పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా విమాన ప్రయాణీకుల సంఖ్య 3,13,668
గతేడాది మే 25న విమాన ప్రయాణాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక సంఖ్య
प्रविष्टि तिथि:
01 MAR 2021 12:33PM by PIB Hyderabad
ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా విమాన ప్రయాణీకుల సంఖ్య 3,13,668కు పెరిగిందని, 2,353 విమానాల ద్వారా వారంతా రాకపోకలు సాగించారని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ ఎస్. పూరి వెల్లడించారు. గతేడాది మే 25న విమాన ప్రయాణాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక సంఖ్యగా తెలిపారు.
ఫిబ్రవరి 28న విమానాల సర్వీసుల సంఖ్య 4699 కాగా, విమానాశ్రయాలకు వచ్చినవారి సంఖ్య 6,17,824.
కరోనా కారణంగా గతేడాది మార్చి 24 అర్థరాత్రి నుంచి విమాన సేవలను నిలిపివేశారు. రెండు నెలల తర్వాత, మే 25 నుంచి సేవలు పునఃప్రారంభమయ్యాయి.
****
(रिलीज़ आईडी: 1701865)
आगंतुक पटल : 209