వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిజిఎఫ్‌టి 'కోవిడ్ -19 హెల్ప్‌డెస్క్' కార్యాచరణ
Posted On:
26 APR 2021 11:58AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వాణిజ్య విభాగం మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎగుమతులు మరియు దిగుమతుల స్థితిని మరియు కొవిడ్-19 కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పర్యవేక్షించడానికి కార్యాచరణ చేపట్టాయి. అందులో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి తలెత్తే సమస్యలకు తగిన పరిష్కరాలను చూపడానికి మరియు కోరడానికి డిజిఎఫ్‌టి తదనుగుణంగా 'కొవిడ్-19 హెల్ప్‌డెస్క్'ను ఏర్పాటు చేసింది.
ఈ 'కొవిడ్-19 హెల్ప్‌డెస్క్' వాణిజ్య విభాగం / డిజిఎఫ్‌టి, దిగుమతి మరియు ఎగుమతి లైసెన్సింగ్ సమస్యలు, కస్టమ్స్ క్లియరెన్స్‌లో జాప్యం మరియు దానిపై తలెత్తే సంక్లిష్టతలు, దిగుమతి / ఎగుమతి డాక్యుమెంటేషన్ సమస్యలు, బ్యాంకింగ్ విషయాలు మొదలైన వాటికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఇతర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ఏజెన్సీలకు సంబంధించిన సమస్యలు మరియు వారి మద్దతు కోరడానికి మరియు సాధ్యమైన తీర్మానం (ల) ను అందించడానికి సమన్వయం చేస్తాయి.
అందరు భాగస్వాములు, ముఖ్యంగా ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు డిజిఎఫ్‌టి వెబ్‌సైట్‌లో సమాచారాన్ని సమర్పించవచ్చు. ఈ క్రింది దశలను ఉపయోగించి మద్దతు అవసరమయ్యే వారి సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చు
i. డిజిఎఫ్‌టి వెబ్‌సైట్‌కు నావిగేట్ చేయడానికి (https://dgft.gov.in) > సర్వీసెస్ > డిజిఎఫ్‌టి > హెల్ప్‌డెస్క్ సర్వీస్
ii. 'క్రియేట్ న్యూ రిక్వెస్ట్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి 'కొవిడ్-19' కేటగిరిని ఎంపిక చేసుకోవాలి
iii. తగిన ఉపవర్గాన్ని ఎంచుకుని సంబంధిత వివరాలను నమోదు చేసి సమర్పించవచ్చు.
తమ సమస్యలను కోవిడ్ -19 హెల్ప్‌డెస్క్ సబ్జెక్ట్ హెడర్‌తో dgftedi[at]nic[dot]in అనే ఈ-మెయిల్ ఐడికి పంపవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-111-550కు కాల్ చేయవచ్చు.
డిజిఎఫ్‌టి హెల్ప్‌డెస్క్‌లోని సర్వీసెస్ విభాగంలో ట్రాకర్‌ను ఉపయోగించి తీర్మానాలు మరియు అభిప్రాయాల స్థితిని తెలుసుకోవచ్చు. ఈ టిక్కెట్ల స్థితి అప్‌డేట్ అయినప్పుడు ఈమెయిల్ మరియు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపబడతాయి.
***
(Release ID: 1714118)
Visitor Counter : 239