ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 వ్యాధి నిర్వహణపై దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా అధికారులతో సంభాషించనున్న - ప్రధానమంత్రి

Posted On: 17 MAY 2021 7:29PM by PIB Hyderabad

 

కోవిడ్ మహమ్మారిని నిర్వహించడంలో, రాష్ట్రాలు, జిల్లాల క్షేత్ర స్థాయి అధికారుల అనుభవాలను తెలుసుకోడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మే నెల, 18వ తేదీ ఉదయం 11 గంటలకు, వారితో సంభాషించనున్నారు.

ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో అంటువ్యాధి ఎక్కువగా వ్యాపించడంతో, కేసుల సంఖ్య భారీగా ఉంది.  

వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో, కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధునాతనంగా నిర్వహిస్తున్నారు. వారిలో చాలామంది గొప్ప చొరవ చూపిస్తూ, ఊహాత్మక పరిష్కారాలతో ముందుకు వస్తున్నారు.  ఇటువంటి కార్యక్రమాలను ప్రశంసించి, ప్రోత్సహిస్తే, సమర్థవంతమైన ప్రతిస్పందన ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్య వ్యూహాలను అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన విధానాన్ని అమలుపరచడానికి సహాయపడతాయి.  ఈ జిల్లాలు ప్రస్తుత పరిస్థితిని నిర్వహించడానికి అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా - వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారని నిర్ధారించడం నుండి, రెండవ దశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను సిద్ధం చేసే వరకు;  అదేవిధంగా, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శ్రామిక శక్తిని అందుబాటులో ఉంచుకోవడం;  సరఫరా వ్యవస్థకు అవరోధాలు లేని రవాణా సౌకర్యాలు సమకూర్చుకోవడం వంటి అనేక ప్రభావవంతమైన చర్యలు చేపట్టాయి. వీటిలో దేశవ్యాప్తంగా అమలుచేయడానికి ఆదర్శంగా నిలిచే, అనేక విజయగాథలు కూడా ఉన్నాయి.

గౌరవనీయ ప్రధానమంత్రితో వారి పరస్పర సంభాషణల సందర్భంగా, అధికారులు కోవిడ్-19 కి వ్యతిరేకంగా, ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోరాటాన్ని కొనసాగించడానికి సూచనలు, సిఫార్సులతో పాటు, కొన్ని ఉత్తమ పద్ధతులను పంచుకోనున్నారు.

రేపటి సమావేశంలో కర్ణాటక, బీహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ కి చెందిన అధికారులు పాల్గొంటారు.

*****


(Release ID: 1719547) Visitor Counter : 213