రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తిలో మూడు రెట్ల పెరుగుదల: శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
మూడింతలైన రెమ్‌డెసివిర్ ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్య
Posted On:
04 MAY 2021 1:43PM by PIB Hyderabad
"దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి శరవేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే, ఈ ఔషధం ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కూడా త్వరలోనే సాధ్యమవుతుంది". కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు.
గత నెల 12 నాటికి 37 లక్షలుగా ఉన్న రెమ్‌డెసివిర్ ఉత్పత్తి ఈ నెల 4వ తేదీ నాటికి 1.05 కోట్లకు చేరింది.
డిమాండ్‌లో పెరుగుదల దృష్ట్యా, రెమ్‌డెసివిర్ ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్య కూడా పెరిగింది. గత నెల 12 నాటికి 20గా ఉన్న సంఖ్య ఈ నెల 4వ తేదీ నాటికి 57కు చేరింది.
కరోనాపై నిరంతర పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.
***
(Release ID: 1715920)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam