ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో 7.5 కోట్లు పైబడ్డ కోవిడ్ టీకా డోసులు


అందులో మొదటి డోస్ 6.5 కోట్లు, రెండో డోస్ కోటి టీకాలు 12 రాష్టాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Posted On: 04 APR 2021 11:19AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి 11,99,125 శిబిరాల ద్వారా మొత్తం 7,59,79,651 టీకా డోసుల పంపిణీ జరిగింది.  అందులో 89,82,974  డోసులు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న మొదటి డోసులు 53,19,641 డోసులు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న రెండో డోసులు కాగా 96,86,477 డోసులు కోవిడ్ యోధులు తీసుకున్న మొదటి డోసులు, 40,97,510 డోసులు కోవిడ్ యోధులు తీసుకున్న రెండో డోసులు,   4,70,70,019 డోసులు 45 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న మొదటి డోసులు,   8,23,030 రెండో డోసులు కలిసి ఉన్నాయి.  మొత్తం టీకాలలో 6,57,39,470 మొదటి డోసులు కాగా రెండో డోసులు 1,02,40,181 ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,82,974

53,19,641

96,86,477

40,97,510

4,70,70,019

8,23,030

7,59,79,651

 

టీకాల కార్యక్రమం మొదలైన 78వరోజైన ఏప్రిల్ 3న 27,38,972 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 24,80,031 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 2,58,941 మందికి రెండో డోస్ ఇచ్చారు. 

తేదీ: ఏప్రిల్ 3, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

43,143

22,116

1,02,096

1,04,167

23,34,792

1,32,658

24,80,031

2,58,941

 

ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులలో ఎనిమిది రాష్టాల వాటా 60.19% ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 9.68% ఇచ్చారు.  

 

 వివిధ రాష్టాలలో ఇచ్చిన మొదటి,రెండవ డోసుల వివరాలను ఈ క్రింది చిత్రపటం చూపుతుంది. ఒక్క మహారాష్ట్రలోనే 65,59,094 మొదటి డోసులు, 7,95,150 రెండో డోసులు ఇచ్చారు.

గడిచిన 24 గంటలలో 93,249 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇందులో 80.96% కేవలం ఎనిమిది రాష్టాలలోనే వచ్చాయి. అవి: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా  49,447 కొత్త కేసులు రాగా చత్తీస్ గఢ్ లో  5,818, కర్నాటకలో  4,373 నమోదయ్యాయి.   

ఈ క్రింద చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కరోనా కేసుల పెరుగుదల నమోదవుతూ వస్తోంది. 

కరోనా కేసులు రెట్టింపు అయ్యే సమయం కూడా భారత్ లో వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్ 4 నాటికి అది  115.4 రోజులుగా నమోదైంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,91,597 కు చేరింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 5.54%. గతవ్ 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు నికరంగా   32,688 పెరిగాయి.  మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్  లలోనే  76.41% కేసులు చికిత్సలో ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే సగంకంటే ఎక్కువ (58.19%) ఉన్నాయి.

భారతదేశంలో ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,16,29,289 కాగా కోలుకున్న శాతం  93.14% గా నమోదైంది. గత 24 గంటలలో 60,048  మంది కోవిడ్ నుంచి బైటపడ్దారు.  

గత 24 గంటలలో 513 మంది కోవిడ్ తో చనిపోయారు. అందులో 85.19%  మంది ఎనిమిది రాష్ట్రాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 277 మంది, ఆ తరువాత పంజాబ్ లో 49 మంది చనిపోయారు. 

గత 24 గంటలలో పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, లద్దాఖ్,  డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.  

***(Release ID: 1709522) Visitor Counter : 265