ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్‌-19 ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి భేటీ


తొలి విడ‌తలో న‌మోదైన గ‌రిష్ఠ స్థాయిల‌ను దాటిపోయిన కేసులు; గ‌తంలో క‌న్నా వేగంగా వృద్ధిరేటు : ప్ర‌ధాన‌మంత్రి


మ‌నం మంచి అనుభ‌వం, వ‌న‌రులు క‌లిగి ఉన్నాం; వ్యాక్సిన్ కూడ అందుబాటులో ఉంది : ప్ర‌ధాన‌మంత్రి


"టెస్ట్, ట్రాక్‌, చికిత్స", కోవిడ్ కు అనుగుణ‌‌ ప్ర‌వ‌ర్త‌న‌, కొవిడ్ అదుపు ‌పై మ‌నం దృష్టి పెట్టాలి; ప్ర‌ధాన‌మంత్రి


"కొవిడ్ అలుపు"తో మ‌నలో ప్ర‌య‌త్న‌లోపం ఏర్ప‌డ‌కూడ‌దు : ప్ర‌ధాన‌మంత్రి



అధికంగా దృష్టి కేంద్రీక‌రించ‌వ‌ల‌సిన జిల్లాల్లో 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన జ‌నాభాకు 100 శాతం వాక్సినేష‌న్ సాధించాలి : ప్ర‌ధాన‌మంత్రి




జ్యోతిబా పూలే, బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జ‌యంతి తేదీల‌ (ఏప్రిల్ 11-14) మ‌ధ్య‌లో మ‌నం టీకా ఉత్స‌వ్‌ నిర్వ‌హించాల‌ని పిలుపు

Posted On: 08 APR 2021 9:36PM by PIB Hyderabad

దేశంలో ప్ర‌స్తుతం కోవిడ్‌-19 తీరుతెన్నుల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వివిధ రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌తో గురువారం  వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా చ‌ర్చించారు.

 

కోవిడ్ పై పోరాటానికి ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను కేంద్ర హోం మంత్రి వివ‌రించారు. దేశంలో అమ‌లు జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పురోగ‌తి గురించి కూడా స‌వివ‌రంగా తెలియ‌చేశారు. దేశంలో ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితి, ప్ర‌స్తుతం కేసులు అధికంగా న‌మోద‌వుతున్న రాష్ర్టాల‌పై దృష్టి కేంద్రీక‌ర‌ణ గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి వివ‌రిస్తూ కేసులు అధికంగా ఉంటున్న రాష్ర్టాల్లో క‌రోనా ప‌రీక్ష‌లు పెంచాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌న్నారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా వివ‌రాలు కూడా ఆయ‌న అందించారు.

 

వైర‌స్ పై సంఘ‌టిత పోరాటానికి సార‌థ్యం వ‌హిస్తున్నందుకు ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ త‌మ రాష్ర్టాల్లో కోవిడ్ తాజా ప‌రిస్థితి గురించి వారు స‌మాచారం అందించారు. స‌కాలంలో వ్యాక్సినేష‌న్ చేప‌ట్ట‌డం వ‌ల్ల ల‌క్ష‌లాది ప్రాణాలు కాపాడ‌గ‌లిగిన‌ట్టు వారు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖ‌త‌, వ్యాక్సిన్ వృధా గురించి కూడా చ‌ర్చించారు.

 

ప్ర‌ధాన‌మంత్రి కొన్ని స్ప‌ష్ట‌మైన వాస్త‌వాల‌పై ముఖ్యమంత్రుల‌కు వివ‌రించారు. మొద‌టి అంశం-ఇప్పుడు దేశంలో గ‌తంలో కోవిడ్ తొలి విడ‌తలో న‌మోదైన గ‌రిష్ఠ స్థాయిల‌ను దాటిపోయి కేసులు న‌మోద‌వుతున్నాయ‌న్నారు. రెండో అంశం-మ‌హారాష్ట్ర, చ‌త్తీస్ గ‌ఢ్‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ రాష్ర్టాల్లో తాజా కేసులు మొద‌టి విడ‌త‌ను దాటిపోయాయ‌ని చెప్పారు. ఇత‌ర రాష్ర్టాలు కూడా ఆ దిశ‌లోనే క‌దులుతున్న‌ట్టు చెబుతూ ఇది చాలా ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌న్నారు. మూడో అంశం- ప్ర‌జ‌లు ఇప్పుడు క‌రోనాను గ‌తంలో క‌న్నా తేలిగ్గా తీసుకుంటున్నార‌ని, కొన్ని రాష్ర్టాల్లో పాల‌నా యంత్రాంగాల వైఖ‌రి కూడా అలాగే ఉన్న‌ద‌ని చెప్పారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలోకోవిడ్ కేసులు విప‌రీతంగా పెరిగిపోతూ క‌ష్టాల‌కు కార‌ణం అవుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.   

 

స‌వాళ్లున్న మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ మ‌న‌కి మెరుగైన అనుభ‌వం, వ‌న‌రులు అందుబాటులో ఉన్నాయ‌ని, ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో పాటు వైద్యులు, ఆరోగ్య సంర‌క్ష‌ణ సిబ్బంది క‌ఠోర‌ శ్ర‌మ కార‌ణంగా  ప‌రిస్థితిని అదుపులో ఉంచ‌గ‌లుగుతున్నామంటూ వారు ఇప్ప‌టికీ అలాగే శ్ర‌మ ప‌డుతున్నార‌ని తెలిపారు.  

 

"టెస్ట్, ట్రాక్‌, చికిత్స"; కోవిడ్ అనుగుణ ప్ర‌వ‌ర్త‌న‌, కోవిడ్ అదుపుపై దృష్టి సారించాలి" అని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. క‌రోనా వైర‌స్ ను అదుపు చేయాలంటే మ‌నిషి ఆతిథ్యాన్ని నిలువ‌రించాల‌ని, టెస్టింగ్‌, ట్రాకింగ్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. స‌మాజంలో ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌తను, ప్ర‌జ‌ల్లో ఎవ‌రెవ‌రు ఇన్ఫెక్ష‌న్ వ్యాపింప‌చేస్తున్నారో తెలుసుకోవాలంటే టెస్టింగ్‌ కీల‌క‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇందుకోసం పాజిటివిటీ రేటును 5% లేదా అంత క‌న్నా దిగువ‌కు త‌గ్గించ‌డం ల‌క్ష్యంగా టెస్ట్ ల సంఖ్య విశేషంగా పెంచ‌డం;  ప్ర‌ధానంగా క‌ట్ట‌డి ప్రాంతాలు, కేసులు అధికంగా న‌మోద‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న ప్ర‌దేశాల్లో ల‌క్షిత టెస్టింగ్ పై దృష్టి కేంద్రీక‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. ఆర్ టి-పిసిఆర్ టెస్టింగ్ మౌలిక వ‌స‌తులు విశేషంగా పెంచ‌డం ద్వారా మొత్తం టెస్టుల్లో ఆర్ టి-పిసిఆర్ టెస్టుల సంఖ్య క‌నీసం 70 శాతానికి పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సి ఉన్న‌ద‌ని నొక్కి చెప్పారు.

 

స‌మాజంలో  కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టాలంటే  స‌రైన నిరోధ‌క చ‌ర్య‌లు, కాంటాక్ట్ ట్రేసింగ్‌, త‌దుప‌రి చ‌ర్య‌ల  అవ‌సరంపై చ‌ర్చిస్తూ అలాంటి వ్యూహం లోపించిన‌ ప‌క్షంలో ప్ర‌తీ ఒక్క పాజిటివ్ కేసు స‌మాజంలో వైర‌స్ ను వ్యాపింప‌చేయ‌గ‌లుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌తీ ఒక్క పాజిటివ్ కేసుకు క‌నీసం 30 కాంటాక్టుల‌నైనా గుర్తించి వారంద‌రిపై ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క‌నీసం తొలి 72 గంట‌ల స‌మ‌యం అయినా క్వారంటైన్ లో ఉంచాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. అలాగే క‌ట్ట‌డి జోన్ల హ‌ద్దులు కూడా స్ప‌ష్టంగా గుర్తించాలని చెప్పారు. "కోవిడ్ అలుపు" కార‌ణంగా మ‌నం ఎలాంటి అల‌స‌త్వం వ‌హించ‌కూడ‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. క‌ట్ట‌డి జోన్ల‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియ‌మావ‌ళిని (ఎస్ఓపి) తుచ త‌ప్ప‌కుండా పాటించాల‌న్నారు. అలాగే స‌వివ‌ర‌మైన విశ్లేష‌ణ‌తో మ‌ర‌ణాల‌పై స‌మ‌గ్ర డేటా సిద్ధం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని కూడా ఆయ‌న నొక్కి చెప్పారు. ప్ర‌తీ మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో ఢిల్లీ ఎయిమ్స్ నిర్వ‌హిస్తున్న వెబినార్ ల‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌న రాష్ర్టాల‌కు సూచించారు.

 

క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న‌ట్టు గుర్తించి గ‌ట్టి నిఘా పెట్టిన జిల్లాల్లో 45 సంవ‌త్స‌రాల పైబ‌డిన వ‌య‌స్కులంద‌రికీ నూరు శాతం వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా జ‌రిగేలా చూడాల‌ని ప్ర‌ధానమంత్రి రాష్ర్టాల‌ను కోరారు. జ్యోతిబా పూలే జ‌యంతి ఏప్రిల్ 11  నుంచి బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జ‌యంతి ఏప్రిల్ 14వ తేదీ మ‌ధ్య‌న మ‌నం టీకా ఉత్స‌వ్ - వ్యాక్సినేష‌న్ పండుగ నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపు ఇచ్చారు. ఈ టీకా ఉత్స‌వ్ స‌మ‌యంలో గ‌రిష్ఠ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ జ‌రిగేలా చూడాల‌ని సూచించారు. 45 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన వారంద‌రూ వ్యాక్సినేష‌న్ కు వ‌చ్చేలా యువ‌త స‌హాయం అందించాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

 

అజాగ్ర‌త్త ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ త‌గ‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి హెచ్చ‌రించారు. వ్యాక్సినేష‌న్ చేసిన‌ప్ప‌టికీ క‌రోనా విష‌యంలో నిఘా త‌గ్గ‌కూడ‌ద‌న్న విషయం మ‌నం గుర్తించాల‌ని, త‌గు జాగ్ర‌త్త చ‌ర్య‌లు కొన‌సాగించాల‌ని అన్నారు.   "ద‌వాయి భీ-క‌డాయి భీ" అనే మంత్రాన్ని ఉద్బోధిస్తూ కోవిడ్ అనుగుణ ప్ర‌వ‌ర్త‌నపై  చైత‌న్యం పెంచాల‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు.

 

***



(Release ID: 1710605) Visitor Counter : 226