ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాలలో మరో మైలురాయి చేరిన భారత్ ఒక్క రోజులో 20.53 లక్షలకు పైగా టీకా డోసులు

Posted On: 13 MAR 2021 11:22AM by PIB Hyderabad

భారతదేశం జనవరి16న ప్రారంభించిన దేశవ్యాప్త  కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమంలో మరో మైలురాయి చేరుకుంది. ఒకే రోజు 20 లక్షలకు పైగా, అంటే 20,53,537 టీకా డోసులిచ్చింది. టీకాల పంపిణీ మొదలైన 56వరోజైన మార్చి 12న 30,561 శిబిరాల ద్వారా   ఈ టీకాలిచ్చింది. ఇప్పటివరకు 16,39,663 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా 4,13,874 మంది లబ్ధిదారులు రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు.

తేదీ: మార్చి 12, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2 వ డోస్

1వ డోస్

2 వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2 వ డోస్

70,504

1,37,745

1,14,621

2,76,129

2,23,856

12,30,682

16,39,663

4,13,874

 

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి మొత్తం 2.82 కోట్లకు పైగా (2,82,18,457) టీకా డోసులను 4,86,314 శిబిరాల ద్వారా పంపిణీచేశారు. ఇందులో  72,93,575 మంది మొదటి డో స్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 41,94,030 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 72,35,745 మంది మొదటి డోస్ అందుకున కోవిడ్ యోధులు,   9,48,923 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, 12,54,468 మంది మొదటి డోస్ అందుకున్న  45 ఏళ్ళు దాటి దీర్ఘకాల వ్యాధులతోబాధపడుతున్నవారు, 72,91,716 మంది మొదటి డోస్ అందుకున్న  60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

1వ డోస్

2nd Dose

1వ డోస్

2nd Dose

1వ డోస్

1వ డోస్

72,93,575

41,94,030

72,35,745

9,48,923

12,54,468

72,91,716

 గత 24 గంటలలో వేసిన 20,53,537 డోసుల టీకాలలో 8 రాష్టాల వాటా 74% గా నమోదైంది. 3.3 లక్షల డోసులతో  ఉత్తరప్రదేశ్ ముందుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GRZH.jpg

 దేశవ్యాప్తంగా రెండో డోస్ టీకాలలో 69% వాటా 10 రాష్ట్రాలదే. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 9.71% (4,99,242)  మంది రెండో డోస్ టీకాలు తీసుకున్నారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JOKW.jpg

 భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 2,02,022 మంది కాగా మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.78%. గత 24 గంటలలో 24,882 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 87.72% మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలదే.  దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులలో ఒక్క మహారాష్ట్రలోనే 63.57% ఉన్నాయి.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003B1GW.jpg

ఎనిమిది రాష్ట్రాలలో రోజువారీ కొత్త కేసుల పెరుగుదల కనబడుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048IJJ.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056D3J.jpg

 

మరోవైపు 20 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్న కేసులు 1000 లోపే ఉన్నాయి. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V1M7.jpg

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్ నుంచి కోలుకొని బైటపడినవారి సంఖ్య  1,09,73,260 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96.82%. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ ఈరోజుకి 10,771,238 కి చేరింది.  గత 24 గంటలలో 19,957 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇందులో  86.43% మంది ఆరు రాష్ట్రాలవారే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 11,344 మంది కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007NNK4.jpg

 

గత 24 గంటలలో 140 మంది కోవిడ్ తో చనిపోయారు. మృతులలో 81.43% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్టలో అత్యధికంగా 56 మంది చనిపోగా పంజాబ్ లో 34 మంది, కేరళలో 14 మంది చనిపోయారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008RN3W.jpg

గత 24 గంటలలో 18 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:రాజస్థాన్, చందీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పుదుచ్చేరి, అస్సాం, లక్షదీవులు, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, అండమాన్-నికోబార్ దీవులు, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్

 

****



(Release ID: 1704591) Visitor Counter : 196