ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 09 APR 2021 8:17PM by PIB Hyderabad

   శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు  నివాళి అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ ‘‘మహనీయులైన శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి నేపథ్యంలో ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన జీవితం, ఆదర్శాలు ఎంతోమందికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయి. విద్యకు, సామాజిక సాధికారతకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మతువా సామాజిక వర్గం ప్రదర్శించే సానుభూతి, కరుణా స్వభావాల్లో ఆయన ఆచరించే విలువలు ప్రతిబింబిస్తాయి’’ అని పేర్కొన్నారు.

   అలాగే ఇటీవల ఒరాకాండి ఠాకూర్ బారి పర్యటన సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందేశం ద్వారా పంచుకున్నారు. ‘‘కొన్ని వారాల కిందట నేను ఒరకాండి ఠాకూర్ బారివద్ద ఉన్నాను. ఆ పవిత్రమైన క్షణాలను నేను సదా స్మరించుకుంటాను. ఈ నేపథ్యంలో ఒరాకాండిలో నిర్వహించిన సభలో నేను చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా  పంచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 1710764) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam