ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వరుసగా ఏడో రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ వరుసగా నాలుగు
రోజులుగా రోజుకు 3 లక్షల లోపు కొత్తకేసులు
24 గంటలలో 20.55 లక్షల పరీక్షలతో భారత్ సరికొత్త రికార్డ్
Posted On:
20 MAY 2021 11:14AM by PIB Hyderabad
భారత్ లో వరుసగా ఏడో రోజుకూడా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా నమోదవుతున్నారు. గత 24 గంటలలో 3,69,077 మంది కోవిడ్ బారినుంచి బైటపడ్దారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య
2,23,55,440 కు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో కీలుకున్నవారి శాతం 86.74% కు పెరిగింది. కొత్తగా కోలుకున్నవారిలో 75.11% మంది పది రాష్ట్రాలకు చెందినవారే.
మరో సానుకూల పరిణామంగా భారత్ లో వరుసగా నాలుగు రోజులుగా కొత్త కేసులు రోజుకు 3 లక్షల లోపే ఉంటున్నాయి.
గత 24 గంటలలో 2,76,110 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలవాటా 77.17% నమోదైంది. తమిళనాడులో అత్యధికంగా ఒక్క రోజులో 34,875 కేసులు రాగా, కర్నాటకలో 34,281 నమోదయ్యాయి.
మరోవైపు చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ నేటికి 31,29,878 కి చేరింది. గత 24 గంటలలో వీరి సంఖ్య నికరంగా
96,841 తగ్గింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12.14% ఉంది. చికిత్సలో ఉన్నవారిలో 69.23% మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.
గత 24 గంటలలో రాష్ట్రాలవారీగా చికిత్సలో ఉన్న కేసుల సంఖ్యలో మార్పును ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.
గడిచిన 24 గంటలలో 20.55 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. భారత్ లొ ఒక్క రోజులో ఇంత భారీ సంక్యలో పరీక్షలు జరగటం ఇదే మొదటిసారి. దీంతో భారత్ నిన్నటి తన రికార్డును తానే బద్దలు చేసుకున్నట్టయింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ శాతం 13.44% ఉండగా గత 24 గంటలలో జరిగిన మొత్తం పరీక్షలు 20,55,010 గా నమోదయ్యాయి.
జాతీయ స్థాయిలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం 1.11% గా ఉంది. గత 24 గంటలలో 3,874 మరణాలు నమోదయ్యాయి. ఇందులో పది రాష్టాల వాటా 72.25% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 594 మంది ఒక్క రోజులో చనిపోగా ఆ అతరువాత స్థానంలో ఉన్న కర్నాటకలొ 468 మరణాలు నమోదయ్యాయి.
మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలవటంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు 18.7 కోట్లకు చేరాయి. 27,31,435 శిబిరాల ద్వారా 18,70,09,792 టీకాలిచ్చినట్టు ఈ ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 96,85,934 మొదటి డోసులు, 66,67,394 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,46,36,501 మొదటి డోసులు, 82,56,381 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారికిచ్చిన 70,17,189 మొదటి డోసులు, 45060 వయోవర్గం వారికిచ్చిన 5,83,47,950 మొదటి డోసులు, 94,36,168 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 5,49,36,096 మొదటి డోసులు, 1,80,26,179 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
96,85,934
|
రెండవ డోస్
|
66,67,394
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,46,36,501
|
రెండవ డోస్
|
82,56,381
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
70,17,189
|
45- 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
5,83,47,950
|
రెండవ డోస్
|
94,36,168
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,49,36,096
|
రెండవ డోస్
|
1,80,26,179
|
|
మొత్తం
|
18,70,09,792
|
ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలో 66.61% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం
***
(Release ID: 1720266)
Visitor Counter : 176