ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ జగ్ మోహన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 MAY 2021 8:55AM by PIB Hyderabad

శ్రీ జగ్ మోహన్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘జగ్ మోహన్ గారి మరణం మన దేశాని కి భర్తీ చేయలేనటువంటి లోటు.  ఆయన మార్గదర్శకుడైన పరిపాలకుడూ, ప్రసిద్ధ పండితుడూను.  ఆయన భారతదేశం అభివృద్ధి కోసం ఎల్లప్పటికీ కృషి చేసిన మనిషి.  ఆయన మంత్రి పదవి ని నిర్వర్తించిన కాలం వినూత్నమైన విధానాల కు రూపకల్పన చేసిన కాలం గా నిలచిపోతుంది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 1715853) Visitor Counter : 137