ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులో పెరుగుతున్న కొత్త కోవిడ్ కేసులు
ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంలో 3.5 కోట్ల డోసులకు పైగా టీకాలు
నిన్న ఒక్క రోజులోనే 21 లక్షలకు పైగా టీకాలు
Posted On:
17 MAR 2021 10:42AM by PIB Hyderabad
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 28,903 కోవిడ్ కేసులు నమోదు కాగా ఆరు రాష్ట్రాలదే 71.10% వాటా. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 83.91% కేసులు వచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 61.8% కేసులు (17,864) కేసులు రాగా కేరళలో 1,970, పంజాబ్ లో 1,463 కేసులు వచ్చాయి.
ఈ క్రింద చూపిన విధంగా ఎనిమిది రాష్ట్రాలు కోవిడ్ కేసుల పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి. కేరళలో గత నెలరోజులుగా కేసుల తగ్గుదల కనబడుతోంది.
భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 2,34,406 కాగా అవి మొత్తం పాజిటివ్ కేసులలో 2.05%. చికిత్సలో ఉన్న కేసులలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ లోనే 76.4% ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 60% ఉన్నాయి.
ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 5,86,855 శిబిరాల ద్వారా మూడున్నర కోట్లకు పైగా (3,50,64,536) టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 75,06,155 డోసుల మొదటి విడత ఆరోగ్య సిబ్బంది, 45,54,855 రెండో విడత ఆరోగ్య సిబ్బంది, 76,00,030 మొదటి విడత కోవిడ్ యోధులు, 47,644 రెండో విడత కోవిడ్ యోధులు, 21,66,408 మంది 45-60 ఏళ్ళ మధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 1,15,89,444 మంది 60 ఏళు పైబడ్డవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
75,06,155
|
45,54,855
|
76,00,030
|
16,47,644
|
21,66,408
|
1,15,89,444
|
3,50,64,536
|
టీకాల మొదలైన 60వ రోజైన మార్చి 16న 21 లక్షలకు పైగా (21,17,104) టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 30,871 శిబిరాల ద్వారా 17,82,553మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులకు మొదటి డోస్ 3,34,551 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులకు రెండో డోస్ టీకాలిచ్చారు.
తేదీ: మార్చి16, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
59,172
|
96,239
|
1,25,624
|
2,38,312
|
2,77,681
|
13,20,076
|
17,82,553
|
3,34,551
|
భారత దేశంలో మొత్తం కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 1,10,45,284 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96.56%.
గత 24 గంటలలో కోవిడ్ బారిన పడి మరణించినవారి సంఖ్య 188 గా నమోదైంది. 86.7% మరణాలు ఆరు రాష్ట్రాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 87 మంది మరణించగా పంజాబ్ లో 38 మంది, కేరళలో 15 మంది చనిపోయారు.
15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, లక్షదీవులు, సిక్కిం, మేఘాలయ, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1705635)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam