ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 18 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు


18-44 వయోవర్గంలో 42 లక్షలమందికి పైగా టీకాలు

కొత్తకేసులకంటే 5 రోజుల్లో 4 సార్లు కోలుకున్నవారే అధికం
గత 24 గంటల్లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 31,091 తగ్గుదల

విదేశీ సాయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు పంపుతున్న కేంద్రం

Posted On: 15 MAY 2021 11:22AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలుకాగా ఇప్పటిదాకా ఇచ్చిన కొవిడ్ టీకా డోసుల సంఖ్య 18 కోట్లు దాటింది.  మొత్తం 18,04,57,579 టీకా డోసులు 26,02,435 శిబిరాల ద్వారా ఇచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  96,27,650 మొదటి డోసులు,  66,22,040 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,43,65,871 మొదటి డోసులు,   81,49,613 రెండో డోసులు, 18045 వయోవర్గం వారు తీసుకున్న 42,58,756 మొదటి డోసులు,  45-60 వయోవర్గం వారు తీసుకున్న  5,68,05,772 మొదటి డోసులు,  87,56,313 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న    5,43,17,646  మొదటి డోసులు, 1,75,53,918 రెండో డోసులు ఉన్నాయి.   

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,27,650

రెండవ డోస్

66,22,040

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,43,65,871

రెండవ డోస్

81,49,613

18-44 వయోవర్గం

మొదటి డోస్

42,58,756

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,68,05,772

రెండవ డోస్

87,56,313

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,43,17,646

రెండవ డోస్

1,75,53,918

 

మొత్తం

18,04,57,579

 

 ఇప్పటిదాకా దేశమంతటా ఇచ్చిన టీకాలలో 10 రాష్ట్రాలదే 66.73% వాటా ఉంది.   

 

18-44 వయోవర్గానికి చెందిన 3,28,216 మంది లబ్ధిదారులు గత 24 గంటలలో మొదటిడోస్ అందుకోగా ఇప్పటి వరకు మొత్తం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 42,58,756 మంది ఈ వయోవర్గం వారు టీకాలు తీసుకున్నారు.  

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్- నికోబార్ దీవులు

1,176

2

ఆంధ్రప్రదేశ్

2,624

3

అస్సాం

1,60,139

4

బీహార్

5,08,034

5

చండీగఢ్

974

6

చత్తీస్ గఢ్

1,028

 7

దాద్రా, నాగర్ హవేలి

1,663

8

డామన్-డయ్యూ

2,036

9

ఢిల్లీ

5,26,232

10

గోవా

1,858

11

గుజరాత్

4,50,980

12

హర్యానా

3,99,946

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూ కశ్మీర్

30,642

15

జార్ఖండ్

32,469

16

కర్నాటక

1,08,059

17

కేరళ

1,364

18

లద్దాఖ్

86

19

మధ్యప్రదేశ్

1,36,369

20

మహారాష్ట్ర

6,40,922

21

మేఘాలయ

1,920

22

నాగాలాండ్  

4

23

ఒడిశా

1,23,086

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

6,403

26

రాజస్థాన్

6,14,253

27

తమిళనాడు

28,241

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

3,66,239

31

ఉత్తరాఖండ్

88,277

32

పశ్చిమ బెంగాల్

23,214

మొత్తం

42,58,756

 

 గత 24 గంటలలో 11 లక్షలకు పైగా టీకాలిచ్చారు. టీకాలు మొదలైన 119 వ రోజైన మే 14 నాడు 11,03,625 టీకా డోసులివ్వగా అందులో 11,628 శిబిరాలద్వారా 6,29,445 మంది మొదటి డోస్,  4,74,180 మంది రెండో డోస్ తీసుకున్నారు.  .

తేదీ: మే 14, 2021 (119వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

8,861

రెండవ డోస్

16,604

కొవిడ్ యోధులు

మొదటి డోస్

39,258

రెండవ డోస్

31,058

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,28,316

45- 60 వయోవర్గం

మొదటి డోస్

1,83,313

రెండవ డోస్

2,04,871

60 పైబడ్డవారు

మొదటి డోస్

69,697

రెండవ డోస్

2,21,647

మొత్తం

మొదటి డోస్

6,29,445

రెండవ డోస్

4,74,180

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య నేటికి 2,04,32,898 కి చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 83.83%. గత 24 గంటలలో 3,53,299 మంది కోలుకోగా కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత ఐదు రోజులలో ఇది నాలుగో సారి. కోలుకున్నవారిలో 70.49% మంది పది రాష్ట్రాలవారే ఉన్నారు.  

 

దేశంలో చికిత్సలొ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 36,73,802 కు తగ్గి పాజిటివ్ కేసులలో 15.07%  అయింది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 31,091 తగ్గింది. చికిత్సలో ఉన్నవారిలో 11 రాష్ట్రాలవాటా  77.26% ఉంది.

 

గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్యలో వచ్చిన మార్పును రాష్ట్రాలవారీగా ఇక్కడ చూడవచ్చు.

గత 15 రోజులలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో వస్తున్నమార్పులను ఈ దిగువ చిత్రపటంలో చూడవచ్చు. 

విదేశాలనుంచి అందుతున్న కోవిడ్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అత్యంత వేగంగా  రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతోంది. ఇప్పటిదాకా మొత్త 10,796 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు ; 12,269 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 6,497 వెంటిలేటర్లు,  4.2 లక్షలకు అపిగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోడ్డు, వాయు మార్గాల ద్వారా పంపారు.

గత 24 గంటలలో 3,26,098 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలవాటా 74.85%. కర్నాటకలో అత్యధికంగా  41,779 కొత్త కే సులు రాగా ఆ తరువాత స్థానాల్లో ఉన్న మహారాష్ట్రలో  39,923, కేరళలో 34,694 వచ్చాయి.  

 

జాతీయ స్థాయిలో కోవిడ్ సోకినవారిలో మరణాల శాతం 1.09% గా ఉంది. గత 24 గంటలలో 3,890 మంది కోవిడ్ తో చనిపోయారు. పది రాష్ట్రాలకు చెందిన మృతులే 72.19% ఉండగా మహారాష్ట్ర లో అత్యధికంగా 695 మంది చనిపోగా కర్నాటకలో 373 మంది చనిపోయారు

***


(Release ID: 1718806) Visitor Counter : 208