ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

విదేశీ కోవిడ్ సహాయాన్ని రాష్ట్రాలకు సమర్థంగా పంపిణీ చేస్తున్న కేంద్రం


భారత్ లో ఇప్పటిదాకా 16.49 కోట్ల కోవిడ్ టీకా డోసుల పంపిణీ

మూడో దశ కింద 18-44 వయోవర్గానికి 11.8 లక్షలకు పైగా టీకాలు

చికిత్సలో ఉన్న బాధితులలో నాలుగోవంతు మంది 10 జిల్లాల్లోనే

Posted On: 07 MAY 2021 11:14AM by PIB Hyderabad

గత కొద్ది వారాలుగా దేశంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య

ఇలా ఒక్క సారిగ పెరగటంతో అనేక రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలమీద వత్తిడి పెరిగి లోటు ఏర్పడింది. వసుధైవ కుటుంబకమ్

నినాదాన్ని అనుసరిస్తూ ప్రపంచదేశాలు ఈ కోవిడ్ మహమ్మారిమీద పొరాడుతున్న భారత ప్రభుత్వానికి సహాయ హస్తం అందిస్తూ వస్తున్నాయి. ఇది నిరవధికంగా కొనసాగే ప్రక్రియ. ఈ క్లిష్ట సమయంలో ఈ విధంగా అందిన  సహాయాన్ని వివిధ మార్గాల ద్వారా అన్ని అవసరమున్న రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ పంపటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

 

మరోవైపు దేశవ్యాప్తంగా  మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలుకాగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 16.49 కోట్లు దాటింది. మూడో దశలో భాగంగా 18-44 వయో వర్గం వారికి టీకాలు మొదలుకాగా 30 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  11,80,798 మంది  లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో అండమాన్, నికోబార్ దీవులు (330), ఆంధ్రప్రదేశ్(16), అస్సాం (220), బీహార్ (284), చండీగఢ్ (2), చత్తీస్ గఢ్ (1,026), ఢిల్లీ (1,83,679), గోవా (741), గుజరాత్ (2,24,109), హర్యానా(1,69,409), హిమాచల్ ప్రదేశ్  (14), జమ్మూ కశ్మీర్ (21,249), జార్ఖండ్ (77), కర్నాటక (7,068), కేరళ (22), లద్దాఖ్ (86), మధ్యప్రదేశ్  (9,823), మహారాష్ట్ర  (2,15,274), మేఘాలయ (2), నాగాలాండ్ (2), ఒడిశా (28,327), పుదుచ్చేరి (1), పంజాబ్ (2,187), రాజస్థాన్  (2,18,795), తమిళనాడు (8,419), తెలంగాణ (440), త్రిపుర (2), ఉత్తరప్రదేశ్  (86,420), ఉత్తరాఖండ్ (17) పశ్చిమ బెంగాల్ (2,757) ఉన్నాయి.

 

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం  24,11,300 శిబిరాల ద్వారా 16,49,73,058 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో అఅరోగ్యసిన్నంది అందుకున్న  95,01,643 మొదటి డోసులు,  63,92,248 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,37,64,363 మొదటి డోసులు, 75,39,007 రెండో డోసులు, 18-45 వయోవర్గంవారి 11,80,798 మొదటి డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారి 5,33,28,112 మొదటి డోసులు,  1,35,91,594 రెండో డోసులు, 45-60 వయోవర్గం వారి  5,43,12,908 మొదటి డోసులు, 53,62,385 రెండో డోసులు ఉన్నాయి. .

 

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,01,643

2వ డోస్

63,92,248

కోవిడ్ యోధులు

1వ డోస్

1,37,64,363

2వ డోస్

75,39,007

18-44 వయోవర్గం

1వ డోస్

11,80,798

45 - 60 వయోవర్గం

1వ డోస్

5,43,12,908

2వ డోస్

53,62,385

60 పైబడ్డవారు

1వ డోస్

5,33,28,112

2వ డోస్

1,35,91,594

 

మొత్తం

16,49,73,058

 

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో పదు రాష్ట్రాలదే 66.84% వాటా ఉండటం గమనార్హం.

 

గడిచిన 24 గంటలలో  23 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 111వ రోజైన మే 6న 23,70,298 టీకాలివ్వగా 18,938 శిబిరాల్లో 10,60,064 మంది మొదటి డోస్,  13,10,234 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ : మే 6, 2021 (111వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

19,925

2వ డోస్

37,117

కోవిడ్ యోధులు

1వ డోస్

99,336

2వ డోస్

1,09,909

18-44 వయోవర్గం

1వ డోస్

2,67,054

45 -60 వయోవర్గం

1వ డోస్

4,73,186

2వ డోస్

5,04,194

60 పైబడ్డవారు

1వ డోస్

2,00,563

2వ డోస్

6,59,014

మొత్తం

1వ డోస్

10,60,064

2వ డోస్

13,10,234

 

 దేశంలో కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ వారు 1,76,12,351 కాగా, జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 81.95%.

గత 24 గంటలలో 3,31,507 మంది కోలుకోగా అందులో 72.47% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

 

 తాజాగా గత 24 గంటలలో 4,14,188 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో   71.81% కొత్త కేసులున్నాయి. మహారాష్టలో అత్యధికంగా ఒక్క రోజులో 62,194కేసులు రాగా కర్నాటకలో 49,058, కేరళలో  42,464 వచ్చాయి. .

దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 36,45,164 కు చేరుకోగా, ఇది ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 16.96%.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కెసుల సంఖ్య 78,766 పెరుగుదల నమోదు చేసుకుంది.  ఇందులో 81.04% వాటా 12 రాష్ట్రాలదే.

చికిత్సలో ఉన్న కేసులలో 25% వాటా పది జిల్లాలదే కావటం గమనార్హం.  

మొత్తం కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 16.96% కాగా మొత్తం కేసులలో కోలుకున్నవారి శాతం  81.95%.

 జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం క్రమంగా తగ్గుతూ  1.09% చేరింది. గత 24 గంటలలో 3,915 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  అందులో 74.48% పది రాష్ట్రాలది కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 853 మంది, ఉత్తరప్రదేశ్ లో 350 మంది చనిపోయారు

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య నాలుగు ఉండగా అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మిజోరం .

 

****



(Release ID: 1716731) Visitor Counter : 194