే, పూర్తి యంత్రాగం మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల మేరకు పనిచేయాలని నిర్ణయించారు.

 

సంప్రదింపులు:

ఇందుకు సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గత ఏడాదిన్నరగా ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో సంప్రదింపులు జరిపింది. తాము ప్రసారం చేసే అంశాల విషయంలో “స్వయం నియంత్రణ యంత్రాంగాన్ని” అమలుచేయాలని ఒ.టి.టి. వేదికల నిర్వాహక సంస్థలకు ఈ సంప్రదింపుల సందర్భంగా సూచించారు. ఇందుకు సంబందించి సింగపూర్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్ డమ్.లలో అమలు చేస్తున్న వ్యవస్థల నమూనాలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. అధ్యయనంలో అందిన సమాచారం ఆధారంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 87వ సెక్షన్ కింద ఈ నూతన నిబంధలకు రూపకల్పన చేశారు. అందుకు అనుగుణంగా 3వ భాగం నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అధికారాలు దఖలుపడ్డాయి. 3వ భాగం నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి.:

  • ఆన్ లైన్ లో ప్రసారమయ్యే వార్తలకు, ఒ.టి.టి., డిజిటల్ మీడియా వేదికలకు నైతిక సూత్రాల నియమావళి: ఒ.టి.టి. వేదికలు, డిజిటల్ మీడియా పాటించవలసిన నియంత్రణలను, ఆన్.లైన్ లో ప్రసారమయ్యే వార్తలకు అనుసరించవలసిన నైతిక సూత్రాలను ఈ నియమావళి నిర్దేశిస్తుంది.
  • అంశాలపై స్వీయ వర్గీకరణ: ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేసే ఒ.టి.టి. వేదికలు తాము ప్రసారం చేసే అంశాలను వీక్షకుల వయస్సు ప్రాతిపదికగా ఐదు కేటగిరీలుగా వర్గీకరించుకోవాల్సి ఉంటుంది.  యు (యూనివర్సల్), యు/ఎ 7 ప్లస్, యు/ఎ 13 ప్లస్, యు/ఎ 16 ప్లస్, ఎ (పెద్దలకు మాత్రమే) అంటూ... సొంతంగా 5 రకాలుగా వర్గీకరించుకోవలసి ఉంటుంది. యు/ఎ 13 ప్లస్ కేటగిరీ, అంతకు మించిన వయస్సుల కేటగిరీ అంశాల విషయంలో పేరంటల్ లాక్ పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఏ కేటగిరీ అంశాలకు కూడా తగిన నియంత్రణలు పాటించవలసి ఉంటుంది. ఈ వర్గీకరణను ఒ.టి.టి. ప్రచురణ కర్తలు ముందస్తుగా ప్రస్ఫుటంగా ప్రదర్శించవలసి ఉంటుంది.
  • డిజిటల్ మీడియా వేదికపై వార్తలను ప్రచురించే వారు, ప్రసారం చేసేవారు,.. ప్రెస్ కౌన్సిల్ ఇండియా నిర్దేశిత పాత్రికేయ నియమావళిని, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం పరిధిలో కార్యక్రమ నియమావళిని పాటించవలసి ఉంటుంది.

 

  •  విభిన్నమైన స్థాయిల్లో స్వయం నియంత్రణతో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మార్గదర్శక సూత్రాల ప్రకారం మూడు స్థాయిల యంత్రాగాన్ని ఏర్పాటు చేశారు.
    • స్థాయి-I: ప్రచురణ కర్తల స్వయం నియంత్రణ; వివాదాల పరిష్కారానికి ఒక అధికారిని ప్రచురణ కర్త నియమించుకోవాలి. భారతదేశానికి మాత్రమే చెందిన ఆ అధికారి తనకు అందిన ఫిర్యాదులు, వివాదాల పరిష్కారానికి బాధ్యతవహించాల్సి ఉంటుంది. తనకు అందిన ఫిర్యాదుపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
    • స్థాయి-II:  ప్రచురణ కర్తలకు చెందిన స్వయం నియంత్రణ సంస్థల ద్వారా స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ సంస్థలు, ఒకటిగానీ, అంతకంటే ఎక్కువ సంఖ్యలో గానీ ఉండవచ్చు. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి, లేదా స్వతంత్ర ప్రతిపత్తికలిగిన వ్యక్తిగానీ సారథ్యం వహించాలి. సంస్థలో గరిష్టంగా ఆరుగురికి మించి సభ్యులు ఉండరాదు.  అది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నమోదై ఉండాలి. ప్రచురణ కర్తలు ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారా, లేదా అన్న అంశాన్ని ఈ సంస్థ పర్యవేక్షించాలి. ప్రచురణ కర్త 15 రోజుల వ్యవధిలో పరిష్కరించలేని ఫిర్యాదులను ఈ సంస్థ పరిష్కరించాల్సి ఉంటుంది.  
    • స్థాయి-III: పొరపాటును సరిదిద్దుకునే వ్యవస్థ...ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. ప్రవర్తనా నియమావళి, కార్యకలాపాలతో సహా స్వీయ నియంత్రణ సంస్థల సూత్రావళిని  ఈ యంత్రాంగం ప్రచురిస్తుంది. ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ కోసం వివిధ శాఖల మధ్య అంతర్గతంగా ఒక కమిటీని ఇది ఏర్పాటు చేస్తుంది.

 

 

****



(Release ID: 1728870) Visitor Counter : 342