హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో చిక్కుకున్న విదేశీ పౌరుల భారతీయ వీసా లేదా స్టే స్టిపులేషన్ గడువు కాలం 31.08.2021 వరకు పొడిగింపు

Posted On: 04 JUN 2021 3:14PM by PIB Hyderabad

కోవిడ్-19 వల్ల విమానాలు లేక తిరిగి వెళ్లలేని విదేశీ పౌరుల భారతీయ వీసాలు లేదా స్టే స్టిపులేషన్ గడువు కాలాన్ని 31.08.2021 వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.   సరైన  వీసాలు లేదా స్టే స్టిపులేషన్ తో  దేశానికి వచ్చి మార్చ్ 2020 నుంచి సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విదేశీ పౌరులు వీటిని పొడిగించుకునే అంశంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  సరైన  వీసాలు లేదా స్టే స్టిపులేషన్ తో  దేశానికి వచ్చిన అనేకమంది విదేశీయులు విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో దేశంలో ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంగా వీరు తమ పత్రాల గడువును పొడిగించుకునే అంశంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తించినకేంద్ర హోం మంత్రిత్వశాఖ 29.06.2020 ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. దీనిప్రకారం 30.06.2020 తర్వాత గడువు ముగిసే అటువంటి విదేశీ పౌరులు సాధారణ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభమయ్యే  తేదీ నుంచి  మరో 30 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేదిగా భావిస్తారు.అయితేవిదేశీ పౌరులు తమ వీసాలు లేదా  స్టే స్టిపులేషన్ గడువును నెలవారీ ప్రాతిపదికన పొడిగించాలని కోరుతూ  దరఖాస్తు చేస్తున్నారు.

తాజా పరిస్త్రితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో  విదేశీ పౌరుల భారతీయ వీసాలు లేదా స్టే స్టిపులేషన్ గడువు కాలాన్ని 31.08.2021 వరకు పొడిగించాలని నిర్ణయించింది. గడువుకు మించి ఎక్కువ కాలం ఉండేవారికి విధించే జరిమానాను వీరికి విధించరు. వీసాల గడువును పొడిగించాలని వీరు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ / ఎఫ్‌ఆర్‌ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం ఉండదు.

దేశం నుంచి తిరిగి వెళ్లేముందు విదేశీ పౌరులు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ / ఎఫ్‌ఆర్‌ఓ అనుమతి పొందవలసి ఉంటుంది. గడువుకు మించి ఎక్కువ కాలం ఉండేవారి నుంచి వసూలు చేసే జరిమానాను వీరి నుంచి వసూలు చేయరు.

 

***


(Release ID: 1724471) Visitor Counter : 366