ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్ర‌త్యేక దివ్యాంగ గుర్తింపు కార్డు (యుడిఐడి)ని కోవిన్ 2.0 లో రిజిస్ట్రేష‌న్‌కు ప్ర‌త్యేక గుర్తింపు కార్డుగా ఆమోదయోగ్యం. రాష్ట్రాల‌కు సూచించిన కేంద్రం


వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సార్వ‌త్రికం చేసేందుకు దానిని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పెట్టేందుకు నిరంత‌రం కృషి చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం.

Posted On: 07 JUN 2021 3:37PM by PIB Hyderabad

దేశంలో వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం స‌జావుగా చురుకుగా కొన‌సాగేందుకు భార‌త ప్ర‌భుత్వం , మొత్తం ప్ర‌భుత్వం అన్న విధానంతో రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల కృషికి మ‌ద్ద‌తునిస్తున్న‌ది. వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన ఈ ఏడాది జ‌న‌వ‌రి 16నుంచి వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొనసాగుతున్న‌ది.
కేంద్ర ప్ర‌భుత్వం వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు కోవిన్ డిజిట‌ల్ ప్లాట్‌ఫారంను, దేశంలోని వివిధ కేట‌గిరిలీ ల‌బ్ధిదారుల కోసం అభివృద్ధి  చేసింది.  కోవిడ్ వాక్సినేష‌న్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను చురుకుగా ముందుకు తీసుకువెళ్లేందుకు కోవిన్  సాంకేతికంగా అండ‌గా నిలుస్తుంది.


వాక్సిన్ ప్ర‌క్రియ‌ను సార్వ‌త్రికం చేసేందుకు , దానిని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో కొన‌సాగించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం నిరంత‌ర కృషి కొన‌సాగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య  మంత్రిత్వ‌శాఖ ఈరోజు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు రాసిన లేఖ‌లో ప్ర‌త్యేక దివ్యాంగ గుర్తిఇపు (యుడిఐడి ) కార్డుల‌ను కోవిన్ 2.0 లో న‌మోదుకు ఫోటో గుర్తింపు కార్డుగా చేర్చాల‌ని సూచించింది.  కోవిన్ 2.0 కు మార్గ‌ద‌ర్శ‌కం పేరుతో విడుద‌లైన 2021 మార్చి 2 నాటి నోట్ లో ఆరు ఫోటో ఐడి కార్డుల‌ను సూచించారు. వాక్సినేష‌న్‌కు ముందు ప‌రిశీల‌న‌కోసం ఈ జాబితాను ఇచ్చారు.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కుఆ రాసిన లేఖ‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇందుకు సంబంధించిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ,  సామాజిక న్యాయం సాధికార‌త మంత్రిత్వ‌శాఖ‌, దివ్యాంగులకు సాధికార‌త క‌ల్పించే విభాగం వారికి జారీచేసిన యుడిఐడి కార్డుల‌లో అవ‌స‌ర‌మైన అన్ని వివ‌రాలు అంటే పేరు , పుట్టిన తేదీ, స్త్రీ లేదా పురుషుడు అన్న స‌మాచారం, ఆ వ్య‌క్తి ఫోటో వంటివ‌న్నీ ఉన్నాయ‌ని, కోవిడ్ -19 వాక్సినేష‌న్ కు అవ‌స‌ర‌మైన గుర్తింపున‌కు ఇవి ప‌నికివ‌స్తాయ‌న తెలిపారు.

 

దివ్యాంగుల‌కు  వాక్సినేష‌న్ అందుబాటులో ఉండేట్టు చేసేందుకు కోవిడ్ -19 వాక్సినేష‌న్‌కు నిర్దేశించిన గుర్తింపుకార్డుల జాబితాలో యుడిఐడిని చేర్చ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ప్రొవిజ‌న్ క‌ల్పిస్తున్నారు. దీనిని కోవిన్‌లో త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తారు.
 యుడిఐటి కార్డు ను కోవిడ్ వాక్సిన్ వేయించుకునేందుకు గుర్తింపు కార్డుగా వినియోగించ‌వచ్చ‌న్న విష‌యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ  రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచించింది.

యుడిఐడి న‌మూనాను కింద ఇవ్వ‌డం జ‌రిగింది.

 

***



(Release ID: 1725094) Visitor Counter : 166