ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంలో 3 కోట్ల డోసులకు చేరువౌతున్న భారత్
గత 24 గంటల్లో 15 లక్షలు దాటిన కోవిడ్ టీకాలు కొత్త కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు మహారాష్ట, కేరళ,
పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్
Posted On:
14 MAR 2021 11:36AM by PIB Hyderabad
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్దదైన టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య దాదాపుగా 3 కోట్లకు దగ్గరవుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలవరకు 5,10,400 శిబిరాల ద్వారా 2,97,38,409 డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది మొదటి డోసులు 73,47,895, రెండో డోసులు 42,95,201, కోవిడ్ యోధుల మొదటి 73,32,641, రెండో డోసులు 35,573 ఉండగా 14,40,092 మంది లబ్ధిదారులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 81,87,007 మంది 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారులు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
73,47,895
|
42,95,201
|
73,32,641
|
11,35,573
|
14,40,092
|
81,87,007
|
2,97,38,409
|
టీకాల కార్యక్రమం మొదలైన 57వ రోజైన మార్చి 13 న 15 లక్షలకు పైగా (15,19,952) టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 12,32,131 మంది ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు 24,086 శిబిరాల ద్వారా మొదటి డోస్ ఇవ్వగా 2,87,821 ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు రెండో డోస్ ఇచ్చారు.
తేదీ : మార్చి 13, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
54,320
|
1,01,171
|
96,896
|
1,86,650
|
1,85,624
|
8,95,291
|
12,32,131
|
2,87,821
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రోజువారీ ఇస్తున్న కోవిడ్ టీకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటాన్ని ఈ చిత్రపటంలో చూడవచ్చు.
కొన్ని రాష్ట్రాలలో రోజువారీ కొత్త కెసుల పెరుగుదల కొనసాగుతోంది. గత 24 గంటలలో 25,320 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో 87.73% శాత కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 15,602 కేసులు రాగా కేరళలో 2,035, పంజాబ్ లో 1,510 కేసులు వచ్చాయి..
రోజువారీ కేసుల పెరుగుల ఎనిమిది రాష్ట్రాలు కనబరుస్తున్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య Indi 2,10,544 కు చేరింది. ఇందులో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ వాటా 76.93%. ఈ రాష్టాలలోని మొదటి ఐదు జిల్లాల కేసుల సమాచారం ఈ దిగువ చిత్రపటంలో ఉంది.
భారతదేశంలో ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల మొత్తం సంఖ్య 1,09,89,897 కాగా కోలుకున్న వారిశాతం 96.75%. గత 24 గంటలలో 16,637 మంది కోలుకోగా వారిలో 83.13% మంది కేవలం 6 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. మహారాష్టలో అత్యధికంగా ఒకే రోజు 7,467 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 161 మంది కోవిడ్ వల్ల మరణించారు. ఇందులో ఆరు రాష్ట్రాలవాటా 84.47%. మహారాష్టలో అత్యధికంగా ఒక రోజులో 88 మంది మరణించగా పంజాబ్ లో 22 మంది, కేరళలో 12 మంది చనిపోయారు.
గత 24 గంటలలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: రాజస్థాన్, జార్ఖమ్డ్, పుదుచ్చేరు, లక్షదీవులు, మేఘాలయ, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, అండమాన్-నికోబార్, అరుణాచల్ ప్రదేశ్
***
(Release ID: 1704740)
Visitor Counter : 225
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam