మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
701 వన్ స్టాప్ సెంటర్ల ద్వారా 35 రాష్ట్రాలు / యుటిలలో 3 లక్షలకు పైగా మహిళలకు సహాయం
Posted On:
22 MAY 2021 2:04PM by PIB Hyderabad
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ (ఓఎస్‌సి) ఇంతవరకు మూడు లక్షలకు పైగా మహిళలకు సహాయం అందించింది. ఈ పథకం 2015 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాపితంగా అమలు జరుగుతోంది. ప్రైవేటు మరియు ప్రదేశాలలో హింసకు గురవుతున్న మహిళలకు ఒకే చోట తక్షణం అత్యవసర పోలీసు, వైద్య, న్యాయ సహాయం మరియు కౌన్సెలింగ్, మానసిక ధైర్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతం (యుటి) పరిపాలనా యంత్రాంగాల ద్వారా ఈ కారక్రమం అమలు జరుగుతోంది. మహిళలు ఏ విధమైన హింసకు గురైనా ఈ కేంద్రాల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఇంతవరకు 35 రాష్ట్రాలు యుటీలలో 701 కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.
కోవిడ్ వల్ల నెలకొన్న పరిస్థితిలో సహాయం అవసరమైన మహిళలు లేదా హింసకు గురవుతున్న మహిళలు తమకు సమీపంలో ఉన్న కేంద్రాలను ఆశ్రయించి తగిన సహకారాన్ని పొందడానికి అవకాశం కల్పించారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు లాంటి సౌకర్యాలతో కేంద్రాలను లాక్ డౌన్ సమయంలో కూడా తెరచి ఉంచాలని అన్నియు రాష్ట్రాలు/యుటీలు, జిల్లాల డీసీ/డిఎం లను మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆదేశించింది.
మార్గదర్శకాల ప్రకారం కేంద్రాలను నిర్వహించే బాధ్యత ఆయా రాష్ట్రాలు / యుటిల పరిపాలనా యంత్రాంగం పై ఉంటుంది. న్యాయ, వైద్య, మానసిక, సామాజికపరమైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవసరమైన నిపుణులను ఆయా రాష్ట్రాలు/యుటీలు గుర్తించి నియమించవలసి ఉంటుంది. వివిధ రాఃష్టాలు/యుటీలకు మంజూరు చేయబడి పనిచేస్తున్న వన్ స్టాప్ సెంటర్ల వివరాలు:
పనిచేస్తున్న వన్ స్టాప్ సెంటర్లు
సీనియర్ నం.
|
రాష్ట్రం / యుటి పేరు
|
OSC ల సంఖ్య ఫంక్షనల్
|
1.
|
అండమాన్ మరియు నికోబార్ (యుటి)
|
03
|
2.
|
ఆంధ్రప్రదేశ్
|
13
|
3.
|
అరుణాచల్ ప్రదేశ్
|
24
|
4.
|
అస్సాం
|
33
|
5.
|
బీహార్
|
38
|
6.
|
చండీఘర్ (యుటి)
|
01
|
7.
|
ఛత్తీస్‌ఘర్
|
27
|
8.
|
దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ డియు (యుటి)
|
02
|
9.
|
ఢిల్లీ (యుటి)
|
11
|
10.
|
గోవా
|
02
|
11.
|
గుజరాత్
|
33
|
12.
|
హర్యానా
|
22
|
13.
|
హిమాచల్ ప్రదేశ్
|
12
|
14.
|
జమ్మూ కాశ్మీర్ (యుటి)
|
18
|
15.
|
జార్ఖండ్
|
24
|
16.
|
కర్ణాటక
|
30
|
17.
|
కేరళ
|
14
|
18.
|
లక్షదీవులు (యుటి)
|
01
|
19.
|
లడఖ్ (యుటి)
|
01
|
20.
|
మహారాష్ట్ర
|
37
|
21.
|
మధ్యప్రదేశ్
|
52
|
22.
|
మణిపూర్
|
16
|
23.
|
మేఘాలయ
|
11
|
24.
|
మిజోరం
|
08
|
25.
|
నాగాలాండ్
|
11
|
26.
|
ఒడిశా
|
31
|
27.
|
పంజాబ్
|
22
|
28.
|
పుదుచ్చేరి (యుటి)
|
04
|
29.
|
రాజస్థాన్
|
33
|
30.
|
సిక్కిం
|
04
|
31.
|
తమిళనాడు
|
34
|
32.
|
తెలంగాణ
|
33
|
33.
|
త్రిపుర
|
08
|
34.
|
ఉత్తర ప్రదేశ్
|
75
|
35.
|
ఉత్తరాఖండ్
|
13
|
మొత్తం
|
|
701
|
పనిచేస్తున్న కేంద్రాల వివరాలు https://wcd.nic.in/schemes/one-stop-centre-scheme-1లో లభిస్తాయి.
***
(Release ID: 1720902)
Visitor Counter : 257