ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో రెండు నెలల కనిష్ట స్థాయిలో 1.14 లక్షల కొత్త కరోనా కేసులు
వరుసగా 10 రోజులుగా 2 లక్షల లోపు కేసులు
చికిత్సలో ఉన్న కేసులు 15 లక్షలలోపు; 14,77,799 గా నమోదు
24వ రోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే అధికం
స్థిరంగా పెరుగుతున్న కోలుకున్నవారి శాతం, ప్రస్తుతం 93.67%కు చేరిక
రోజువారీ పాజిటివిటీ 5.62%కు తగ్గుదల; 13 రోజులుగా 10% లోపే
టీకాలలో 23కోట్ల డోసుల మైలురాయి దాటిన భారత్
Posted On:
06 JUN 2021 10:18AM by PIB Hyderabad
దేశంలో గత 24 గంటలలో 1,14,460 కొత్త కరోనాకేసులు నమోదయ్యాయి. ఇది గడిచిన రెండు నెలల్లో అత్యల్పం. వరుసగా 10 రోజులుగా దేశంలో కొత్త కేసులు 2 లక్షలలోపే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు సమన్వయంతో చేస్తున్న ఉమ్మడి కృషి ఫలితమే అందుకు కారణం
చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య 15 లక్షలలోపుకు పడిపోయి ప్రస్తుతం 14,77,799 గా నమోదైంది. ఇలా 20 లక్షలలోపు ఉండటం ఇది ఆరో రోజు. గత 24 గంతలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో నికరంగా 77,449 తగ్గుదల నమోదైంది. ఇది దేశం మొత్తంలోని పాజిటివ్ కేసులలో 5.13% మాత్రమే.
రోజూ ఎక్కువ సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో గత 24 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో 1,89,232 మంది కోలుకున్నారు. ఈ సంఖ్య అంతకుముందు రోజుకంటే 74,772 ఎక్కువ కావటం గమనార్హం
కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 2,69,84,781 మంది దానినుంచి బైటపడ్దారు. ఇది మొత్తం కోలుకున్నవారి శాతాన్ని 93.67% కు చేర్చటం ద్వారా పెరుగుతున్న ధోరణికి అద్దం పట్టింది. గత 24 గంటలలో 20,36,311 కరోనా పరీక్షలు జరపగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షల సంఖ్య 36.4 కోట్లకు (36,47,46,522) చేరింది.
ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా పాజిటివిటీ క్రమంగా తగ్గుతోంది. వారపు పాజిటివిటీ తగ్గుతూ ప్రస్తుతం 6.54% కు చేరగా రోజువారీ పాజిటివిటీ 5.62% గా నమోదైంది. 13 రోజులుగా ఇది 10% లోపే ఉంటోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 23 కోట్లు దాటటం మరో ముఖ్యమైన అంశం. దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 23.13 కోట్ల డోసులివ్వగా గత 24 గంటలలో ఇచ్చినవి 33,53,539. ఇప్పటిదాకా 32,42,503 శిబిరాల ద్వారా 23,13,22,417 డోసులిచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం చెబుతోంది.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
99,63,790
|
రెండో డోస్
|
68,55,261
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,61,65,342
|
రెండో డోస్
|
86,62,859
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
2,77,39,545
|
రెండో డోస్
|
1,61,253
|
45 - 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
7,07,15,580
|
రెండో డోస్
|
1,12,99,332
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
6,05,54,245
|
రెండో డోస్
|
1,92,05,210
|
మొత్తం
|
23,13,22,417
|
***
(Release ID: 1724893)
Visitor Counter : 313
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada