ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్‌) ను స్మ‌రించుకోవ‌డానికి గాను ఈ నెల 8న జ‌రిగే ఉన్న‌త‌ స్థాయి సంఘం స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి  

Posted On: 07 APR 2021 10:59AM by PIB Hyderabad

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ జ‌యంతి (ప్ర‌కాశ్ ప‌ర్వ్) ను స్మ‌రించుకోవ‌డం కోసం ఈ నెల 8 న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించే ఒక ఉన్న‌త స్థాయి సంఘం (హెచ్ఎల్‌సి) స‌మావేశాని కి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించనున్నారు.  కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ కూడా ఈ స‌మావేశాని కి హాజ‌రు కానున్నారు.  ఈ ప్రత్యేక సందర్భం (ప్ర‌కాశ్ ప‌ర్వ్) కు సూచ‌కం గా సంవ‌త్స‌రం పొడ‌వునా నిర్వహించ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల ను గురించి ఈ స‌మావేశం లో చ‌ర్చ జ‌రుగ‌నుంది.
 
ఉన్న‌త స్థాయి సంఘం గురించిన వివ‌రాలు

శ్రీ గురు తేగ్ బ‌హాదుర్ జీ 400 వ జ‌యంతి ని స్మ‌రించుకోవ‌డానికి సంబంధించిన విధానాలు, ప్ర‌ణాళిక‌లు, కార్య‌క్ర‌మాల తో పాటు, ఇత‌ర ఘ‌ట్టాల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం 2020 వ సంవత్సరం అక్టోబ‌రు 24వ తేదీ న ఒక ఉన్న‌త స్థాయి సంఘాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘం అధ్య‌క్ష ప‌ద‌వి లో ప్ర‌ధాన మంత్రి సహా హెచ్ ఎల్ సి లో 70 మంది సభ్యులు ఉన్నారు.



 

***


(Release ID: 1710028) Visitor Counter : 226