ప్రధాన మంత్రి కార్యాలయం
డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్ మొహాపాత్ర మరణం పట్ల ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
19 JUN 2021 10:07AM by PIB Hyderabad
డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్ మొహాపాత్ర మరణించడం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
తన సంతాపాన్ని ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. "డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్ మొహాపాత్ర మరణించడం నన్ను బాధించింది. గుజరాత్‌లో, కేంద్ర ప్రభుత్వంలో ఆయనతో కలిసి నేను పనిచేశాను. పరిపాలన అంశాలపై ఆయనకు చక్కటి అవగాహన ఉంది. ఉత్సాహవంతమైన విభిన్న ఆలోచనలకు ఆయన ప్రసిద్ధి. డా.మొహాపాత్ర కుటుంబానికి, స్నేహితులకు నా సంతాపం తెలుపుతున్నాను. ఓం శాంతిః" అని తన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1728493)
సందర్శకుల సూచీ సంఖ్య : : 265
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam