ప్రధాన మంత్రి కార్యాలయం

ఎగ్జామ్ వారియ‌ర్స్ తాజా సంచిక ను గురించి ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

మ‌న యువ‌జనులు వారి ప‌రీక్ష‌ల కు హాజ‌ర‌వుతున్న వేళ వారికి మ‌నం అంద‌రం తోడ్ప‌డుదామ‌ని పేర్కొన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 29 MAR 2021 5:47PM by PIB Hyderabad

ఎగ్జామ్ వారియ‌ర్స్ తాజా సంచిక ను గురించి ప్ర‌క‌టన చేస్తున్నందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

విద్యార్థులు, త‌ల్లితండ్రులు, గురువుల వ‌ద్ద నుంచి అందిన విలువైన సూచ‌న‌ల తో ఎగ్జామ్ వారియ‌ర్స్ కొత్త సంచిక ను సంపన్నం చేయ‌డం జరిగిందని ఆయ‌న అన్నారు.

కొత్త అంశాల ను అనేకం జోడించడ‌మైంద‌ని, అవి ప్ర‌త్యేకించి త‌ల్లితండ్రుల‌ కు, గురువుల‌ కు ఆస‌క్తి కరంగా ఉంటాయని ఆయ‌న చెప్పారు.

 ‘‘మ‌న యువ‌జనులు ప‌రీక్ష‌ల కు హాజ‌ర‌వుతున్న వేళలో వారికి మ‌న‌మంతా తోడ్పడుదాం’’ అని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి త‌న అభిప్రాయాల‌ ను అనేక ట్వీట్ ల‌లో ఈ కింది విధంగా వెల్ల‌డి చేశారు. 

‘‘ప‌రీక్ష‌ల కాలం మొద‌ల‌వుతూ ఉండగా #ExamWarriors తాజా సంచిక అందుబాటులోకి వస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పుస్త‌కం లో స‌రికొత్త మంత్రాల తో పాటు ఆస‌క్తిదాయ‌క‌మైన అనేక అంశాలు చోటు చేసుకొన్నాయి.  ఏదైనా ప‌రీక్ష‌ కు హాజ‌రు అయ్యేట‌ప్పుడు ఒత్తిడి కి లోన‌వకుండా ఉండడం అవసరమని ఈ పుస్త‌కం నొక్కి చెప్తుంది.

ప‌రీక్ష కు స‌న్న‌ద్ధం కావ‌డాన్ని స‌ర‌దా గా మ‌లుచుకోవడం ఎలా?

ప‌రీక్ష కు స‌న్న‌ద్ధం అవుతున్న‌ప్పుడు ఇంటి వ‌ద్ద ఉండి ఏదైనా ఆస‌క్తిక‌ర‌మైన ప‌ని ని మ‌నం చేయ‌గ‌ల‌మా?

దీనికి ఒక ప‌రిష్కార మార్గం అంటూ ఉంది.. అది ఏమిటి అంటే న‌మో ఆప్ (NaMo App) లో అంతా సరికొత్త‌ది అయినటువంటి ఒక #ExamWarriors మాడ్యూల్. 

అందులో విద్యార్థుల‌కు, త‌ల్లితండ్రుల‌ కు భాగం పంచుకోవ‌డానికి అనేక కార్య‌క‌లాపాలు అందుబాటు లో ఉన్నాయి.

 #ExamWarriors తాలూకు నూత‌న సంచిక ‌ను విద్యార్థులు, త‌ల్లితండ్రులు, గురువులు అందించిన విలువైన అభిప్రాయాల ను పొందుప‌ర‌చి పరిపుష్టం చేయడం జ‌రిగింది.

చెప్పుకోద‌గిన సంఖ్య ‌లో కొత్త భాగాల ను క‌ల‌ప‌డ‌మైంది; అవి ప్ర‌త్యేకించి త‌ల్లితండ్రుల ‌కు, గురువుల ‌కు ఆస‌క్తి ని రేకెత్తిస్తాయి.

మ‌న యువ‌త వారి ప‌రీక్ష‌ల కు హాజ‌రు అవుతున్న త‌రుణం లో, మనం అందరమూ వారికి తోడ్పాటు ను అందిద్దాం.’’

***(Release ID: 1708340) Visitor Counter : 6