ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒక రోజులో 20.66 లక్షల కోవిడ్ పరీక్షలతో భారత సరికొత్త రికార్డ్
వరుసగా నాలుగు రోజులుగా రోజుకు 20 లక్షలకు మించి పరీక్షలు
రోజువారీ పాజిటివిటీ శాతం 12.45% కు తగ్గుదల
వరుసగా తొమ్మిదో రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ 6 రోజులుగా రోజుకు కొత్త కేసులు 3 లక్షలలోపే
Posted On:
22 MAY 2021 11:40AM by PIB Hyderabad
గడిచిన 24 గంటలలో 20.66 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం ద్వారా భారతదేశం ఒక రోజులో అత్యధిక కోవిడ్ పరీక్షలు జరిపిన దేశంగా తన రికార్డును తానే తిరగరాసింది. పైగా వరుసగా నాలుగు రోజులుగా 20 లక్షలకు పైగా నే పరీక్షలు జరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ శాతం 12.45% కు తగ్గింది. గత 24 గంటలలో జరిపిన కోవిడ్ పరీక్షలు 20,66,285.
వరుసగా తొమ్మిదో రోజు కూడా దేశంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. గత 24 గంటలలో 3,57,630 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,30,70,365 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.76% కు చేరగా కొత్తగా కోలుకున్నవారిలో 73.46% మంది పది రాష్ట్రాలవారే ఉన్నారు.
గత 24 గంటలలో దేశంలో వరుసగా ఆరోరోజు కూడా 3 లక్శ్జల లోపే కొత్త కేసులు నమోదు కావటం మరో సానుకూల పరిణామం . గడిచిన 24 గంటల్లో 2,57,299 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలవాటా 78.12% ఉండగా తమిళనాడులో నిన్న అత్యధికంగా 36,184 కేసులు, కర్నాటకలో 32,218 కేసులు వచ్చాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ నేడు 29,23,400 కి చేరింది. గత 24 గంటలలో నికరంగా తగ్గిన కేసులు 1,04,525 కు చేరాయి. వీరి సంఖ్య దేశలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 11.12%. ఇందులో 69.94% వాటా ఎనిమిది రాష్ట్రాలదే.
గత 24 గంటల్లో రాష్టాల్లో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్యలో మార్పును ఈ క్రింది చిత్ర పటం చూపుతోంది.
దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల కార్యక్రమం కూడా వేగం పుంజుకోవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన టీకాల సంఖ్య 19.33 కోట్లు దాటింది. మొత్తం 27,76,936 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా 19,33,72,819 టీకా డోసుల పంపిణీ జరగగా ఇందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 97,38,148 మొదటి డోసులు, 66,91,350 రెండో డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న 1,48,70,081 మొదటిడోసులు, 83,06,020 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు అందుకున్న 92,97,532 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 6,02,11,957 మొదటి డోసులు, 96,84,295 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,63,83,760 మొదటి డోసులు, 1,81,89,676 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
97,38,148
|
రెండో డోస్
|
66,91,350
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,48,70,081
|
రెండో డోస్
|
83,06,020
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
92,97,532
|
45-60 వయోవర్గం
|
మొదటీ డోస్
|
6,02,11,957
|
రెండో డోస్
|
96,84,295
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,63,83,760
|
రెండో డోస్
|
1,81,89,676
|
మొత్తం
|
19,33,72,819
|
మొత్తం ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 66.30% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.
***
(Release ID: 1720852)
Visitor Counter : 238
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam