మంత్రిమండలి

జ‌ల వ‌న‌రుల రంగం లో భార‌త‌దేశాని కి, జపాన్ కు మధ్య స‌హ‌కారపూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒసి) పై సంత‌కాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 23 MAR 2021 3:21PM by PIB Hyderabad

జ‌ల వ‌న‌రుల రంగం లో భార‌త ప్ర‌భుత్వ జ‌ల‌ శ‌క్తి మంత్రిత్వ శాఖ కు చెందిన జ‌ల‌ వ‌న‌రులు, న‌దుల వికాసం, గంగా న‌ది సంరక్షణ విభాగానికి, జ‌పాన్ కు చెందిన భూమి, మౌలిక స‌దుపాయాలు, ర‌వాణా మ‌రియు ప‌ర్య‌ట‌న మంత్రిత్వ శాఖ కు చెందిన జలం, విపత్తు నిర్వ‌హ‌ణ మండ‌లి ల మ‌ధ్య సంత‌కాలైన స‌హ‌కారపూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒసి) ని గురించిన వివ‌రాల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకు రావ‌డ‌మైంది.

ప్ర‌యోజ‌నాలు:

రెండు దేశాల మ‌ధ్య స‌మాచారం, జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, శాస్త్ర విజ్ఞాన‌ప‌ర‌మైన అనుభ‌వం.. వీట‌న్నింటి ఆదాన ప్ర‌దానాన్ని పెంపొందించుకోవడం తో పాటు  సంయుక్త ప్రాజెక్టు ల అమ‌లు కు ఈ ఎమ్ఒసి పై సంతకాలు చేయడం జరిగింది. జ‌లం మ‌రియు మైదాన ప్రాంత నిర్వ‌హ‌ణ, జల సంబంధి సాంకేతిక విజ్ఞాన రంగం లో  దీర్ఘ‌కాలిక స‌హ‌కారాన్ని అభివృద్ధి ప‌ర‌చ‌డం కూడా ఈ ఎమ్ఒసి లక్ష్యాల లో ఒకటి గా ఉంది.

జ‌ల భ‌ద్ర‌త ను సాధించ‌డానికి, మెరుగైన సాగునీటి స‌దుపాయాల కు, జ‌ల వ‌న‌రుల అభివృద్ధి లో నిల‌క‌డ‌తనాన్ని నిలబెట్టుకోవడం లో ఈ ఒప్పందం తోడ్ప‌డనుంది.




 

***


(Release ID: 1706929) Visitor Counter : 202