హోం మంత్రిత్వ శాఖ

వివిధ కార్యకలాపాలపై సి.ఓ.పి. లను కఠినంగా అమలు చేయడంతో పాటు, జాగ్రత్తగా, కఠినమైన నిఘా పెట్టడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల అమలు గడువును పొడిగించిన - కేంద్ర హోం శాఖ

Posted On: 26 FEB 2021 3:31PM by PIB Hyderabad

నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం ప్రస్తుత మార్గదర్శకాలను, 31.03.2021 వరకు అమలుచేసే విధంగా, విస్తరించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.‌ఏ) ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులు మరియు కొత్త కోవిడ్-19 కేసులలో గణనీయమైన క్షీణత ఉన్నప్పటికీ, మహమ్మారిని పూర్తిగా అధిగమించడం కోసం, నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది.

వ్యాధి వ్యాప్తి కొనసాగే విధానాన్ని విచ్ఛిన్నం చేసి, మహమ్మారిని అధిగమించడంతో పాటు, ముందుగా టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జనాభాకు టీకాలు వేయడం వేగవంతం చేయాలని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

దీని ప్రకారం, కంటైన్‌మెంట్ జోన్‌లను జాగ్రత్తగా గుర్తించడం కొనసాగుతుంది.  ఈ మండలాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి.  కోవిడ్ - నియంత్రణకు తగిన ప్రవర్తనలను ప్రోత్సహించి, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా, అనుమతించిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి సూచించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (ఎస్.ఓ.పి. లు) చాలా కఠినంగా అనుసరించాలి. 

అందువల్ల, 2021 జనవరి 27వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలలో సూచించిన విధంగా, మార్గదర్శకాలు / ఎస్.ఓ.పి. లను కఠినంగా పాటించడంపై దృష్టి కేంద్రీకరించి, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, వాటిని  ఖచ్చితంగా అమలు చేయాలి.

*****


(Release ID: 1701226) Visitor Counter : 189