ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో 70,421 కరోనా కేసులు, 74 రోజుల్లో అత్యల్పం 66 రోజుల
తరువాత చికిత్సలో ఉన్న కేసులు 10 లక్షల లోపుకు
నెలకు పైగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ మంది
కోలుకున్నవారి శాతం 95.43% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 4.72%, మూడు వారాలుగా 10% లోపే
Posted On:
14 JUN 2021 2:09PM by PIB Hyderabad
దేశంలో రోజువారీ కొత్త కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 70,421 కేసులు నమదయ్యాయి, వరుసగా ఏడో రోజు కూడా లక్షలోపే కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితమిది. .
చికిత్సలో ఉన్నవారి సంఖ్య కూడా తగ్గుతూ 9,73,158 కి చేరింది. 66 రోజుల తరువాత 10 లక్షల దిగువకు వచ్చింది. గత 24 గంటల్లో నికరంగా 53,001 తగ్గుదల నమోదైంది మొత్తం పాజిటి కేసులలో ఇది 3.30% మాత్రమే
కోవిడ్ నుంచి మరింత మంది కోలుకుంటూ ఉండటంతో వరుసగా 32వ రోజుకూడా రోజువారీ కోలుకుంటున్నవారే కొత్తకేసులకంటే ఎక్కువగా ఉన్నారు. గత 24 గంటలలో. 1,19,501 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో అంతకుముందురోజుకంటే దాదాపు 50 వేల ( 49,080) మంది ఎక్కువగా కోలుకున్నారు
ఇప్పటివరకు కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 2,81,62,947 కాగా, గత 24 గంటలలో కోలుకున్న వారు 1,19,501 మంది. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం 95.43% కు పెరిగింది.
కోవిడ్ పరీక్షల సామర్థం పెరగటంతో గత 24 గంటలలో దేసవ్యాప్తంగా 14,92,152 పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 38 కోట్లు ( 37,96,24,626) కు చేరింది. కవైపు దేశమంతటా పరీక్షలు పెరుగుతూ ఉంటే మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 4.54% కాగా రోజువారీ పాజిటివిటీ ఈ రోజు 4.72% గా నమోదైంది. వరుసగా 21 రోజులుగా ఇది 10% లోపే ఉంటోంది
ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 35,32,375 శిబిరాల ద్వారా మొత్తం 25,48,49,301 టీకా డోసుల పంపిణీ జరిగింది. వాటి వివరాలు:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,00,51,785
|
రెండో డోస్
|
69,67,822
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,67,57,575
|
రెండో డోస్
|
88,52,564
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
4,12,71,166
|
రెండో డోస్
|
7,69,575
|
45 -60 వయోవర్గం
|
మొదటి డోస్
|
7,57,08,102
|
రెండో డోస్
|
1,19,77,000
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
6,25,81,044
|
రెండో డోస్
|
1,99,12,668
|
మొత్తం
|
25,48,49,301
|
***
(Release ID: 1726959)
Visitor Counter : 174
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam