ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ బాంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

Posted On: 26 MAR 2021 4:51PM by PIB Hyderabad

బాంగ్లాదేశ్ లో రెండు రోజుల చ‌రిత్రాత్మ‌క యాత్ర కు విచ్చేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ స‌మావేశ‌మ‌య్యారు. 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019QI1.jpg

 

గాఢ‌త‌రం అవుతున్న సౌభ్రాతృత్వ సంబంధాల ను గురించి, ఉభ‌య దేశాల మ‌ధ్య ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని అధిగమించ గలిగేలా సార్వ‌భౌమాధికారం, స‌మాన‌త్వం, విశ్వాసం, అవ‌గాహ‌న లపై ఆధార‌ప‌డిన విస్తృత భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకోవాలని ఇరువురు నేత లు వారి అభిప్రాయాల‌ ను ఒక‌రి తో మ‌రొక‌రు వెల్ల‌డి చేసుకొన్నారు.

***



(Release ID: 1707860) Visitor Counter : 160