ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 11.72 కోట్ల టీకాలు


గత 24 గంటల్లో 27 లక్షలకు పైగా టీకా డోసులు

26 కోట్లు దాటిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు

79% కొత్త కోవిడ్ కేసులు 10 రాష్ట్రాలలోనే

Posted On: 16 APR 2021 10:39AM by PIB Hyderabad

ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా భావిస్తున్న కోవిడ్ టీకాలు భారత్ లో ఇప్పటికి 11.72 కోట్లు దాటాయి. ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి మొత్తం 17,37,539 శిబిరాల ద్వారా 11,72,23,509 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికి 90,82,999 మొదటి డోసులు, 56,34,634 రెండో డోసులు, కోవిడ్ యోధులకు  1,02,93,524 మొదటి డోసులు,   51,52,891 రెండో డోసులు ఇవ్వగా 60 ఏళ్ళు పైబడ్డవారికి  4,42,30,842 మొదటి డోసులు,  30,97,961  రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్యవారికి 3,87,41,890 మొదటి డోసులు, 9,88,768 రెండో డోసులు ఇచ్చారు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ల మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

90,82,999

56,34,634

1,02,93,524

51,52,891

3,87,41,890

9,88,768

4,42,30,842

30,97,961

11,72,23,509

  

ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 59.63% కేవలం 8 రాష్టాలలోనే తీసుకున్నారు.  

టీకాల కార్యక్రమం మొదలైన 90వ రోజైన ఏప్రిల్ 15 నాడు 27 లక్షలమందికి పైగా ( 27,30,359) టీకా డోసులు తీసుకున్నారు. అందులో 21,70,144  మంది లబ్ధిదారులు 39,280 శిబిరాల ద్వారా మొదటి డోస్ తీసుకోగా 5,60,215 మంది రెండో డోస్ తీసుకున్నారు 

 

తేదీ: ఏప్రిల్ 15, 2021 ( 90 వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

6ళ్ళు పైబడ్డవారు  

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

18,472

30,437

80,049

88,029

13,11,812

90,807

7,59,811

3,50,942

21,70,144

5,60,215

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 26 కోట్లకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిపారు. మొత్తం పాజిటివిటీ 5.42% నమోదైంది.

భారత్ లో రోజువారీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 2,17,353 కొత్త కేసులు నమోదయ్యాయి.

పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాలలోనే 79.10% కేసులు రావటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలొనే గడిచిన 24 గంటల్లో

61,695 కొత్త కేసులు రాగా, ఉత్తరప్రదేశ్ లో 22,339, ఢిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి.

 

ఈ దిగువ చూపిన విధంగా పదహారు రాష్ట్రాలు కొత్త కేసుల పెరుగుదల చూపుతున్నాయి.

 

 

 

భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య 15,69,743 కు చేరుకుంది. ఇది దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసులలో 10.98%. చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత 24 గంటలలో నికరంగా  97,866 పెరిగింది.   కేవలం ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ కలిసి 65.86% కేసులు నమోదు చేసుకున్నాయి. దేశం మొత్తంలో ఉన్న కేసుల భారంలో ఒక్క మహారాష్ట్రలోనే  39.60% ఉంది.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 1,25,47,866 కు చేరుకోగా కోలుకున్నవారి శాతం 87.80%.

గత 24 గంటలలో 1,18,302 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటలలో 1,185 మంది కోవిడ్ తో చనిపోయారు.

ఈ తాజా మరణాలలో పది రాష్ట్రాల వాటా  85.40% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 349 మంది చనిపోయారు. చత్తీస్ గఢ్ లో 135 మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటలలో పది రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: లద్దాఖ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

 

****


(Release ID: 1712200) Visitor Counter : 270