ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ ఉపశమన సాయంపై తాజా సమాచారం


ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజించి; కొవిడ్‌ నిర్వహణ కోసం రాష్ట్రాలు, యూటీల్లోని తృతీయ సంస్థలకు వేగంగా అందజేసింది

ఇప్పటివరకు 9200 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, 5243 ఆక్సిజన్‌ సిలిండర్లు, 19 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 5913 వెంటిలేటర్లు/బిపాప్‌, 3.44 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ పంపిణీ

Posted On: 11 MAY 2021 3:42PM by PIB Hyderabad

దేశంలో విజృంభిస్తున్న కొవిడ్‌పై దేశం చేస్తున్న పోరాటానికి మరింత పదును పెట్టేందుకు; గత నెల 27వ తేదీ నుంచి వివిధ ప్రపంచ దేశాలు, సంస్థల ద్వారా కరోనా ఉపశమన వైద్య సామగ్రిని సాయంగా కేంద్ర ప్రభుత్వం అందుకుంటోంది. ఈ అంతర్జాతీయ సాయాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వేగంగా అందించడానికి, "హోల్ ఆఫ్ గవర్నమెంట్" విధానం కింద, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు సజావుగా సహకరిస్తున్నాయి.

    గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 9200 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, 5243 ఆక్సిజన్‌ సిలిండర్లు, 19 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 5913 వెంటిలేటర్లు/బిపాప్‌, 3.44 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను రహదారి, వాయుమార్గాల ద్వారా పంపిణీ చేశారు. 

    యూఏఈ, ఇజ్రాయెల్‌, ఈఎస్‌ఏ, నెదర్ల్యాండ్స్‌ నుంచి ఈ నెల 10న వచ్చిన ముఖ్య సామగ్రి:
వెంటిలేటర్లు/బిపాప్‌/సిపాప్‌ (610)
ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు (300)
 ఫవిఫిరావిర్‌ - 12600 స్ట్రిప్పులు (ప్రతి స్ట్రిప్పులో 40 మాత్రలు)

    రాష్ట్రాలు, యూటీలకు వైద్య పరికరాల సమర్థవంతమైన తక్షణ కేటాయింపు, క్రమబద్ధమైన బట్వాడా ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతరం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. విదేశీ కొవిడ్‌ ఉపశమన సామగ్రిని స్వీకరించడం, వాటిని గ్రాంట్లు, సాయం, విరాళాల రూపంలో  కేటాయించడం వంటి కార్యక్రమాలను సమన్వయం చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 26 నుంచి ఈ విభాగం పనిచేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించి, ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేస్తోంది.

 

ఫొటో 1. నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగల, యూకే నుంచి వచ్చిన ఉత్పత్తి ప్లాంటును గత రాత్రి దిల్లీ నుంచి అసోంలోని చిరాంగ్‌కు తరలింపు

ఫొటో 2. వివిధ రాష్ట్రాలకు పంపిణీ కోసం; 40 మె.ట. ద్రవరూప ఆక్సిజన్‌తో కూడిన 2 ఐఎస్‌వో ఆక్సిజన్‌ ట్యాంకులు, 200 ఆక్సిజన్ సిలిండర్లు, 4 హై-ఫ్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను కువైట్‌ నుంచి నిన్న సాయంత్రం మంగళూరు పోర్టుకు తీసుకొచ్చిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా

ఫోటో 3. వివిధ రాష్ట్రాలకు పంపిణీ కోసం; 3600 ఆక్సిజన్ సిలిండర్ల వైద్య సాయాన్ని సింగపూర్‌ నుంచి నిన్న సాయంత్రం విశాఖ ఓడరేవుకు తీసుకొచ్చిన ఐఎన్ఎస్ ఐరావత్

***



(Release ID: 1717895) Visitor Counter : 181