ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ అశోక్‌ పనగాడియా మృతికి ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 11 JUN 2021 6:22PM by PIB Hyderabad

   ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ అశోక్‌ పనగాడియా కన్నుమూయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సందేశమిస్తూ- “డాక్టర్‌ అశోక్‌ పనగాడియా నాడీవైద్యంలో చేయితిరిగిన నిపుణులు. వైద్యరంగంలో ఆయన కృషి భవిష్యత్తరాల వైద్యులు, పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలతపెట్టింది. ఇటువంటి విషాద సమయంలో ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1726409) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam