ప్రధాన మంత్రి కార్యాలయం

47వ జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 JUN 2021 6:34PM by PIB Hyderabad

యుకె ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ ఆహ్వానించిన మీదట ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జూన్ 12వ, 13వ తేదీ లలో వర్చువల్ విధానం లో జరుగనున్న జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో పాలుపంచుకోనున్నారు.  ప్రస్తుతం జి7 అధ్యక్ష బాధ్యత ను నిర్వహిస్తున్న యుకె భారతదేశం తో పాటు ఆస్ట్రేలియా ను, కొరియా గణతంత్రాన్ని, దక్షిణ ఆఫ్రికా ను జి7 శిఖర సమ్మేళనానికి అతిథి దేశాలు గా పాల్గొనవలసిందంటూ ఆహ్వానించింది.  ఈ సమావేశాన్ని హైబ్రిడ్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది.

‘బిల్డ్ బ్యాక్ బెటర్’ అనే అంశం ఈ శిఖర సమ్మేళనం ఇతివృత్తం గా ఉంది.  యుకె అధ్యక్షత న నాలుగు ప్రాధాన్య రంగాల ను ఎంపిక చేయడమైంది.  ఆ నాలుగు ప్రాధాన్య రంగాలు ఏవేవి అంటే, కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడానికి దారి చూపడం, భావి మహమ్మారుల కు వ్యతిరేకం గా ప్రతిఘాతకత్వాన్ని పటిష్ట పరచడం;  స్వేచ్ఛాయుతమైనటువంటి, న్యాయమైనటువంటి వ్యాపారాన్ని సమర్థించడం ద్వారా రాబోయే కాలం లో సమృద్ధి ని పెంచడం; జలవాయు పరివర్తన ను ఎదుర్కోవడం, భూగ్రహం లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం; ఉమ్మడి విలువ ల, పక్షపాతానికి తావు ఉండనటువంటి సమాజాల పక్షం వహించడమూను.  ఆరోగ్యం పైన, జలవాయు పరివర్తన పైన నేత లు శ్రద్ధ వహిస్తూ, అన్ని దేశాలు ప్రపంచ వ్యాప్త వ్యాధి నుంచి కోలుకోవడానికి ముందుకు పోవలసిన మార్గం గురించి వారి వారి అభిప్రాయాల ను తెలియజేస్తారన్న ఆశ ఉంది.

జి7 సమావేశం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం ఇప్పటికి ఇది రెండో సారి.  2019వ సంవత్సరం లో జి7 కు ఫ్రాన్స్ అధ్యక్ష స్థానం లో ఉండగా బియారిత్జ్ సమిట్ కు భారతదేశాన్ని ఒక ‘‘సౌహార్ద రాయబారి’’ గా ఆహ్వానించడం జరిగింది.  అప్పట్లో ‘జలవాయు, జీవ వైవిధ్యం మరియు మహాసముద్రాలు’ మరియు ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్’ అనే విషయాల పై సాగిన సమావేశాల లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.



 

****


(Release ID: 1726098) Visitor Counter : 315