ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్,కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో గరిష్ఠంగా రోజువారి కోవిడ్ కొత్త కేసులు నమోదు కొనసాగుతోంది.
దేశంలో చేపట్టిన అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 2.5 కోట్ల డోసులు దాటిన వాక్సినేషన్
గడచిన 24 గంటలలో వేసిన వాక్సిన్ డోస్‌ల సంఖ్య 13 లక్షలకు పైగా దాటింది.
प्रविष्टि तिथि:
11 MAR 2021 11:02AM by PIB Hyderabad
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 రోజువారి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవి గత 24 గంటలలో నమోదైన మొత్తం కేసులలో 85.91 శాతంగా ఉన్నాయి.
గత 24 గంటలలో 22,854 కొత్త కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో రోజువారి కేసుల సంఖ్య గరిష్టంగా 13,659 నమోదయ్యాయి(ఇవి రోజువారి కొత్తకేసులలో సుమారు 60 శాతం) . దీని తర్వాతి స్థానం లో కేరళ 2,475 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ లో 1393 కొత్త కేసులు నమోదయ్యాయి.

86 శాతం కొత్త కేసులు 6 రాష్ట్రాలలో నమోదయ్యాయి.
8 రాష్ట్రాలలో కొత్త కేసులు పెరుగుదలను సూచిస్తున్నాయి.

భారతదేశపు మొత్తం యాక్టివ్ కేస్ లోడ్ ఈరోజు 1,89,226 కు చేరింది. భారతదేశపు ప్రస్తుత యాక్టివ్ కేస్‌లోడ్ దేశం మొత్తం పాజిటివ్‌కేసులలో 1.68 శాతం గా ఉన్నాయి.
కింద సూచించిన గ్రాఫ్ గత 24 గంటలలో యాక్టివ్ కేసులలో మార్పును సూచిస్తున్నది.కేరళ లోయాక్టివ్ కేసులు గరిష్ఠంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటలలో కోవిడ్ కొత్తకేసులు గరిష్ఠంగా పెరుగుదలను సూచిస్తున్నాయి.

ఇక వాక్సిన్ విషయానికి వస్తే, 4,78,168 సెషన్‌లలో 2.56 కోట్లకు పైగా వాక్సిన్‌డోస్‌లు (2,56,85,011) వాక్సిన్ డోస్‌లను వేసినట్టు ఈ ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం.
ఇందులో 71,97,100 హెచ్.సి.డబ్ల్యు (తొలి డోస్), 40,13,249 హెచ్.సి.డబ్ల్యు ( రెండో డోస్), 70,54,659 ఎఫ్.ఎల్.డబ్ల్యులు( తొలి డోస్), 6,37,281 ఎఫ్.ఎల్.డబ్ల్యులు ( రెండో డోస్) ను 45 సంవత్సరాలకు పైబడిన ప్రత్యేక అనారోగ్యాలు కలిగిన లబ్ధిదారులు 9,67,058 మందికి తొలిడోస్ ఇచ్చారు. అలాగే 58,15,664 మంది 60 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు వాక్సిన్ వేశారు.
|
HCWs
|
FLWs
|
45 to <60 years with Co-morbidities
|
Over 60 years
|
Total
|
|
1st Dose
|
2nd Dose
|
1st Dose
|
2nd Dose
|
1st Dose
|
1st Dose
|
|
71,97,100
|
40,13,249
|
70,54,659
|
6,37,281
|
9,67,058
|
58,15,664
|
2,56,85,011
|
వాక్సినేషన్ మొదలైన 54 వ రోజు అంటే 2021 మార్చి 10 న మొత్తం 13,17,357 వాక్సిన్ డోస్‌లు ఇవ్వడం జరిగింది.ఇందులో 10,30,243 మంది లబ్ధిదారులకు 20,299 సెషనల్‌లలో తొలి డోస్ (హెచ్‌సిడబ్ల్యు, ఎఫ్.ఎల్.డబ్ల్యు లు) ఇవ్వడం జరిగింది. 2,87,114 హెచ్.సి.డబ్ల్యులు, ఎఫ్.ఎల్.డబ్ల్యులు రెండో డోస్‌వాక్సిన్ అందుకున్నారు.
|
Date:10th March,2021
|
|
HCWs
|
FLWs
|
45 to < 60 years with Co-morbidities
|
Over60years
|
Total Achievement
|
|
1stDose
|
2ndDose
|
1stDose
|
2nd Dose
|
1stDose
|
1stDose
|
1stDose
|
2ndDose
|
|
66,995
|
1,23,369
|
1,18,168
|
1,63,745
|
1,33,533
|
7,11,547
|
10,30,243
|
2,87,114
|
గత 24 గంటలలో 126 మరణాలు నమోదు.
కొత్తగా నమోదైన మరణాలలో 82.54 శాతం మరణాలు ఆరు రాష్ట్రాలనుంచే ఉన్నాయి. మహారాష్ట్రలో మరణాలు గరిష్ఠంగా (54) నమోదయ్యాయి. 17 మరణాలతో ఆ తరువాతి స్థానంలో పంజాబ్ ఉంది. కేరళలో గత 24 గంటలలో 14 మరణాలు సంభవించాయి.
83 శాతం మరణాలు ఆరు రాష్ట్రాలలో నమోదు.

గత 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్కకోవిడ్ మరణం కూడా సంభవించలేదు.
అవి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాఒం,ఒడిషా,గోవా,జార్ఖండ్, పుదుచ్చేరి, లక్షద్వీప్,సిక్కిం, లద్దాక్ (యుటి), మణిపూర్, డి అండ్ ఎన్, మేఘాలయ,మిజోరం, నాగాలాండ్,త్రిపుర, అండమాన్ నికోబార్ ఐలెండ్, అరుణాచల్‌ప్రదేశ్.
***
(रिलीज़ आईडी: 1704130)
आगंतुक पटल : 249