ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అక్సిజెన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, ఉత్పత్తి ప్లాంట్లు, 3.4 లక్షల రెమిడిసివర్ ఇంజెక్షన్లు సహా విదేశీ సాయం రాష్ట్రాలకు పంపిణీ
61 రోజుల తరువాత మొదటి సారిగా గత 24 గంటలలో కొత్తకేసులకంటే ఎక్కువగా కోలుకుంటున్నవారి సంఖ్య
2 నెలల తరువాత చికిత్సలో ఉన్న కేసులు 30,016 తగ్గుదల
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 25.5 లక్షలమందికి టీకాలు
Posted On:
11 MAY 2021 11:40AM by PIB Hyderabad
భారతదేశం కోవిడ్ మీద జరుగుతున్న పోరుకు సహకరిస్తూ విదేశాలనుంచి అందిన 8,900 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, 5,043 ఆక్సిజెన్ సిలిండర్లు, 18 ఆక్సిజెన్ ఉత్పత్తి కేంద్రాలు, 5,698 వెంటిలేటర్లు, 3.4 లక్షలకు పైగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపటం ద్వారా వారి కార్యకలాపాలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. వీలైనంత వేగంగా ప్రపంచ సాయం రాష్ట్రాలకు అందించటానికి కేంద్రప్రభుత్వం కస్టమ్ అనుమతులు, రవాణా అనుమతులు వేగవంతం చేసింది.
మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలు కావటంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 17.27 కోట్లు దాటింది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 30,016 నమోదయింది. ఇది గత రెండు నెలలలో మొదటి సారిగా నమోదైన తక్కువ సంఖ్య. అదే విధంగా 61 రోజుల తరువాత కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులను మించిపోయింది. భారత్ లో రోజువారీ కొత్త కేసులు, కోలుకుంటున్నవారి సంఖ్య ఈ క్రింది పట్టికలో పొందుపరచబడింది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 25,15,519 శిబిరాల ద్వారా 17,27,10,066 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 95,64,242 మొదటి డోసులు, 65,05,744 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,40,54,058 మొదటి డోసులు, 78,53,514 రెండో డోసులు, 18-44 వయోవర్గానికిచ్చిన 25,59,339 మొదటీ డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన 5,55,10,630 మొదటీ డోసులు, 71,95,632 రెండో డోసులు, 60 పైబడిన వారికిచ్చిన 5,38,06,205 మొదటి డోసులు, 1,56,60,702 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
1వ డోస్
|
95,64,242
|
2వ డోస్
|
65,05,744
|
కోవిడ్ యోధులు
|
1వ డోస్
|
1,40,54,058
|
2వ డోస్
|
78,53,514
|
18-44 వయోవర్గం
|
1వ డోస్
|
25,59,339
|
45 - 60 వయోవర్గం
|
1వ డోస్
|
5,55,10,630
|
2వ డోస్
|
71,95,632
|
60 పైబడ్డవారు
|
1వ డోస్
|
5,38,06,205
|
2వ డోస్
|
1,56,60,702
|
|
మొత్తం
|
17,27,10,066
|
ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 66.7% వాటా పది రాష్టాలలోనే ఇచ్చారు..
18-44 వయోవర్గంలో 5,24,731 మంది గత 24 గంటలలో టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా మొత్తం 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 25,59,339 మందికి ఈ మూడోదశలో టీకాలిచ్చారు. 18-44 వయోవర్గానికి ఇచ్చిన టీకాల సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
1,059
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
812
|
3
|
అస్సాం
|
1,06,750
|
4
|
బీహార్
|
1,79,507
|
5
|
చండీగఢ్
|
2
|
6
|
చత్తీస్ గఢ్
|
1,026
|
7
|
ఢిల్లీ
|
3,66,391
|
8
|
గోవా
|
1,228
|
9
|
గుజరాత్
|
3,24,192
|
10
|
హర్యానా
|
2,94,109
|
11
|
హిమాచల్ ప్రదేశ్
|
14
|
12
|
జమ్మూ-కశ్మీర్
|
29,139
|
13
|
జార్ఖండ్
|
94
|
14
|
కర్నాటక
|
21,485
|
15
|
కేరళ
|
397
|
16
|
లద్దాఖ్
|
86
|
17
|
మధ్యప్రదేశ్
|
48,910
|
18
|
మహారాష్ట్ర
|
5,10,518
|
19
|
మేఘాలయ
|
2
|
20
|
నాగాలాండ్
|
4
|
21
|
ఒడిశా
|
50,062
|
22
|
పుదుచ్చేరి
|
1
|
23
|
పంజాబ్
|
4,163
|
24
|
రాజస్థాన్
|
4,13,411
|
25
|
తమిళనాడు
|
16,735
|
26
|
తెలంగాణ
|
500
|
27
|
త్రిపుర
|
2
|
28
|
ఉత్తరప్రదేశ్
|
1,67,308
|
29
|
ఉత్తరప్రదేశ్
|
14,340
|
30
|
పశ్చిమ బెంగాల్
|
7,092
|
మొత్తం
|
25,59,339
|
గత 24 గంటలలో 25 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 115 వ రోజున ( మే 10న )
25,03,756 మందికి 18,542 శిబిరాల ద్వారా 10,75,948 మొదటి డోసులు, 14,27,808 రెండో డోసులు ఇచ్చారు.
తేదీ: మే 10, 2021 ( 115 వరోజు)
ఆరోగ్య సిబ్బంది
|
1వ డోస్
|
16,754
|
2వ డోస్
|
33,931
|
కోవిడ్ యోధులు
|
1వ డోస్
|
79,417
|
2వ డోస్
|
96,884
|
18-44 వయోవర్గం
|
1వ డోస్
|
5,24,731
|
45- 60 వయోవర్గం
|
1వ డోస్
|
3,25,342
|
2వ డోస్
|
6,26,213
|
60 పైబడ్డవారు
|
1వ డోస్
|
1,29,704
|
2వ డోస్
|
6,70,780
|
మొత్తం
|
1వ డోస్
|
10,75,948
|
2వ డోస్
|
14,27,808
|
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,90,27,304 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 82.75%. గత 24 గంటలలో 3,56,082 కోలుకున్నారు. ఇందులో పది రాష్ట్రాల వాటా 72.28% .
గత 24 గంటలలో 3,29,942 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 69.88% వాటా పది రాష్ట్రాలదే. కర్నాటకలో అత్యధికంగా 39,305 కొత్త కేసులు కాగా, మహారాష్ట్రలో 37,236, తమిళనాడులో 28,978 కేసులు వచ్చాయి.
దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 37,15,221కు తగ్గాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 16.16%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు నికరంగా 30,016 తగ్గాయి. గత 61 రోజులలో ఈ విధమైన తగ్గుదల నమోదవటం ఇదే మొదటి సారి. చికిత్సలో ఉన్న కేసులలో 82.68% 13 రాష్ట్రాలలో నమోదైంది.
దేశంలోని చికిత్సలో ఉన్న కేసులలో 24.44% కేవలం పది జిల్లాల్లో నమోదయ్యాయి.
కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.09%. గత 24 గంటలలో 3,876 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్టాల వాటా 73.09% ఉంది. కర్నాటకలో అత్యధికంగా 596 మరణాలు సంభవించగా మహారాష్టలో 549 మంది చనిపోయారు.
****
(Release ID: 1717648)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam