ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారుల‌తో మాట్లాడిన ప్ర‌ధానమంత్రి


గ్రామీణ , ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు అనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకోవాల‌సిందిగా అధికారుల‌ను కోరిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 MAY 2021 1:31PM by PIB Hyderabad

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌స్థాయి, జిల్లా అధికారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా మాట్లాడారు.
ఈ సంద‌ర్భంగా అధికారులు , కోవిడ్ -19పై పోరాటంలో ప్ర‌ధానమంత్రి నాయ‌క‌త్వానికి ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపార‌ర‌రు. త‌మ త‌మ ప్రాంతాల‌లో కోవిడ్ ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్న తీరును అధికారులు ప్ర‌ధాన‌మంత్రికి వివ‌రించారు.  రియ‌ల్ టైమ్ మానిట‌రింగ్‌, సామ‌ర్ధ్యాల నిర్మాణానికి  సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం గురించిన త‌మ అనుభ‌వాల‌ను వారు  ఆయ‌న‌కు వివ‌రించారు. త‌మ త‌మ జిల్లాల‌లో కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు అలాగే ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచేందుకు తీసుకున్న చ‌ర్య‌ల గురించి కూడా వారు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధానమంత్రి, కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ పూర్తి అంకిత‌భావం క‌లిగి ఉండాల‌న్నారు. క‌రోనా వైర‌స్ వ‌ర్క్‌ను మ‌రింత డిమాండింగ్‌గా , ఛాలెంజింగ్‌గా మార్చ వేసింద‌ని అన్నారు.  ఈ కొత్త స‌వాళ్ళ నేప‌థ్యంలో  నూత‌న వ్యూహాలు, కొత్త ప‌రిష్కారాలు అవ‌స‌ర‌మ‌న్నారు. గ‌డ‌చిన కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ప్రారంభ‌మైంద‌ని అన్నారు. అయితే ఇన్‌ఫెక్ష‌న్ అత్య‌ల్ప స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ ఈ స‌వాలు ఉంటూనే ఉంటుంద‌ని ప్ర‌ధానమంత్రి హెచ్చ‌రించారు.


కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారులు సాగిస్తున్న అద్భుత కృషిని ప్ర‌ధాన‌మంత్రి కొనియాడారు. వారి అనుభ‌వాలు,  స్పంద‌న‌లు మ‌రింత ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన‌, ప‌టిష్ట‌మైన‌
విధానాల రూప‌క‌ల్ప‌న‌కు ఉప‌యోగ‌ప‌డిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపాఉ.  రాష్ట్రాలు, అన్నిస్థాయిల‌లోని వివిధ స్టేక్ హోల్డ‌ర్ల స‌ల‌హాల‌ను మిళితం చేసుకుంటూ వాక్సినేష‌న్ వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

స్థానిక అనుభ‌వాల‌ను ఉపయోగించుకోవాల‌ని, దేశం అంతా ఒక్క‌టిగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. గ్రామాలు క‌రోనా ర‌హితంగా ఉండేలా సందేశాన్ని వ్యాప్తి చేయాల‌ని, కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌ను ప్ర‌జ‌లు పాటించేలా చూడాల‌న్నారు. కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ కోవిడ్ నిరోధానికి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌న్నారు. గ్రామీణ , ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు ప్ర‌త్యేకంగా వ్యూహాలు రూపొందించుకోవాల‌ని, గ్రామీణ భార‌త‌దేశాన్ని కోవిడ్ ర‌హితం అయ్యేలా చూడాల‌ని ప్ర‌ధానమంత్రి కోరారు.

 నిరంత‌ర ఆవిష్క‌ర‌ణ‌లు కొన‌సాగించాల‌ని, మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కోవ‌డంలో మ‌న విధానాల‌ను మార్చుకోవాల‌ని   ప్ర‌తి మ‌హ‌మ్మారి మ‌న‌కు బోధిస్తూ వ‌చ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.  వైర‌స్ మ్యుటేష‌న్‌లో, త‌న ఫార్మెట్‌ను మార్చుకోవ‌డంలో నైపుణ్యం క‌ల‌ది క‌నుక కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో మ‌నం మ‌న వ్యూహాల‌ను , ప‌ద్ధ‌తుల‌ను డైన‌మిక్ గా ఉండేలా చూసుకోవాల‌న్నారు.  
వైర‌స్ మ్యుటేష‌న్ యువ‌త‌, చిన్నారుల విష‌యంలో ఆందోళ‌న క‌లిగించేదిగా ఉంద‌న్నారు. వాక్సినేష‌న్ డ్రైవ్‌ను  మ‌రింత ముందుకు తీసుకుపోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు.

వాక్సిన్ వృధా గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధానమంత్రి, ఒక్క వాక్సిన్ వృధా కావ‌డం అంటే ఒక వ్య‌క్తికి అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోవ‌డ‌మే న‌ని అన్నారు. అందువ‌ల్ల వాక్సిన్ వృధాను అరిక‌ట్టాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు.

ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతూ వారి జీవ‌నాన్ని సుల‌భ‌తరం చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిన్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని  ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. పేద‌ల‌కు ఉచిత రేష‌న్ , ఇత‌ర అత్య‌వ‌స‌రాలు అందించేందుకు స‌దుపాయం క‌ల్పించాల‌ని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరిక‌ట్టాల‌ని కోరారు. కోవిడ్‌పై పోరాటంలో విజ‌యం సాధించి ముందుకు సాగ‌డానిఇకి ఈ చ‌ర్యలు కూడా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

***



(Release ID: 1720327) Visitor Counter : 209