ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ డింకో సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 JUN 2021 11:31AM by PIB Hyderabad

బాక్సర్  శ్రీ డింకో సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం  చేశారు.

‘‘శ్రీ డింకో సింహ్ క్రీడల లో ఓ సూపర్ స్టార్, అనేక సాఫల్యాలను సంపాదించిన శ్రేష్ఠుడైన బాక్సర్. అంతే కాదు, బాక్సింగ్ కు ప్రజాదరణ ఇంతలంతలు కావడానికి ఆయన తోడ్పాటు ను అందించారు కూడాను.  ఆయన మరణ వార్త దు:ఖాన్ని కలిగించింది.  ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.*******

DS(Release ID: 1725940) Visitor Counter : 149