ఆర్థిక మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాల మార్గదర్శక ప్రణాళిక పైచర్చించడానికి ఏర్పాటు సమావేశానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు

తమ మూలధన వ్యయాన్ని మరింత పెంచాలని, క్యాపెక్స్ లక్ష్యాల కంటే ఎక్కువ సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని అన్ని మంత్రిత్వశాఖలకు సూచించారు.

ఎంఎస్ఎంఈ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖలు, వారి సీపీఎస్లకు సూచించారు.


ఆచరణీయ ప్రాజెక్టుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడ్‌ను అన్వేషించాలని ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖలను కోరారు.

Posted On: 11 JUN 2021 7:17PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్   మౌలిక సదుపాయాల మార్గదర్శక ప్రణాళిక పైచర్చించడానికి ఏర్పాటు  సమావేశానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశానికి పలుశాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. మౌలిక సదుపాయాల మార్గదర్శక ప్రణాళికపై ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖలు / విభాగాలతో నిర్వహించిన ఐదో సమీక్ష సమావేశం ఇది. మంత్రిత్వ శాఖల ప్రణాళికలు , వాటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ల మూలధన వ్యయం (క్యాపెక్స్), బడ్జెట్ ప్రకటనల అమలు స్థితి,  మౌలిక సదుపాయాల పెట్టుబడులను వేగవంతం చేసే చర్యల గురించి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి, కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు), కార్యదర్శి (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్), కార్యదర్శి (రోడ్డు రవాణా  రహదారులు), కార్యదర్శి (టెలికమ్యూనికేషన్స్)  కార్యదర్శి (అటామిక్ ఎనర్జీ) తో పాటు ఈ మూడు మంత్రిత్వ శాఖల సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ల సిఎండిలు / సీఈఓలు పాల్గొన్నారు.  నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  ఆర్థిక కార్యదర్శి,  కార్యదర్శి (వ్యయం) డాక్టర్ టి.వి.శోమనాథన్ ,  ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కూడా పాల్గొన్నారు.

మంత్రులు,  వారి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ల మూలధన వ్యయాల పనితీరును సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంలో మెరుగైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మూలధన వ్యయాన్ని ముందుగానే  సిద్ధం చేసుకోవాలని మంత్రిత్వ శాఖలను కోరారు.  క్యాపెక్స్ లక్ష్యాల కంటే ఎక్కువ సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రిత్వ శాఖలను కూడా అభ్యర్థించారు. 2021-–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ. 5.54 లక్షల కోట్లు, 2020-–21 బడ్జెట్ అంచనా కంటే 34.5శాతం పెరిగింది.  మూలధన వ్యయాన్ని పెంచడానికి బడ్జెట్ వైపు నుండి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వ రంగ సంస్థలు మద్దతు ఇవ్వాలని సూచించారు.  మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు కేవలం మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం చేసే బడ్జెట్ వ్యయం మాత్రమే కాదన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రైవేటు రంగం మౌలిక సదుపాయాల వ్యయం కూడా ఉంటుందని సీతారామన్ అన్నారు. అదనపు బడ్జెట్ వనరుల ద్వారా పెట్టిన ప్రభుత్వ ఖర్చు కూడా ఇందులో ఉన్నందున, కొత్త తరహా నిర్మాణ  ఫైనాన్సింగ్ ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి మంత్రిత్వ శాఖలు చురుకుగా పనిచేయాలని ఆమె కోరారు.  మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడానికి ప్రైవేట్ రంగానికి అన్ని విధాలా సహకారాన్ని అందించాలన్నారు. ఆచరణీయ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖలు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడ్‌ను కూడా అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) బకాయిలను త్వరగా చెల్లించాలని ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖలను, వారి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లను కోరారు.

ఆశాజనక జిల్లాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఉన్నత స్థాయి డేటా కనెక్టివిటీ అందించగల ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్)ను కోరారు. కొండ ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచే అవకాశాన్ని పరిశీలించాలని,  వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యం అమలును వేగవంతం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖను సీతారామన్ కోరారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ (ఎఎన్‌బిపి) కింద ప్రకటించిన కార్యక్రమాలను సకాలంలో అమలు చేయాలని అణు ఇంధన శాఖను కోరారు. పెద్ద ముఖ్యమైన ప్రాజెక్టులపై ఖర్చులను సమయానుసారంగా పెంచేలా చూడాలని  ఆర్థిక మంత్రి.. సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు సూచించారు. సెక్టార్ల వారీగా చేపట్టిన ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు   సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షించడం ద్వారా అవి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని మంత్రిత్వ శాఖలను నిర్మలా సీతారామన్ కోరారు. 

 

***(Release ID: 1726609) Visitor Counter : 29