ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

1.96 లక్షల కేసులతో 40 రోజుల తరువాత 2 లక్షల లోపుకు పడిపోయిన కరోనా కొత్త కేసులు


చికిత్సలో ఉన్నవారి సంఖ్య 25,86,782 కు తగ్గుదల
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 9.54%

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల టీకా డోసులు
18-44 వయోవర్గానికి గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12.82 లక్షల డోసులు

Posted On: 25 MAY 2021 11:27AM by PIB Hyderabad

భారతదేశం కోవిడ్ మీద చేస్తున్న పొరులో ప్రోత్సాహకరమైన సంకేతం కనబరుస్తూ గత 40 రోజుల్లో మొదటి సారిగా కరోనా కొత్త కేసులు 2 లక్షల లోపుకు తగ్గాయి. గత 24 గంటలలో 1,96,427 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14నాడు ఇదే స్థాయిలో 1,84,372 కేసులు నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013Q26.png

చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు కూడా ప్రస్తుతం  25,86,782 కు తగ్గాయి. మే10న గరిష్ట స్థాయికి చేరుకోగా గత 24 గంటలలో  1,33,934 కేసులు తగ్గాయి. ఇది దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసులలో  9.60% 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029U5A.png

దేశంలో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య కొత్తగా వస్తున్న కేసులకంటే ఎక్కువగా ఉందటం వరుసగా 12 రోజులుగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో  3,26,850 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కొవిడ్ బారి నుంచి బైటపడినవారి సంఖ్య 2,40,54,861 కు చేరింది. జాతీయ స్థాయిలొ కోలుకున్నవారి శాతం 89.26% కు చేరింది. .

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ARO9.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FHRR.png

గత 24 గంటలలో మొత్తం 20,58,112 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా జరిపిన పరీక్షల సంఖ్య 33,25,94,176 కు చేరింది. రోజువారీ పాజిటివిటీ ప్రస్తుతం 9.54% కు తగ్గింది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FWKM.png

ఇప్పటివరకు  28,41,151  శిబిరాల ద్వారా 19,85,38,999 టీకా డోసుల పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 97,79,304 మొదటి డోసులు, 67,18,723 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,50,79,964 మొదటి డోసులు,   83,55,982 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న   1,19,11,759  మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 6,15,48,484 మొదటి డోసులు,  99,15,278 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,69,15,863 మొదటి డోసులు,   1,83,13,642 రెండొ డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,79,304

రెండవ డోస్

67,18,723

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,50,79,964

రెండవ డోస్

83,55,982

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,19,11,759

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,15,48,484

రెండవ డోస్

99,15,278

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,69,15,863

రెండవ డోస్

1,83,13,642

మొత్తం

19,85,38,999

 

గత 24 గంటలలో 18-44 వయోవర్గానికి 12.82 లక్షల కోవిడ్ టీకా డోసులిచ్చారు. మే 1 న ఈ వయోవర్గానికి టీకాలు మొదలు కాగా ఇప్పటివరకు ఇది రికార్డు.  

 

****


(Release ID: 1721577) Visitor Counter : 211