ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ నంద్ కుమార్ సింహ్ చౌహాన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2021 11:00AM by PIB Hyderabad

శ్రీ నంద్ కుమార్ సింహ్ చౌహాన్ మరణం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఖండ్ వా నుంచి లోక్ సభ ఎంపి గా పనిచేస్తూ వచ్చిన శ్రీ నంద్ కుమార్ సింహ్ చౌహాన్ గారి మరణ వార్త విని దు:ఖం కలిగింది.  పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కు ఆయన అందించిన తోడ్పాటు లు, ఆయన కనబర్చిన సంస్థాగత నైపుణ్యాలు, మధ్య ప్రదేశ్ అంతటా బిజెపి ని బలపరచడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది.  ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో  ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  

***


(రిలీజ్ ఐడి: 1702120) సందర్శకుల సూచీ సంఖ్య : : 104