ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకాల కార్యక్రమంలో మరో కీలక మైలురాయి దాటిన భారత్
గత 24 గంటల్లో 20 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు
మొత్తం టీకాలు 2కోట్ల 30 లక్షలకు పైమాటే
Posted On:
09 MAR 2021 11:27AM by PIB Hyderabad
కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి చేరుకుంది. జనవరి16న ప్రారంభించిన టీకాల కార్యక్రమంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తోంది. గత 24 గంటలలో 20 లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీచేసింది. టీకాలు ప్రారంభించిన 52వ రోజైన మార్చి 8న మొత్తం 20,19,723 టీకా డోసులిచ్చింది. అందులో 17,15,380 మంది లబ్ధిదారులకు 28,884 శిబిరాల ద్వారా ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులకు మొదటి డోస్ ఇవ్వగా 3,04,343 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులకు రెండో డోస్ ఇచ్చారు.
తేదీ: మార్చి 8, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
89,099
|
1,91,930
|
1,82,782
|
1,12,413
|
2,21,148
|
12,22,351
|
17,15,380
|
3,04,343
|
|
మొత్తం 2,30,08,733 టీకా డోసులను 4,05,517 శిబిరాల ద్వారా పంపిణీ చేసినట్టు ఈ ఉదయం 7గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఇందులో 70,75,010 మంది మొదటిఒ డోస్ ఆరోగ్య సిబ్బంది, 37,39,478 మంది రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది,. 67,92,319 మంది మొదటొ డో స్ కోవిడ్ యోధులు, 3,25,972 మంది రెండో డోస్ కోవిడ్ యోధులు, 7,01,809 మంది 45-60 ఏళ్ళ మధ్య ఉండొ మొదటి డోస్ అందుకున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 43,74,145 మంది 60 ఏళ్ళు పైబడి మొదటి డోస్ అందుకున్నవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బం ది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
70,75,010
|
37,39,478
|
67,92,319
|
3,25,972
|
7,01,809
|
43,74,145
|
1,66,16,048
|
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక రాష్టాలలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో నమోదైన 15,388 కొత్త కేసులలో 84.04% ఈ ఆరు రాష్టాలలోనే నమోదు కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 8,744 కొత్త కేసులు రాగా కేరళలో 1,412, పంజాబ్ లో 1,229 నమోదయ్యాయి.
కోవిడ్ కేసుల పెరుగుదల ఎనిమిది రాష్టాలలో నమోదవుతోంది. .
భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,87,462 కాగా ఇది దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులలో 1.67%
గత 24 గంటలలో వచ్చిన కొత్త కేసుల పంపిణీని ఈ దిగువ చిత్రపటం చూపుతోంది. నాలుగు రాష్ట్రాలు- అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్క కొత్త కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. మూడు రాష్టాలలో- మహారాష్ట్ర, పంజాబ్, కేరళలో గత 24 గంటలలో 1000 కి పైగా కొత్త కేసులు వచ్చాయి.
****\
(Release ID: 1703584)
Visitor Counter : 233