ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 19 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ


24 గంటల్లో 20.61 లక్షల పరీక్షలతో భారత్ మరో రికార్డ్
రోజువారీ పాజిటివిటీ 12.59% కు తగ్గుదల

వరుసగా 8వ రోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారు అధికం
వరుసగా ఐదోరోజున 3 లక్షలలోపు కొత్త కేసులు

Posted On: 21 MAY 2021 11:53AM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో భారత్ మరో మైలురాయి దాటింది. మూడో దశ టీకాల కార్యక్రమం కూడా వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 19 కోట్లు దాటి 19,18,79,503 కు చేరింది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా మొత్తం 27,53,883 శిబిరాల ద్వారా 19,18,79,503 టీకా డోసులివ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 97,24,339 మొద్ డోసులు,   66,80,968 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,47,91,600 మొదటి డోసులు, 82,85,253  రెండో డోసులు,  18-44 వయోవర్గం వారు తీసుకున్న 86,04,498 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,98,35,256 మొదటి డోసులు,  95,80,860 రెండో డోసులు,  60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,62,45,627  మొదటి డోసులు, 1,81,31,102 రెండో డోసులు  ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,24,339

రెండవ డోస్

66,80,968

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,47,91,600

రెండవ డోస్

82,85,253

18-44 వయోవర్గం

మొదటి డోస్

86,04,498

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,98,35,256

రెండవ డోస్

95,80,860

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,62,45,627

రెండవ డోస్

1,81,31,102

 

మొత్తం

19,18,79,503

 

ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలో  66.32% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y85V.jpg

గడిచిన 24 గంటలలో 20.61 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారన పరీక్షలు జరిగాయి. దీంతో భారత దేశం ఒక్క రోజులో జరిపిన  కోవిడ్ పరీక్షల పరంగా తన రికార్డును తానే తిరగరాస్తూ మరో ప్రపంచ రికార్డు సృష్టించింది.

 మరోవైపు రోజువారీ పాజిటివిటీ శాతం 12.59% కు తగ్గింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025BA8.jpg

దేశంలో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ గత ఎనిమిది రోజులుగా కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటలలో  3,57,295 మంది కోవిడ్ బారినుంచి కోలుకుని బైటపడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,27,12,735 కు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.25% చేరింది.

కొత్తగా కోలుకున్నవారిలో 74.55% వాటా 10 రాష్ట్రాలదే కావటం గమనార్హం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AM7T.jpg

వరుసగా ఐదు రోజులుగా రోజువారీ కొత్త కేసులు 3 లక్షలకు లోపే ఉండటం కూడా మరో సానుకూల పరిణామం.  గత 24 గంటలలో దేశంలో 2,59,551 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల్లోనే 76.66% కేసులు వచ్చాయి. తమిళనాడులో అత్యధికంగా  ఒక్క రోజులో 35,579 కేసులు రాగా కేరళలో 30,491 వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043L64.jpg

మరోవైపు దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నేటికి 30,27,925 కు తగ్గింది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా  1,01,953 తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  11.63%.  చికిత్సలో ఉన్నవారిలో  69.47% మంది కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FH3H.jpg

 ****


(Release ID: 1720593) Visitor Counter : 210