ప్రధాన మంత్రి కార్యాలయం

ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాన్య శ్రీ స్కాట్ మారిస‌న్ తో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 07 MAY 2021 2:56PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాన్య శ్రీ స్కాట్ మారిస‌న్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

కోవిడ్‌-19 తాలూకు రెండో వేవ్ కు వ్య‌తిరేకం గా భార‌త‌దేశం చేస్తున్న యుద్ధానికి ఆస్ట్రేలియా ప్ర‌జ‌లు, ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం స‌రిఅయిన స‌మ‌యం లో ఉదారం గా తోడ్పాటును అందించినందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌శంస‌ల‌ ను వ్య‌క్తం చేశారు.

కోవిడ్ ను ప్ర‌పంచ‌వ్యాప్తం గా అదుపు లోకి తీసుకు రావ‌డం కోసం ఔష‌ధాల ను, టీకా మందుల ను త‌క్కువ ఖ‌ర్చు లో స‌మాన‌మైన ప్రాతిప‌దిక‌న అందుబాటు లోకి తీసుకు రావ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఇరువురు నేత‌లు అంగీకారాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ విష‌యం లో టిఆర్ఐపిఎస్ లో భాగం గా తాత్కాలిక మాఫీ ని కోరుతూ డ‌బ్ల్యుటిఒ లో ద‌క్షిణ ఆఫ్రికా, భార‌తదేశం తీసుకున్న చొర‌వ ను సమర్ధించవలసిందని  ఆస్ట్రేలియా ను ప్ర‌ధాన మంత్రి కోరారు

కింద‌టి సంవ‌త్స‌రం లో జూన్ 4వ తేదీన వ‌ర్చువ‌ల్ స‌మిట్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి భార‌త‌దేశం-ఆస్ట్రేలియా సంపూర్ణ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప‌రంగా న‌మోదైన పురోగ‌తి ని నేత‌లు ఇద్ద‌రు గ‌మ‌నించి స‌హ‌కారాన్ని మ‌రింత బ‌ల‌ప‌ర‌చుకోవ‌డానికి రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య  సంబంధాల ను పెంపొందింప జేసుకోవ‌డానికి ఏఏ మార్గాలు ఉన్న‌దీ చ‌ర్చించారు.

నియ‌మావ‌ళి పై ఆధార‌ప‌డి కొన‌సాగేట‌టువంటి అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ కోసం స్వ‌తంత్ర‌మైన‌టువంటి, అర‌మ‌రిక‌ల‌ కు తావు ఉండ‌న‌టువంటి అన్ని వ‌ర్గాల‌ ను క‌లుపుకొని వెళ్ళేట‌టువంటి ఇండో-ప‌సిఫిక్ ప్రాంతం ఆవిష్కారం కోసం ఉభ‌య ప‌క్షాలు క‌ల‌సిక‌ట్టుగా ప‌ని చేయ‌డానికి ఉన్న ప్రాముఖ్యాన్ని నేత‌లు పున‌రుద్ఘాటిస్తూ, ప్రాంతీయ అంశాల‌ ను గురించి కూడా ఈ సంద‌ర్భం లో చ‌ర్చించారు.
 



 

 

***

 

DS/AK


(Release ID: 1716782) Visitor Counter : 179