ప్రధాన మంత్రి కార్యాలయం

2021 మే 8వ తేదీ న జరుగనున్న భారతదేశం- ఇయు నేత ల సమావేశం

Posted On: 06 MAY 2021 6:11PM by PIB Hyderabad

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మిశెల్ ఆహ్వానాన్ని అందుకొని  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీ న జరిగే యూరోపియన్ కౌన్సిల్ సమావేశం లో ప్రత్యేక ఆహ్వానితుని గా పాలుపంచుకోనున్నారు.  భారతదేశం- ఇయు నేత ల సమావేశాని కి ఆతిథేయి గా పోర్చుగల్ ప్రధాని శ్రీ ఏంటోనియో కోస్టా ఉన్నారు.  పోర్చుగల్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ (ఇయు) తాలూకు కౌన్సిల్ యొక్క అధ్యక్ష పదవి ని నిర్వహిస్తోంది.

ఇయు లో సభ్యత్వం కలిగిన మొత్తం 27 దేశాల అధినేతల, ప్రభుత్వాల అధినేతల తో కలసి ప్రధాన మంత్రి ఈ సమావేశం లో పాల్గొననున్నారు.  ఇయు+27 ఈ ఫార్మేట్ లో ఇప్పటికే ఒక సారి ఈ ఏడాది మార్చి నెల లో యుఎస్ అధ్యక్షుని తో సమావేశమయ్యారు.  ఈ సమావేశం లో పాల్గొనే నేత లు కోవిడ్-19 ప్రపంచ వ్యాప్త వ్యాధి, ఆరోగ్య సంరక్షణ సంబంధి సహకారం, దీర్ఘకాలిక, సమ్మిళిత వృద్ధి, భారతదేశం- ఇయు ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టపరచడం అనే అంశాలతో పాటు పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల పైన, పరస్పర హితం ముడిపడ్డ ప్రపంచ అంభాల పైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడించుకోనున్నారు.

భారతదేశం- ఇయు నేత ల సమావేశం ఇయు లో సభ్యత్వం కలిగిన దేశాల నేతలందరితోను చర్చించడం కోసం అందివచ్చినటువంటి ఒక అపూర్వమైన అవకాశం అని చెప్పాలి.  ఇది రాజకీయ దృష్టికోణం లో నుంచి చూస్తే ఒక మహత్వపూర్ణమైనటువంటి ఘటన; అంతేకాకుండా భారతదేశం- ఇయు 15వ శిఖర సమ్మేళనం 2020 వ సంవత్సరం జులై లో  జరిగినప్పటి నుంచి పరస్పర సంబంధాల లో చోటు చేసుకొన్న వేగగతి కి ఈ సమావేశం మరింత జోరు ను కూడా  జతచేయనుంది.




 

***



(Release ID: 1716614) Visitor Counter : 140