మంత్రిమండలి

జాతీయ ఆరోగ్య మిశన్ (ఎన్ హెచ్ఎమ్) 2019-20 లో భాగం గా సాధించిన ప్ర‌గ‌తి ని గురించి మంత్రిమండలి కి తెలియ‌జేయ‌డమైంది

Posted On: 23 MAR 2021 3:21PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య మిశన్ (ఎన్ హెచ్ఎమ్) లో భాగం గా 2019-2020 ఆర్ధిక సంవ‌త్స‌రానికి  సాధించిన ప్ర‌గ‌తి ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దృష్టి కి తీసుకు రావ‌డం జ‌రిగింది.  అలాగే ప్రసూతి సంబంధి మ‌ర‌ణాల నిష్పత్తి (ఎమ్ఎమ్ఆర్), శిశు మ‌ర‌ణాల రేటు (ఐఎమ్ఆర్) లో, ఐదేళ్ల‌ వయస్సు లోపు బాలల మ‌ర‌ణాల రేటు (యు5ఎమ్ఆర్‌) లో, మొత్తం జ‌న‌నాల రేటు (టిఎఫ్ ఆర్‌) లో చోటు చేసుకొన్న తరుగుద‌ల వంటి అంశాల‌ను కూడా మంత్రిమండలి కి వివరించడమైంది.  క్షయ వ్యాధి, చలిజ్వరం (మ‌లేరియా), కాలా-జార్‌, డెంగి, కుష్ఠు రోగం, వైర‌ల్ హెపెటైటిస్ వంటి విభిన్న రోగాల అదుపు సంబంధి కార్యక్రమాల పురోగ‌తి తాలూకు సమాచారాన్ని కూడా వెల్లడించడమైంది.

వివరాలు:

ఎన్ హెచ్ఎమ్ 2019-20 ఆర్దిక సంవ‌త్స‌రం లో కొత్త ప్రయాసల అవకాశాల పై నొక్కిచెప్పిన విషయాన్ని మంత్రిమండలి కి తెలియజేయడమైంది:

 • బాలల్లో ఊపిరితిత్తుల వాపు వ్యాధి తో సంభవించే మ‌ర‌ణాల‌ సంఖ్య ను త‌గ్గించే దిశ లో సామాజిక జాగరూకత కు, కార్యాచ‌ర‌ణ‌ కు సంబంధించిన (సోశల్ అవేర్ నెస్ ఎండ్ యాక్శన్ టు న్యూట్రలైజ్ న్యుమోనియా సక్సెస్ ఫులీ ఎస్‌ఎఎఎన్‌ ఎస్ - సాఁస్’) కార్యక్రమాన్ని ప్రారంభించడం జ‌రిగింది.
 • సుర‌క్షిత మాతృత్వ ఆశ్వాస‌న్ (ఎస్‌ యు ఎమ్ఎఎన్‌- సుమన్’) కార్య‌క్ర‌మాన్ని గర్భవతి మహిళల కోసం ప్రారంభించ‌డం జ‌రిగింది.  దీని ద్వారా వారికి గౌర‌వ‌ ప్ర‌ద‌మైన‌, నాణ్య‌మైన, భరోసా తో కూడిన ఉచిత స్వాస్థ్య సేవలను అందించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం లో మాతృత్వ సంబంధి ప్రస్తుత పథకాలనుఅప్పుడే పుట్టిన శిశువులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల ను చేర్చడమైంది.
 • ఇంట‌ర్ నేశన‌ల్ కాన్ ఫెడ‌రేశన్ ఆఫ్ మిడ్‌వైవ్జ్ (ఐసిఎమ్) రూపొందించిన సామ‌ర్ధ్యాల‌కు అనుగుణం గా ప్రసవ విద్య లో న‌ర్సుల‌ కు శిక్ష‌ణ ను ఇచ్చేందుకు మిడివైఫరీ స‌ర్వీసెస్‌ కు చొర‌వ‌ తీసుకోవ‌డం జ‌రిగింది.  వీరికి మాత- శిశు సంర‌క్ష‌ణ‌, న‌వ‌ జాత శిశువుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ , బాలింత‌ ల సంర‌క్ష‌ణ లో ప‌రిజ్ఞానం, సామ‌ర్ధ్యం ఉంటుంది.
 • ఎబి- హెచ్‌డ‌బ్ల్యుసి స్ కార్య‌క్ర‌మం లో భాగం గా విద్య శాఖ భాగ‌స్వామ్యం లో స్కూల్ హెల్త్, వెల్‌నెస్ ఏంబాసడ‌ర్‌ స్ కార్య‌క్ర‌మాన్ని ఆరంభించ‌డం జ‌రిగింది.  పాఠ‌శాల విద్యార్ధుల‌లో చురుకైన జీవ‌న‌ శైలి ని అల‌వాటు చేయ‌డం ద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయ‌స్సు ను పెంపొందించేందుకు చ‌ర్య‌ల ను తీసుకోవ‌డం జ‌రిగింది.

అమ‌లు వ్యూహం, ల‌క్ష్యాలు  :

అమ‌లు కు సంబంధించినటువంటి వ్యూహం:

జనాభా కు, ప్ర‌త్యేకించి పేద‌ల కు, దుర్బల వర్గాల వారికి అందుబాటులో ఉండేటటువంటి, తక్కువ ఖర్చు తో కూడినటువంటి, జవాబుదారుతనం కలిగినటువంటి, ప్రభావవంతమైనటువంటి  ఆరోగ్య సంర‌క్ష‌ణ ను జిల్లా ఆసుపత్రుల (డిహెచ్ స్) స్థాయి వ‌ర‌కు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిశన్ కింద (ఎన్‌ హెచ్‌ఎమ్) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్ధిక , సాంకేతిక స‌హాయం అందించ‌డం  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అమ‌లు వ్యూహం లో భాగం గా ఉంది. గ్రామీణ ప్రాంతాల‌ లో ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల‌ను మెరుగు ప‌రచ‌డం , గ్రామీణ ఆరోగ్య సేవ‌ల మ‌ధ్య అంత‌రాన్ని తొల‌గించ‌డం, మాన‌వ వ‌న‌రుల‌ను అభివృద్ధిపరచడం, గ్రామీణ ప్రాంతాల‌ లో మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డం, ఆయా అవ‌స‌రాల‌ను బ‌ట్టి కార్య‌క్ర‌మాల అమ‌లు కు వికేంద్రీక‌ర‌ణ విధానాన్ని అమ‌లు చేయ‌డం, వ‌న‌రుల స‌ద్వినియోగానికి అంత‌ర్‌, అంత‌ర్గ‌త రంగాల మ‌ధ్య సంధానాన్ని  మెరుగుప‌ర‌చ‌డం వంటివి ఇందులో ఉన్నాయి.

లక్ష్యాలు:

 • ఎమ్ఎమ్ ఆర్‌ ను తగ్గిస్తూ దీనిని 1/1000 లైవ్ బ‌ర్త్‌ల‌కు తీసుకు రావడం
 • ఐఎమ్ఆర్ ను తగ్గిస్తూ దీనిని 25/1000 లైవ్ బ‌ర్త్‌ల‌కు తీసుకు రావడం
 • టిఎఫ్ ఆర్ ను తగ్గిస్తూ 2.1 స్థాయి కి తీసుకు రావడం
 • కుష్ఠు రోగం వ్యాప్తి ని తగ్గిస్తూ దీనిని 1/10000 కంటే త‌క్కువ ఉండేలా చూడ‌డం, అన్ని జిల్లాల‌లో ఈ రోగం సంక్రమణ అవకాశాన్ని సున్నా స్థాయి కి చేర్చ‌డం
 • చలిజ్వరం వార్షిక‌ ప్రాబ‌ల్యాన్ని 1/1000 క‌ంటే త‌క్కువ ఉండేటట్టు చూడ‌డం
 • సాంక్ర‌మిక‌, సాంక్ర‌మికేత‌ర వ్యాధుల విష‌యం లో మ‌ర‌ణాలు, అనారోగ్యాన్ని నిరోధించ‌డంఅలాంటి వాటిని త‌గ్గించ‌డం, అలాగే గాయాల కార‌ణం గా మ‌ర‌ణాలు, అనారోగ్యం బారిన పడకుండా చూడ‌డం, కొత్త కొత్త వ్యాధుల కార‌ణం గా మ‌ర‌ణాలు, స్వాస్థ్య సంబంధి వ్యాధుల లో తగ్గుదల ను తీసుకు రావడం కోసం పాటు పడడం
 • ఆరోగ్య సంర‌క్ష‌ణ కు అయ్యే ఖర్చులను ప్రతి ఒక్క పరివారానికి తగ్గట్టు గా త‌గ్గించ‌డం
 • దేశం లో 2025 వ సంవత్సరానికల్లా టీబీ ని అంతం చేయ‌డం.

ఉపాధి క‌ల్ప‌న సంబంధి సామ‌ర్ధ్యాలు స‌హా ఇతర విధాలైన ప్ర‌భావాలు:

 • 2019-20 సంవత్సరం లో జాతీయ ఆరోగ్య మిశన్ అమ‌లు తో జిడిఎమ్ఒ లు, స్పెశలిస్టు లు, ఎఎన్‌ఎమ్ లు, స్టాఫ్ న‌ర్సు లు, ఆయుష్ డాక్ట‌ర్లు, పారామెడిక్‌ లు, ఆయుష్ పారా మెడిక్‌ లు, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ సిబ్బంది, ప‌బ్లిక్ హెల్థ్ మేనేజ‌ర్ లను దాదాపు 18,779 మంది ని కాంట్రాక్టు ప‌ద్ధ‌తి లో నియ‌మించ‌డం జ‌రిగింది.
 • అలాగే 2019-20 లో జాతీయ ఆరోగ్య మిశన్ (ఎన్ హెచ్ఎమ్) అమ‌లు తో ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి దారితీసింది.  ఇది కోవిడ్ -19 ని చురుకుగాను, మ‌రింత స‌మ‌న్వ‌యం తోను ఎదుర్కోవ‌డానికి వీలు క‌ల్పించింది.
 • భారతదేశం లో యు5ఎమ్ఆర్ 2012 లో 52 గా ఉండ‌గా, అది 2018 నాటికి 36 కు ప‌డిపోయింది.  యు5ఎమ్ఆర్ వార్షిక త‌రుగుద‌ల రేటు 1990- 2012 మ‌ధ్య 3.9 శాతం  ఉండ‌గా, 2013-18 మ‌ధ్య‌ అది 6.0 శాతానికి పుంజుకొంది.
 • దేశం లో 1990 లో బాలింత‌ ల మ‌ర‌ణాల రేటు (ఎమ్ ఎమ్ ఆర్) ప్రతి ల‌క్ష జ‌న‌నాల‌ కు 556 గా ఉండ‌గా, 2016-18 నాటికి అది 443 పాయింట్లు ప‌డిపోయి 113 కు పరిమితం అయింది. 1990 నుంచి ఎమ్ఎమ్ఆర్ లో 80 శాతం త‌రుగుద‌ల ను సాధించ‌డం జ‌రిగింది.  ఇది అంత‌ర్జాతీయ త‌రుగుద‌ల అయిన 45 శాతం
 • సరాసరి కంటే చాలా ఎక్కువ‌గా ఉంది.  గడచిన అయిదు సంవత్సరాల లో ప్రసూతి మరణాల రేటు లోనూ క్షీణత నమోదు అయింది. 2011-13 న‌మూనా రిజిస్ట్రేశన్ వ్య‌వ‌స్థ (ఎస్‌ఆర్‌ఎస్‌) లో 2011-13 లో ఇది 167 ఉండ‌గా అది 2016-18 లో 113 కు ప‌డిపోయింది.
 •  మరణాల రేటు (ఎమ్ఆర్) 1990 లో 80 గా ఉండ‌గా, అది 2018 లో తగ్గి 32 గా ఉండింది.  ఐఎమ్ఆర్‌ లో వార్షిక కాంపౌండ్ రేటు శాతం ప‌త‌నం గ‌డ‌చిన‌ ఐదు సంవ‌త్స‌రాల‌లో అంటే 2013 నుంచి 2018 మ‌ధ్య కాలం లో 4.4 శాతానికి పెరిగింది. 1990-2012 మ‌ధ్య ఇది 2.9 శాతం గా ఉండేది.
 • న‌మూనా రిజిస్ట్రేశన్ వ్య‌వ‌స్థ (సాంపల్ రిజిస్ట్రేశన్ సిస్టమ్- ఎస్‌ఆర్‌ఎస్‌) ప్ర‌కారం, భారతదేశం లో టిఎఫ్‌ఆర్ 2013 లో 2.3 శాతం గా ఉండ‌గా, 2018లో అది 2.2 శాతానికి ప‌డిపోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వేక్షణ- 4 (ఎన్‌ ఎఫ్‌హెచ్‌ఎస్- 4, 2015-16) సైతం 2.2 టిఎఫ్ఆర్‌ ను న‌మోదు చేసింది.  టిఎఫ్ ఆర్‌ లో వార్షిక కాంపౌండ్‌ రేటు శాతం త‌రుగుద‌ల రేటు 2013-18 మ‌ధ్య 0.89 శాతం గా గ‌మ‌నించ‌డం జ‌రిగింది.
 • 2019 వ సంవ‌త్స‌రంలో చలిజ్వరం కేసుల ను 2018 నాటి గ‌ణాంకాల‌తో పోల్చిన‌పుడు 21.27 శాతం, ఈ రుగ్మత కారణం గా సంభవించే మ‌ర‌ణాలలో 20 శాతం క్షీణత ఉంది.
 • 2012లో టిబి కేసుల లో ప్రతి ల‌క్ష‌ జనాభా లో 234 గా ఉండ‌గా, 2019 కల్లా అది 193 కు ప‌డిపోయింది.  టిబి కార‌ణం గా మ‌ర‌ణాల సంఖ్య ప్ర‌తి ల‌క్ష జ‌నాభా కు 2012 లో 42 ఉండ‌గా, 2019 నాటికి అది 33 కు ప‌డిపోయింది.
 • కాలా-జార్ రోగం తాలూకు కేసులను ప్ర‌తి ప‌ది వేల జ‌నాభా లో ఒకటి కంటే త‌క్కువ‌ కు నిర్మూలించే ల‌క్ష్యాన్ని సాధించ‌డం జ‌రిగింది.  ఈ ల‌క్ష్య‌ సాధ‌న శాతం 2014లో 74.2 శాతంగా ఉండ‌గా, 2019-20 నాటికి అది 94 శాతానికి చేరింది.
 • వ్యక్తుల మరణాల రేటు (కేస్ ఫాటలిటీ రేట్- సిఎఫ్ఆర్) ను 1 శాతం కన్నా తక్కువ కు పరిమితం చేయాలని పెట్టుకొన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడమైంది.  2019 లో డెంగి తో వ్యక్తుల మరణాల రేటు 0.1 శాతం గా ఉండింది.

ఖ‌ర్చు: 27,989.00 కోట్ల రూపాయలు (కేంద్రం వాటా)

ల‌బ్ధిదారులు :

ఎన్‌ హెచ్‌ఎమ్ ను మొత్తం జ‌నాభా ప్ర‌యోజ‌నం కోసం అమ‌లు చేస్తున్నారు.  దీని సేవ‌ల‌ ను ప్ర‌జారోగ్య కేంద్రానికి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికీ అందించ‌డం జ‌రుగుతుంది. ముఖ్యం గా స‌మాజం లో వయస్సు , రోగాల పరంగా అధిక ప్రమాదం ఎదుర్కొంటున్న వ‌ర్గాల‌కు చెందిన వారి పైన ప్ర‌త్యేకం గా దృష్టి సారించడం జ‌రుగుతున్నది.

2019-20 లో ఎన్‌ హెచ్ఎమ్ కింద సాధించిన ప్ర‌గ‌తి కి సంబంధించిన వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి:

 • 2020 వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి 63,761 ఆయుష్మాన్ భార‌త్ హెల్థ్ & వెల్‌ నెస్ సెంటర్ ల కు అనుమ‌తులు మంజూరు చేయడమైంది. 2020 మార్చి నెల 31 నాటికి 40,000 హెల్థ్ & వెల్‌నెస్ సెంట‌ర్ లు కార్య‌క‌లాపాలు సాగించాల్సి ఉండ‌గా 38,595 హెల్థ్ & వెల్‌నెస్ కేంద్రాలు కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. 2020 మార్చి నెల 31 నాటికి  3,08,310 మంది హెల్థ్ వ‌ర్క‌ర్ లు ప‌ని చేస్తున్నారు. ఇందులో ఆశా, మ‌ల్టీప‌ర్ప‌స్ వ‌ర్క‌ర్ లు (ఎమ్ పిడ‌బ్ల్యు లు- ఎఫ్‌), ఆక్సిల‌రీ న‌ర్స్ మిడ్ వైఫ్ (ఎఎన్‌ఎమ్) స్టాఫ్ న‌ర్సు లు, ప్రైమ‌రీ హెల్థ్ సెంట‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ లు ఉన్నారు.
 • బాలింత‌ల మ‌ర‌ణాల రేటు గ‌ణ‌నీయం గా ప‌డిపోయింది.  అలాగే ఐదేళ్ల‌ లోపు పిల్ల‌ల మ‌ర‌ణాల రేటు , ఐఎంఆర్‌లు జాతీయ ఆరోగ్య మిశన్‌, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిశన్‌ లు ప్రారంభించిన త‌రువాత త‌గ్గాయి.  ప్ర‌స్తుతం ఈ మ‌ర‌ణాల రేటు లో త‌రుగుద‌ల‌ తో భారతదేశం సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాన్ని (ఎమ్ఎమ్ఆర్ -70, యు5ఎమ్ఆర్‌-25) 2030 కంటే చాలా ముందే సాధించ గ‌లుగుతుంది.
 • 2019-20 లో మిశన్ ఇంధ్ర‌ధ‌నుష్ 2.0 ను ఇప్ప‌టివ‌ర‌కు చేర‌ని వ‌ర్గాల‌కు చేర్చేందుకు  తీవ్ర‌త‌రం చేయ‌డం జ‌రిగింది.  అలాగే  29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని 381 జిల్లాల‌లో పాక్షికంగా టీకాలు వేసిన వ‌ర్గాల‌కు చేరేందుకు దీనిని నిర్వ‌హించారు.
 • 2019-20 లో 529.98 ల‌క్ష‌ల డోసు ల రోటా వైర‌స్ వాక్సీన్‌, 463.88 లక్ష‌ల డోసు ల మీజెల్స్‌- రూబెలా వాక్సీన్ ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌లో వేయ‌డం జ‌రిగిం
 • బిహార్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, రాజస్థాన్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, హ‌రియాణా  ల‌లో న్యుమోకోక్కల్ కోంజ్యుగేటిడ్ వాక్సీన్ తాలూకు ఇంచుమించు 164.18 ల‌క్ష‌ల డోసుల ను 2019-20 లో ఇవ్వడమైంది.
 • ప‌శ్చిమ‌ బంగాల్‌ లోని 9 జిల్లాల కు చెందిన 25 జెఇ ఎండెమిక్ బ్లాకుల లో 2019-20 లో 25.27 ల‌క్ష‌ల మంది వ‌యోజ‌నుల‌కు జ‌ప‌నీస్ ఇన్‌సెఫెలైటిస్ వాక్సీన్‌ ను ఇవ్వడమైంది.
 • అన్ని రాష్ట్రాలలో, కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌ లో గల 16,900 ఆరోగ్య కేంద్రాల లో ప్ర‌ధాన‌ మంత్రి సుర‌క్షిత్ మాతృత్వ్ అభియాన్‌ (పిఎమ్ఎస్ఎమ్ఎ) కార్యక్రమం లో భాగం గా 2019-20 లో  45.45 ల‌క్ష‌ల ఎఎన్‌సి స్వాస్థ్య పరీక్షల ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.
 • ప్రసవ్ కక్ష్ గుణవత్తా సుధార్ పహల్ - ల‌క్ష్య‌ (LaQshya) : 2020వ సంవత్సరం మార్చి నెల 31 వ తేదీ వ‌ర‌కు 543 ప్ర‌సూతి గ‌దులు, 491 మెట‌ర్నిటీ ఆప‌రేశన్ థియేట‌ర్ లు National LaQshya స‌ర్టిఫికేట్ ను పొందాయి.  అలాగే 220 ప్ర‌సూతి గ‌దులు 190 మెట‌ర్నిటీ ఆప‌రేశన్ థియేట‌ర్ లు నేశన‌ల్ ల‌క్ష్య స‌ర్టిఫికెట్ ను పొందాయి.  2019-20లో దేశం లో కోల్డ్‌ చైన్ వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేసేందుకు కోల్డ్ చైన్ ప‌రిక‌రాలు అంటే ఐఎల్ఆర్ -283, డిఎఫ్‌-187, కోల్డ్ బాక్స్ (పెద్ద‌వి) -13,609, కోల్డ్ బాక్స్ (చిన్న‌వి) 11,010వాక్సీన్‌ కారియ‌ర్ లు 270230, ఐస్ ప్యాక్‌ లు 10,94,650 ను రాష్ట్రాల కు,కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.
 • 2019-20లో దేశం లో కోల్డ్‌ చైన్ వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేసేందుకు కోల్డ్ చైన్ ప‌రిక‌రాలు అంటే ఐఎల్ఆర్ -283, డిఎఫ్‌-187, కోల్డ్ బాక్స్ (పెద్ద‌వి) -13,609, కోల్డ్ బాక్స్ (చిన్న‌వి) 11,010వాక్సీన్‌ కారియ‌ర్ లు 270230, ఐస్ ప్యాక్‌ లు 10,94,650 ను రాష్ట్రాల కు,కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.

 

 • ఈ పథకం లో భాగం గా 2020 మార్చి 31 నాటికి 63,761 ఆయుష్మాన్‌  భార‌త్ హెల్థ్ & వెల్‌నెస్ సెంట‌ర్ లకు అనుమతి మంజూరు చేశారు. 2020 మార్చి 31 నాటికి 40,000 హెల్త్ , వెల్ నెస్ కేంద్రాల‌ను ప‌నిచేయించాల‌న్న‌ది ల‌క్ష్యం కాగా 38,595 హెల్త్‌, వెల్‌నెస్ కేంద్రాలు కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి.  అక్రిడిటిడ్ సోశల్ హెల్థ్ ఏక్టివిస్ట్ (ఎఎస్ హెచ్ ఎ-ఆశా’) కార్య‌క‌ర్త‌ లు, మల్టి ప‌ర్ప‌స్‌ వ‌ర్క‌ర్ లు (ఎమ్ పిడ‌బ్ల్యు స్-ఎఫ్‌), ఆగ్జిలరి నర్స్ మిడ్ వైఫ్ (ఎఎన్ఎమ్ స్), స్టాఫ్ న‌ర్స్ లు, ప్రైమ‌రీ హెల్థ్ సెంట‌ర్ (పిహెచ్ సి) మెడిక‌ల్ ఆఫీస‌ర్లు 2020 మార్చి నెల  31 చివ‌రి నాటికి  మొత్తం 3,08,410 మంది  హెల్త్ వ‌ర్క‌ర్లు ఉన్నారు.

• 2019-20 లో, మొత్తం 16,795 ఎఎస్ హెచ్ ఎ లను ఎంపిక చేశారు.  దీనితో 2020 మార్చి నెల  నాటికి దేశవ్యాప్తం గా  మొత్తం ఎఎస్ హెచ్ఎ (ఆశా) వ‌ర్క‌ర్ లు 10.56 ల‌క్ష‌ల మంది ఉన్నారు.

 • నేష‌న‌ల్ ఏంబ్యులెన్స్ స‌ర్వీసెజ్ (ఎన్‌ఎఎస్‌):  దేశం లో 33 రాష్ట్రాలు /  కేంద్ర‌ పాలిత ప్రాంతాలకు 2020 మార్చి నాటికి ఈ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డమైంది.  దీని ద్వారా ప్ర‌జ‌లు 108 కు గాని, లేదా 102 కు గాని డ‌య‌ల్‌ చేసి ఏంబ్యులన్స్ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు. దీనికి అదనం గా, 2019-20 లో 1096 ఈ తరహా అదనపు అత్యవసర ప్రతిస్పందన సేవ (ఎమ‌ర్జెన్సీ రిస్ పాన్స్ స‌ర్వీస్) వాహ‌నాలను చేర్చడం జరిగింది.
 • 2019-20 లో 187 అదనపు మొబైల్ మెడిక‌ల్‌ యూనిట్ (ఎమ్ఎమ్ యు)లను  చేర్చడమైంది.
 • వారం లో ప్రతి రోజూ 24 గంట‌ల సేపు (24X7) అందుబాటులో ఉండే సేవలు మరియు ఫ‌స్ట్ రెఫ‌ర‌ల్ ఫెసిలిటీస్ (ఎఫ్ఆర్ యు స్):  2019-20 లో అదనం గా 53 ఎఫ్‌ ఆర్‌యుల ను ఎఫ్ఆర్ యు లలో భాగం గా తీసుకు రావడమైంది.
 • కాయ‌క‌ల్ప్‌:  25 రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల లో 2019-20 లో 293 జిల్లా ఆసుపత్రులు, 1,201 సాముదాయిక స్వాస్థ్య కేంద్రాలు/ ఎస్‌డిహెచ్, 2,802 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌ సి లు), 668 యు హెచ్‌ సి ల తో పాటు 305 హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ (హెచ్‌ డ‌బ్ల్యుసి) లు 70 శాతం కంటే అధిక స్కోరు ను సాధించాయి.  ఈ పథకం లో భాగం గా 2019-20 లో 5,269 ప‌బ్లిక్ హెల్థ్ ఫెసిలిటీ లను చేర్చడమైంది.
 • మ‌లేరియా: 2018 లో మొత్తం మ‌లేరియా (చలిజ్వరం) కేసు లు 4,29,928 కాగా ఈ రోగం తో సంభవించిన మ‌ర‌ణాలు 96 గా ఉన్నాయి.  2014 లో ఈ సంఖ్య లు అంటే కేసులు 11,02,205 గా మరియు మ‌ర‌ణాలు 561 గా ఉన్నాయి.  ఇది 2014 గ‌ణాంకాల‌తో పోల్చి చూసిన‌పుడు మ‌లేరియా కేసుల‌లో 61 శాతం త‌గ్గుద‌ల‌, మ‌ర‌ణాల‌లో 83 శాతం త‌గ్గుద‌ల న‌మోదైన‌ట్టు సూచిస్తోంది.
 • కాలా - అజార్‌:  దేశం లో 94 శాతం కాలా - అజార్‌ స్థానీయ బ్లాకుల లో 2019 డిసెంబర్ చివరి నాటికి బ్లాకు స్థాయి లో ప్రతి 10,000 జనాభా లో కాలా - అజార్‌ నిర్మూల‌న కు సంబంధించి ఒకటి కంటే తక్కువ ఉండాలనే ల‌క్ష్యాన్ని సాధించేయడమైంది.
 • లింఫేటిక్ ఫైలేరియాసిస్‌:   దీనిని ఏనుగు పాదం అని కూడా అంటూ ఉంటారు. దీనితో రోగి పాదాలు వాచిపోయి బాగా లావుగా అయిపోతాయి.  2019వ సంవత్సరం లో 257 స్థానీయ జిల్లాల లో 98 జిల్లా లలో దీని వ్యాప్తి రేటు ఒక శాతం కంటే త‌క్కువ‌ లక్ష్యాన్ని సాధించాయి.  ట్రాన్స్‌మిశన్ అసెస్‌ మెంట్ స‌ర్వే (టిఎఎస్-1) దీనిని చాటిచెప్పింది.  ఈ కారణం గా విస్తృత స్థాయి లో మందును ఇచ్చే కార్యక్రమాన్ని (మాస్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేశన్- ఎండిఎ)ను నిలిపివేయడమైంది.
 • డెంగి వ్యాధి విషయానికి వ‌స్తే, జాతీయ ల‌క్ష్యం కేస్ ఫాట‌లిటీ రేట్ (సిఎఫ్‌ఆర్) ను ఒక శాతం కంటే త‌క్కువ ఉండేలా చూడాలనేది జాతీయ లక్ష్యం గా ఉంది.  2014 లో  0.3 శాతం సిఎఫ్ఆర్ ను  సాధించ‌గా, 2015 నుంచి 2018 మ‌ధ్య కాలం లో సిఎఫ్‌ఆర్ 0.2 శాతం గా ఉంది.  2019 లో దీనిని 0.1 శాతానికి త‌గ్గించడమైంది.
 • జాతీయ క్ష‌య వ్యాధి నిర్మూల‌న కార్య‌క్ర‌మం (ఎన్‌టిఇపి) : దేశం లో ప్రతి జిల్లా స్థాయి లోను మొత్తం 1,264 కార్ట్ రిజ్ ఆధారిత న్యూక్లిక్ ఏసిడ్ ఏంప్లఫకేశన్ టెస్ట్ (సిబిఎఎటి) యంత్రాలు, 2,206 ట్రూనెట్ యంత్రాలు ప‌ని చేస్తున్నాయి.  2019 వ సంవత్సరం లో 35.30 ల‌క్ష‌ల మాలిక్యులార్ ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.  ఇది 2017 వ సంవత్సరం లోని 7.8 ల‌క్ష‌ల ప‌రీక్ష‌ల తో పోల్చి చూసినప్పుడు 5 రెట్లు అధికం.  2019వ సంవత్సరం లో 22,03,895 మంది టిబి రోగులకు డ్ర‌గ్స్ సెంసిటివ్ మందులను రోజువారి ప్రాతిపదిక న ఇవ్వడమైంది.  2018లో ఇలాంటి రోగుల సంఖ్య 19,71,685 గా ఉంది.  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో  టిబి నిరోధక మందుల తో పాటు దీని పథ్యం అవధి ని తగ్గించడం తో పాటు బేడాకియూలీన్ ఆధారితమైన ఆహార నియమం పద్ధతి ని మొదలుపెట్టడం జరిగింది. 2019 వ సంవత్సరం లో 40,397 మల్టీ డ్రగ్ రెజిస్టెంట్ (ఎమ్ డిఆర్‌/ఆర్ఆర్‌) టిబి రోగుల కోసం త‌క్కువ వ్య‌వ‌ధి కలిగిన పథ్యం కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది.‌
 • ప్ర‌ధాన‌ మంత్రి నేశన‌ల్ డాయలిసిస్ ప్రోగ్రామ్ (పిఎమ్ఎన్‌ డిపి):  జాతీయ ఆరోగ్య మిశన్ లో భాగం గా ప్రైవేటు, పబ్లిక్ పార్ట్ నర్ శిప్ పద్ధతి న  దేశం లోని అన్ని జిల్లా ఆస్ప‌త్రుల‌లో మూత్రపిండాల సంబంధి రోగాలతో బాధితులైన వారి కోసం డాయలిసిస్ స‌దుపాయాల‌ను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్ర‌ధాన‌ మంత్రి నేశన‌ల్ డాయలిసిస్ ప్రోగ్రాము (పిఎమ్ఎన్‌ డిపి) ని  2016 వ సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది.  2019-20వ ఆర్ధిక సంవ‌త్స‌రం లో ఈ కార్య్రమాన్ని 3 రాష్ట్రాలు/ కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌ లోని 52 జిల్లాలలో గల 105 కేంద్రాల‌ లో 885 యంత్రాల‌ తో దీనిని అమలుపరచడమైంది.

పూర్వరంగం:

నేశన‌ల్ రూర‌ల్ హెల్థ్ మిశన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్) ని ప్ర‌ధాన‌ మంత్రి 2005 ఏప్రిల్ 12న ప్రారంభించారు.  గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు, ప్ర‌త్యేకించి పేదల‌కు, అధిక ప్రమాదం కల వ‌ర్గాల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ అందుబాటు లో ఉండే విధం గా తక్కువ ఖర్చు లో, నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ను అందించడం కోసం దీనిని ప్రారంభించారు.  2013 మే 1న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం లో నేశన‌ల్ హెల్థ్ మిశన్ తాలూకు ఒక స‌బ్‌- మిశన్‌ గా  నేశన‌ల్ అర్బ‌న్ హెల్థ్ మిశన్‌ ను (ఎన్‌ యుహెచ్‌ఎమ్) కు మంజూరు ను ఇవ్వడమైంది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్ కూడా నేశన‌ల్‌ హెల్థ్ మిశన్ లో ఒక ఉప మిశన్ గా ఉంది.

మంత్రివర్గం 2018 మార్చి 21 నాటి సమావేశం లో నేష‌న‌ల్ హెల్థ్ మిశన్‌ ను 2017 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపింది.

ఆర్థిక శాఖ‌ కు చెందిన వ్య‌య విభాగం త‌న కార్యాలయం మెమొరాండమ్ నంబ‌రు 42 (02/ పిఎఫ్ -II, 2014) తేదీ జ‌న‌వ‌రి 10, 2020 ద్వారా నేశన‌ల్ హెల్థ్ మిశన్‌ ను 2021 మార్చి 31 వ‌ర‌కు  లేదా 15వ ఆర్ధిక సంఘం సిఫారసు లు అమ‌లు లోకి వ‌చ్చేటంత‌ వ‌ర‌కు- ఏది ముందు అయితే అంత‌వ‌ర‌కు- పొడిగిస్తూ ఆమోదం తెలిపింది.

మంత్రివర్గం ఆమోదం పొందిన ఎన్‌ హెచ్‌ఎమ్ ఫ్రేమ్ వ‌ర్క్ ప్ర‌కారం, ఈ ఫ్రేమ్ వ‌ర్క్ కింద బ‌ద‌లాయించిన అధికారాల‌కు సంబంధించి ఎన్‌ ఆర్‌హెచ్ఎమ్ ప్ర‌గ‌తి విష‌యం లో పురోగతి నివేదిక‌ ను స‌మ‌ర్పిచవ‌ల‌సి ఉంటుంది.  అలాగే ఫైనాన్షియ‌ల్ నిబంధ‌న‌ల‌లో మార్పులు, ప్ర‌స్తుతం కొన‌సాగే ప‌థ‌కం లో ఏవైనా మార్పులు, కొత్త ప‌థ‌కాల వివ‌రాల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం మంత్రివర్గం స‌మాచారం కోసం నివేదించాలి.

 

***(Release ID: 1707149) Visitor Counter : 320