ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ప్రధాని మాన్య శ్రీ సుగా యోశీహిదే తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
09 MAR 2021 8:17PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని మాన్యశ్రీ సుగా యోశిహిదే తో మంగళవారం నాడు టెలిఫోన్ లో మాట్లాడారు.
నేత లు ఇద్దరూ గత కొన్నేళ్ళ లో భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువ ల మార్గదర్శకత్వం లో సకారాత్మకమైన వేగ గతి ని అందుకోవడం పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యం లో సైతం కిందటి ఏడాది రెండు దేశాల మధ్య ఆదాన ప్రదానాలను కొనసాగించడం అభినందనీయమని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవల మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేశన్ ఆన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (ఎస్ఎస్‌డబ్ల్యు) పై సంతకాలు జరగడాన్ని కూడా వారు హర్షిస్తూ, అది వీలైనంత త్వరలో ఆచరణ రూపం లోకి రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ముంబయి- అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎమ్ఎహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు భారతదేశం-జపాన్ ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు ఒక చక్కని ఉదాహరణ గా ఉందని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఆ ప్రాజెక్టు ను సఫలతపూర్వకం గా అమలులోకి తీసుకువచ్చేందుకు తన తరఫు నుంచి వచనబద్ధత ను వ్యక్తం చేశారు.
పరస్పర హితం ముడిపడి ఉన్న ప్రాంతీయ అంశాలను గురించి, ప్రపంచ అంశాల ను గురించి నేతలు ఇద్దరూ వారి అభిప్రాయాల ను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొని, ఉమ్మడి సవాళ్ళ ను పరిష్కరించడం లో ఇరు దేశాల భాగస్వామ్యం ఒక ప్రముఖ పాత్ర ను పోషించగలుగుతుందని సమ్మతి ని వ్యక్తం చేశారు. ఈ విషయం లో వారు ఆస్ట్రేలియా, యుఎస్ ల వంటి భావసారూప్య దేశాల తో క్వాడ్ సమూహం లో సంప్రదింపుల మాధ్యమం ద్వారా జతపడటం ఎంతైనా ప్రయోజనకరమని, ఈ విధమైన ప్రయోజనకర చర్చ లు కొనసాగి తీరాలని కూడా అంగీకారాన్ని వెలిబుచ్చారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2022వ సంవత్సరానికల్లా 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని ఉభయ నేతలు గమనించి, ఈ ఘట్టాన్ని సముచితమైన పద్ధతి లో వేడుక గా నిర్వహించుకోవాలనే అంశం పై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏటా నిర్వహించే ద్వైపాక్షిక శిఖర సమ్మేళనానికి హాజరు కావడానికి వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించవలసిందంటూ ప్రధాని శ్రీ సుగా ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు.
***
(Release ID: 1703724)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam