ప్రధాన మంత్రి కార్యాలయం

రామ న‌వ‌మి నాడు ప్ర‌జ‌ల కు అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మ‌ర్యాద ను పరిరక్షించాల‌ని, క‌రోనా నుంచి కాపాడుకోవ‌డానికి అన్ని రకాలైన నివార‌క చ‌ర్య‌ల ను అనుస‌రించాలంటూఆయ‌న పిలుపునిచ్చారు

Posted On: 21 APR 2021 9:21AM by PIB Hyderabad

మంగళప్రదమైనటువంటి రామ న‌వ‌మి సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌ లు తెలిపారు. భ‌గ‌వాన్ రాముని అపారమైన క‌రుణ తో అందరూ ఆయన దీవెన‌ల ను అందుకొంటూ ఉందురు గాక అంటూ ప్ర‌ధాన మంత్రి తన ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.

‘‘మ‌ర్యాదా పురుషోత్త‌ముడైన శ్రీ రాముడు అందించిన సందేశం ప్రకారం మ‌నమంతా స‌భ్య‌త‌ ను పాటించే తీరాలి; మరి, క‌రోనా తాలూకు ఈ సంకట కాలం లో కరోనా బారి నుంచి మ‌న‌ల‌ను మనం కాపాడుకోవ‌డానికి గాను తీసుకోవ‌ల‌సిన‌టువంటి అన్ని నివార‌క చ‌ర్య‌ల ను మనం తీసుకొందాం’’ అని ఒక ట్వీట్ లో శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘దవాయీ భీ- క‌డాయీ భీ’’ అనే మాట‌ల‌ ను ఆయ‌న ఈ సందర్భం లో మ‌రొక్క సారి గుర్తుకు తెచ్చారు. ఈ మాట‌ల‌ కు ‘ఔషధాన్ని తీసుకోవ‌డం తో పాటు నియ‌మ పాల‌న కూడా ముఖ్యమే’ అని భావం.

 

***


(Release ID: 1713194) Visitor Counter : 143