ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో మూడోరోజు కూడా లక్షలోపు కొత్త కోవిడ్ కేసులు


60 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారు 12 లక్షల దిగువకు
28 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ కోలుకున్నవారిశాతం 94.77% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 4.69%, 17 రోజులుగా 10% లోపు
దేశవ్యాప్తంగా 24 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

Posted On: 10 JUN 2021 10:28AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా గత 24 గంతలలో 94,052 కొత్త కరోనా కే సులు నమోదయ్యాయి. ఈ విధంగా లక్షలోపు కేసులు నమోదవటం వరుసగా ఇది మూడో రోజు. కేంద్రంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలసికట్టుగా సాగిస్తున్న కృషి ఫలితం ఇది. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F3FC.jpg

చికిత్సలో ఉన్న కేసులు క్రమంగా తగ్గుదలబాటలో సాగటం స్పష్టంగా కనబడుతోంది. దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 11,67,952.  అలా పది రోజులుగా ఈ సంఖ్య 20 లక్షలలోపే కొనసాగుతోంది. The గత 24 గంటలలో బాధితుల సంఖ్య నికరంగా 63,463 తగ్గుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం దేశంలోని పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 4% మాత్రమే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VBJ3.jpg

కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే గత 28 రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నారు.  గత 24 గంటలలో 1,51,367 మంది కోలుకున్నారు. ఈ సంఖ్య అంతకు ముందురోజుకంటే 57,315  ఎక్కువ కావటం గమనార్హం.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003L0MS.jpg

ఈ కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,76,55,493 మంది కోవిడ్ నుంచి బైటపడ్దారు. గత 24 గంటలలో 1,51,367 మంది కోలుకున్నారు. దీనివలన మొత్తం కోలుకున్నవారి శాతం  94.77% కు చేరింది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IKB5.jpg

పరీక్షల సామర్థ్యం పెంచటంతో గత 24 గంటలలో 20,04,690 పరీక్షలు, దేశవ్యాప్తంగా  37,21,98,253 జరిగాయి.  అదే సమయంలో వారపు పాజిటివిటీ క్రమంగా తగ్గుతూ 5.43% కి చేరింది. రోజువారీ పాజిటివిటీ  4.69%  అయింది. గత 17బ్ రోజులుగా అది 10% లోపే ఉంటోంది.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VAPS.jpg

దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం వరకు 33,82,775 శిబిరాలద్వారా 24,27,26,693 డోసుల పంపిణీ జరిగింది.గత 24 గంటలలో  33,79,261 డోసులిచ్చారు. వాటి వివరాలు:

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,13,434

రెండో డోస్

69,13,017

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,64,77,374

రెండో డోస్

87,55,586

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,39,45,647

రెండో డోస్

4,07,151

45-60 వయోవర్గం

మొదటి డోస్

7,33,84,090

రెండో డోస్

1,16,28,092

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,16,62,400

రెండో డోస్

1,95,39,902

మొత్తం

24,27,26,693

 

****


(Release ID: 1725883) Visitor Counter : 221