ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాలపై - అపోహలు - వాస్తవాలు
అడెనోవెక్టర్ టీకాల ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక శాస్త్రీయ కారణం ఆధారంగానే, కోవీషీల్డ్ టీకా మోతాదుల మధ్య విరామం పెంచే నిర్ణయం తీసుకోవడం జరిగింది
కోవిషీల్డ్ మోతాదుల మధ్య 12-16 వారాల విరామం ఉండాలన్న విషయంపై, ఏ సభ్యుడి నుండి ఎటువంటి అసమ్మతి లేకుండా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు - కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ మరియు ఎన్.టి.ఏ.జి.ఐ. యొక్క స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (ఎస్.టి.ఎస్.సి) సమావేశాల సందర్భంగా నమోదు చేసిన వివరాలు స్పష్టం చేశాయి.
Posted On:
16 JUN 2021 1:40PM by PIB Hyderabad
కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 6-8 వారాల నుండి 12-16 వారాలకు పెంచుడుతూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సాంకేతిక నిపుణుల మధ్య అసమ్మతి ఉందని పేర్కొంటూ, కొన్ని ప్రసార మాధ్యమాల్లో, నివేదికలు వచ్చాయి.
అడెనోవెక్టర్ టీకాల ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రీయ కారణాల ఆధారంగా, టీకాల మధ్య విరామం పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని గమనించాలి. ఎన్.టి.ఏ.జి.ఐ. కి చెందిన కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ మరియు స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (ఎస్.టి.ఎస్.సి.) సమావేశాలలో ఈ విషయాన్ని క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా, ఈ విషయమై, ఏ సభ్యుడు, అసమ్మతి వ్యక్తం చేయలేదు.
రోగనిరోధకత పై జాతీయ సాంకేతిక సలహా మండలి (ఎన్.టి.ఎ.జి.ఐ) కి చెందిన కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ 22వ సమావేశం 2021 మే నెల, 10వ తేదీన జరిగింది.
కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ లో ఈ దిగువ పేర్కొన్న వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు:
డాక్టర్ ఎన్. కె. అరోరా
|
ఐ.ఎన్.సి.ఎల్.ఈ.ఎన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
|
డాక్టర్ రాకేష్ అగర్వాల్
|
ఎన్.టి.ఏ.జి.ఐ. సభ్యుడు;
జిప్-మెర్, డైరెక్టర్,
పుదుచ్చేరి
|
డాక్టర్ గగన్ దీప్ కంగ్
|
ఎన్.టి.ఏ.జి.ఐ. సభ్యుడు;
ప్రొఫెసర్,
సి.ఎం.సి., వెల్లూరు.
|
డాక్టర్ అమూల్య పాండా
|
ఎన్.టి.ఏ.జి.ఐ. సభ్యుడు;
డైరెక్టర్, ఎన్.ఐ.ఐ.
|
డాక్టర్ జె.పి. ముళియిల్
|
ఎన్.టి.ఏ.జి.ఐ. సభ్యుడు;
రిటైర్డ్ ప్రిన్సిపాల్,
సి.ఎం.సి. వెల్లూరు.
|
డాక్టర్ నవీన్ ఖన్నా |
గ్రూప్ లీడర్,
ఐ.సి.జి.ఈ.బి.
|
డాక్టర్ వి.జి. సోమని
|
డి.సి.జి.ఐ.,
సి.డి.ఎస్.సి.ఓ.
|
డాక్టర్ ప్రదీప్ హల్దార్
|
సలహాదారుడు,
ఆర్.సి.హెచ్.,
ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ.
|
జాతీయ టీకా విధానం క్రింద ఉపయోగించిన కోవీ షీల్డ్ టీకా మోతాదుల మధ్య విరామంలో మార్పు కోసం, ఈ కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్, ఒక ప్రతిపాదనను పరిగణించింది.
కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఈ విధంగా సిఫార్సు చేసింది:
‘ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యు.కె) నుండి వచ్చిన వాస్తవ జీవిత సాక్ష్యాల ఆధారంగా, కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు పెంచడానికి, కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్, అంగీకరించింది’.
2021 మే నెల 13వ తేదీ న జరిగిన ఎన్.టి.ఏ.జి.ఐ. కి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (ఎస్.టి.సి) 31వ సమావేశంలో కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చేసిన ఈ సిఫార్సు పై విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి మరియు డి.హెచ్.ఆర్. కార్యదర్శి & డి.జి., ఐ.సి.ఎం.ఆర్. సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (ఎస్.టి.ఎస్.సి) లో, ఈ దిగువ పేర్కొన్న వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు:
డాక్టర్ రేణు స్వరూప్
|
కార్యదర్శి,
బయోటెక్నాలజీ విభాగం.
|
డాక్టర్ బలరాం భార్గవ
|
కార్యదర్శి,
ఆరోగ్య పరిశోధన విభాగం
మరియు డి.జి., ఐ.సి.ఎం.ఆర్.
|
డాక్టర్ జె.పి. ముళియిల్
|
ప్రొఫెసర్,
సి.ఎం.సి., వెల్లూరు.
|
డాక్టర్ గగన్ దీప్ కంగ్
|
ప్రొఫెసర్,
సి.ఎం.సి., వెల్లూరు.
|
డాక్టర్ ఇంద్రాణి గుప్త
|
ప్రొఫెసర్,
ఆర్థికాభివృద్ధి సంస్థ, ఢిల్లీ.
|
డాక్టర్ రాకేష్ అగర్వాల్
|
డైరెక్టర్,
జిప్-మెర్, పుదుచ్చేరి.
|
డాక్టర్ మాథ్యూ వర్గీస్
|
శాఖాధిపతి, ఆర్థోపెడిక్స్,
సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రి,
న్యూ ఢిల్లీ.
|
డాక్టర్ సాటిందర్ అనేజా
|
ప్రొఫెసర్,
శారదా విశ్వవిద్యాలయం,
నోయిడా.
|
డాక్టర్ నీరజ భట్ల
|
ప్రొఫెసర్,
ఏ.ఐ.ఐ.ఎం.ఎస్., న్యూ ఢిల్లీ.
|
డాక్టర్ ఎం.డి.గుప్త
|
మాజీ డైరెక్టర్,
ఎన్.ఐ.ఈ., చెన్నై.
|
డాక్టర్ వై.కే.గుప్త
|
ప్రధాన సలహాదారుడు,
టి.హెచ్.ఎస్.టి.ఐ.-డి.బి.టి.
|
డాక్టర్ అరుణ్ అగర్వాల్
|
ప్రొఫెసర్,
పి.జి.ఐ.ఎం.ఈ.ఆర్., చండీగఢ్.
|
డాక్టర్ లలిత్ ధర్
|
ప్రొఫెసర్, వైరాలజీ,
ఎయిమ్స్,, న్యూ ఢిల్లీ.
|
ఎన్.టి.ఏ.జి.ఐ. కి చెందిన ఎస్.టి.ఎస్.సి. ఈ కింది విధంగా సిఫార్సు చేసింది : -
‘కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ సిఫార్సు ప్రకారం, కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య కనీసం మూడు నెలల మోతాదు విరామం సిఫార్సు చేయబడింది.’
రెండు సమావేశాలలో, అంటే, కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ మరియు ఎస్.టి.ఎస్.సి. సమావేశాలలో, రాయిటర్స్ ఒక వార్తా నివేదికలో పేర్కొన్న ముగ్గురు సభ్యులు - డాక్టర్ మాథ్యూ వర్గీస్, డాక్టర్ ఎం. డి. గుప్త మరియు డాక్టర్ జె. పి. ములియిల్ లలో ఎవరూ, ఎటువంటి భిన్నాభిప్రాయాన్నీ, వ్యక్తం చేయలేదు. కాగా, డాక్టర్ మాథ్యూ వర్గీస్ తన అసమ్మతి ఆరోపణపై రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడలేదని కూడా, స్పష్టం చేశారు.
*****
(Release ID: 1727821)
Visitor Counter : 193