ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
తల్ చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (టిఎఫ్ఎల్) ద్వారా కోల్ గేసిఫికేశన్ మాధ్యమం లో ఉత్పత్తి అయిన యూరియా కు ప్రత్యేక సబ్సిడీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
20 APR 2021 3:40PM by PIB Hyderabad
తల్ చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (టిఎఫ్ఎల్) ద్వారా కోల్ గేసిఫికేశన్ మాధ్యమం లో ఉత్పత్తి అయిన యూరియా కు ప్రత్యేక సబ్సిడీ విధానాన్ని రూపొందించాలన్న ఎరువుల విభాగం ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది.
ఉద్దేశ్యాలు:
దేశం లో వ్యూహాత్మక శక్తి సంబంధిత సురక్ష పై, యూరియా విషయం లో స్వయంసమృద్ధి పై శ్రద్ధ వహిస్తూ, దేశం లో గల అమితమైనటువంటి బొగ్గు నిక్షేపాల ను దృష్టి లో పెట్టుకొని కోల్ గేసిఫికేశన్ సంబంధి సాంకేతిక విజ్ఞానం పై ఆధారపడ్డ తల్ చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంటు ను ముందుకు తీసుకుపోవాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఈ ప్రాజెక్టు రైతుల కు ఎరువు లభ్యత ను మెరుగుపరచడం, దేశ తూర్పు ప్రాంతం లో అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని అందించడం తో పాటు, దేశ తూర్పు ప్రాంతం లో యూరియా ను సరఫరా చేయడానికి గాను ఇస్తున్న రవాణా సంబంధి సబ్సిడీ ఆదా కు కూడా దారి తీస్తుంది. దీనితో యూరియా దిగుమతుల ను తగ్గించి, ప్రతి ఒక్క సంవత్సరం లో 12.7 ఎల్ఎమ్ టి మేరకు విదేశీ మారకద్రవ్యం మిగలడానికి తోడ్పడుతుంది.
ఈ ప్రాజెక్టు తో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి, ‘ఆత్మనిర్భర్’ ఉద్యమానికి అండ దండలు లభించనున్నాయి. దీనికి తోడు, రహదారులు, రైలు మార్గాలు, నీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి లోనూ ఇది సాయపడుతుంది. దీని తో దేశం లోని తూర్పు ప్రాంతాల లో ఆర్థిక వ్యవస్థ కు పెద్ద దన్ను అందడం, అనుబంధ పరిశ్రమ కు ప్రోత్సాహం లభించడం జరుగుతాయి. ఈ ప్రాజెక్టు తన క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాల లో సహాయక పరిశ్రమ ల కు నూతన వ్యాపార అవకాశాలను కూడా అందించ గలుగుతుంది.
కోల్ గేసిఫికేశన్ ప్లాంటు లు వ్యూహాత్మకం గా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే బొగ్గు ధర లు ఒడుదొడుకుల కు అంతగా లోను కావు, పైపెచ్చు బొగ్గు విస్తారంగా దొరుకుతున్నది కూడాను. తల్ చర్ ప్లాంటు ఎల్ ఎన్ జి దిగుమతి పద్దు ను తగ్గించడానికి, యూరియా ను ఉత్పత్తి చేయడం లో సహజ వాయువు పై ఆధారపడడాన్ని తగ్గించడానికి సైతం ఉపయోగపడ గలుగుతుంది. తల్ చర్ ప్లాంటు లో అనుసరించే గేసిఫికేశన్ ప్రక్రియ ఒక స్వచ్ఛమైనటువంటి బొగ్గు సంబంధి సాంకేతిక విజ్ఞానం తో కూడుకొన్నది; ఇది అగ్ని వనరుల మాధ్యమం ద్వారా నేరు గా బొగ్గు ను మండించే ప్రక్రియ ల తో పోలిస్తే SOx, NOx కనీస స్థాయి పాళ్ల లో ఉండేటట్టు చూడడంతో పాటు లేట్ ఉద్గారాల స్థాయి ని కూడా చాలావరకు తగ్గించివేస్తుంది.
పూర్వ రంగం
తల్ చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (టిఎఫ్ఎల్) అనేది నాలుగు పిఎస్ యు లు ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఆ నాలుగు పిఎస్ యులలో రాష్ట్రీయ కెమికల్స్ ఎండ్ ఫర్టిలైజర్స్ (ఆర్ సిఎఫ్), గేల్ (ఇండియా) లిమిటెడ్, (జిఎఐఎల్), కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) తో పాటు ఫర్టిలైజర్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ సిఐఎల్) లు ఉన్నాయి. దీనిని 2015 నవంబరు 13 న స్థాపించడమైంది. ఒక్కో సంవత్సరానికి 12.7 లక్షల మీట్రిక్ టన్నుల (ఎల్ఎమ్ టిపిఎ) స్థాపిత సామర్థ్యాన్ని కలిగివుండే ఒక కొత్త యూరియా ప్లాంటు ను ఏర్పాటు చేయడం ద్వారా ఇదివరకటి ఫర్టిలైజర్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ సిఐఎల్) తల్ చర్ ప్లాంటు తాలూకు పునరుద్ధరణ పనులను టిఎఫ్ ఎల్ చేపడుతున్నది. టిఎఫ్ఎల్ యూరియా ప్రాజెక్టు ను ఏర్పాటు చేయడానికి 13277.21 కోట్ల రూపాయలు (పది శాతం అటూ ఇటు గా) వ్యయం కావచ్చు అని అంచనా వేయడమైంది.
***
(Release ID: 1712930)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam