ప్రధాన మంత్రి కార్యాలయం

పుదుచ్చేరి లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించి, మ‌రికొన్నిటికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

మునుల‌ కు, పండితుల కు, క‌వుల కు, విప్ల‌వ‌కారుల కు పుదుచ్చేరి పుట్టినిల్లు:  ప్ర‌ధాన మంత్రి

ఈ రోజు న ప్రారంభమైన ప‌థ‌కాలు ఆర్థిక కార్య‌క‌లాపాల కు వేగగ‌తి ని ఇచ్చి, స్థానిక యువ‌త కు ఉద్యోగ అవ‌కాశాల‌ ను క‌ల్పిస్తాయి: ప‌్ర‌ధాన మంత్రి

Posted On: 25 FEB 2021 12:41PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కారైక్కాల్ జిల్లా లో గ‌ల ఎన్‌హెచ్‌45-ఎ తాలూకు నాలుగు దోవ‌ ల ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల కు శంకుస్థాప‌న చేశారు.  అలాగే, కారైక్కాల్ జిల్లా లో గ‌ల కారైక్కాల్ న్యూ కేంప‌స్ ఫేజ్‌-1 లో వైద్య క‌ళాశాల భ‌వ‌నానికి (జిఐపిఎమ్ఇఆర్) కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  ‘సాగ‌ర్ మాల’ ప‌థ‌కం లో భాగం గా పుదుచ్చేరి లో ఒక మైన‌ర్ పోర్టు అభివృద్ధి కి, పుదుచ్చేరి లోనే ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి ప‌నుల ‌కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  

పుదుచ్చేరి లోని జ‌వాహ‌ర్‌ లాల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్‌ ఎడ్యుకేశన్ ఎండ్ రిస‌ర్చ్ (జిఐపిఎమ్ఇఆర్) లో బ్ల‌డ్ సెంట‌ర్ ను శ్రీ మోదీ ప్రారంభించారు.  మ‌హిళా క్రీడాకారుల కోసం పుదుచ్చేరి లో లాస్‌పేట్ ప్రాంతం లో 100 ప‌డ‌క‌ల స‌దుపాయం క‌లిగిన బాలిక‌ల వ‌స‌తి గృహాన్ని కూడా ఆయ‌న ప్రారంభించారు.  పున‌ర్ నిర్మాణం జ‌రిగిన హెరిటేజ్ మారీ బిల్డింగు ను సైతం ఆయ‌న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, పుదుచ్చేరి గ‌డ్డ మునుల‌ కు, పండిత‌ల‌ కు, క‌వుల‌ కు నిల‌య‌మ‌ని, మ‌హాక‌వి సుబ్ర‌మ‌ణ్య‌ భార‌తి, శ్రీ అరబిందో వంటి క్రాంతికారుల‌ కు కూడా ఇది పుట్టినిల్ల‌ని పేర్కొన్నారు.  పుదుచ్చేరి ని వైవిధ్యం తాలూకు సంకేతం గా ఆయ‌న కొనియాడుతూ, ఇక్క‌డి ప్ర‌జ‌లు వేరు వేరు భాష‌ల ను మాట్లాడుతారని, విభిన్న‌ ధ‌ర్మాల ను అవ‌లంబిస్తూ ఉంటారని, కానయితే వారంతా ఒక్క‌టి గా మ‌నుగ‌డ సాగిస్తార‌ని ఆయ‌న అన్నారు.

పున‌ర్ నిర్మాణం పూర్తి అయిన మారీ బిల్డింగ్ ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించి, ఈ భ‌వ‌నం స‌ముద్ర తీర విహార స్థ‌లం తాలూకు శోభ ను ఇనుమ‌డింప చేస్తుంద‌ని, మ‌రింత ఎక్కువ మంది యాత్రికుల ను ఆక‌ట్టుకుంటుంద‌న్నారు.  

ఎన్‌హెచ్‌45-ఎ ను నాలుగు దోవ‌ లు క‌లిగింది గా దిద్ది తీర్చిన త‌రువాత ఇది కారైక్కాల్ జిల్లా లో చ‌క్క‌ని స‌దుపాయం గా ఉండ‌టం తో పాటు ప‌విత్ర శ‌నీశ్వ‌ర‌న్ దేవాలయాని కి సంధానాన్ని మెరుగు ప‌రుస్తుంద‌ని, అంతేకాకుండా బాసిలిక ఆఫ్ అవ‌ర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్థ్ కు, నాగూర్ ద‌ర్ గాహ్ కు సంధానాన్ని సుల‌భ‌తరం గా మార్చుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  గ్రామీణ ప్రాంతాల లో, కోస్తా తీర ప్రాంతాల లో సంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డం కోసం ప్ర‌భుత్వం అనేక ప్ర‌యత్నాలు చేసింద‌ని, దీని నుంచి వ్య‌వ‌సాయ‌ రంగం లబ్ధి ని పొందుతుంద‌ని ఆయ‌న చెప్పారు.  వ్య‌వ‌సాయ‌దారులు పండించిన పంట‌లు స‌కాలం లో మంచి మార్కెట్ లకు చేరుకొనేట‌ట్టు చూడ‌టం ప్ర‌భుత్వ బాధ్య‌త, చ‌క్క‌ని ర‌హ‌దారులు ఈ ల‌క్ష్యాన్ని సాధించడం లో తోడ్పడుతాయి అని ఆయ‌న అన్నారు.  ఈ ర‌హ‌దారి మార్గాన్ని నాలుగు దోవ‌ల‌ తో విస్తరించడం వ‌ల్ల ఈ ప్రాంతం లో ఆర్థిక కార్య‌క‌లాపాలు జోరు ను అందుకొని, ఇక్క‌డి యువ‌త కు ఉద్యోగ అవ‌కాశాలు అందివ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు.

ఆర్థిక స‌మృద్ధి అనేది మంచి ఆరోగ్యం తో ముడిప‌డి ఉన్నందున శ‌రీర దృఢత్వాన్ని, వెల్ నెస్ ను మెరుగుప‌ర‌చ‌డం కోసం గ‌డచిన ఏడు సంవత్సరాల లో భార‌త‌దేశం ఎంతో కృషి చేసిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ సంద‌ర్భం లో, ఖేలో ఇండియా ప‌థ‌కం లో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 400 మీట‌ర్ల సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ ప‌నుల కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  ఈ ట్రాక్ భార‌త‌దేశ యువ‌త లో క్రీడా ప్ర‌తిభ ను పెంచి పోషిస్తుంద‌న్నారు.  పుదుచ్చేరి కి చ‌క్క‌ని క్రీడా స‌దుపాయాలు అందుబాటు లోకి రావ‌డం తో జాతీయ‌, ప్ర‌పంచ క్రీడా పోటీల లో ఈ రాష్ట్ర యువ‌త రాణించేందుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు.  లాస్‌పేట్ లో నిర్మాణం పూర్తయి గురువారం నాడు ప్రారంభోత్సవం జరిగిన 100 ప‌డ‌క‌ల సదుపాయం క‌లిగిన బాలిక‌ల వ‌స‌తి గృహం హాకీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్‌, క‌బ‌డ్డి, హ్యాండ్ బాల్  క్రీడాకారుల‌కు బ‌స ను అందిస్తుందని, వారికి స్పోర్ట్ స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ) కోచ్ ల మార్గదర్శకత్వం లో శిక్ష‌ణ ను ఇవ్వడం జరుగుతుందన్నారు.  

రాబోయే సంవ‌త్స‌రాల లో ఆరోగ్య సంర‌క్ష‌ణ ఒక కీల‌క‌మైన పాత్ర ను పోషించ‌నుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అంద‌రికీ చ‌క్క‌నైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ను అందించాల‌నే ల‌క్ష్యానికి అనుగుణం గా జెఐపిఎమ్‌ఇఆర్ లో బ్ల‌డ్ సెంట‌రు కు ప్రారంభోత్సవం జరుగుతున్నది.  దీనిలో ర‌క్తాన్ని, ర‌క్త సంబంధిత ఉత్ప‌త్తుల ను, మూల‌క‌ణాల నిల‌వ‌ కు సంబంధించిన ఆధునిక సదుపాయాలు కొలువుదీరుతాయి.  ఈ కేంద్రం ఒక ప‌రిశోధ‌న ప్ర‌యోగ‌శాల గా కూడా ఉంటుంద‌ని, ర‌క్త మార్పిడి తాలూకు అన్ని అంశాల లో సిబ్బంది కి శిక్ష‌ణ ను ఇచ్చేందుకు ఇక్క‌డ ఒక శిక్ష‌ణ కేంద్రం ప‌ని చేయ‌నుంద‌ని ప్రధాన మంత్రి వివ‌రించారు.

నాణ్య‌త క‌లిగిన ఆరోగ్య సంర‌క్ష‌ణ వృద్ధి చెందాలి అంటే అందుకు మ‌న‌కు చేయి తిరిగిన ఆరోగ్య రంగ వృత్తి నిపుణులు ఎంతైనా అవ‌సరం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కారైక్కాల్ న్యూ కేంప‌స్ లో వైద్య క‌ళాశాల భ‌వ‌నం తాలూకు ఒక‌టో ద‌శ ప‌ర్యావ‌ర‌ణానికి మిత్ర‌పూర్వ‌కంగా ఉండే భ‌వ‌న స‌ముదాయం గా కొలువుదీర‌నుంద‌ని, ఎంబిబిఎస్ విద్యార్థుల బోధ‌న కు అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ఆధునిక బోధ‌న సదుపాయాలు దీనిలో ల‌భించ‌నున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

సాగ‌ర్ మాల ప‌థ‌కం లో భాగంగా పుదుచ్చేరి పోర్ట్ డెవలప్ మెంట్ కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేస్తూ, ఇది పూర్తి అయిందంటే గనక చేప‌లు ప‌ట్ట‌డానికి స‌ముద్రం లోకి వెళ్ళేందుకు మ‌త్స్య‌కారులు ఉప‌యోగించుకుంటున్న ఈ నౌకాశ్ర‌యం వారికి మ‌రింత‌ స‌హాయ‌కారి కాగ‌ల‌దన్నారు.  అంతేకాక ఇది చెన్నై కి స‌ముద్ర మార్గ సంధానాన్ని సైతం స‌మ‌కూర్చ‌గ‌ల‌ద‌న్నారు.  ఇది పుదుచ్చేరి లో ప‌రిశ్ర‌మ‌ల కు స‌ర‌కు త‌ర‌లింపు ను సుగ‌మం చేస్తుంద‌ని, చెన్నై నౌకాశ్ర‌యం పై భారాన్ని త‌గ్గించ‌గ‌ల‌ద‌న్నారు.  ఇది కోస్తా ప్రాంత న‌గ‌రాల లో ప్ర‌యాణికుల రాక‌పోక‌ల కు చ‌క్క‌ని అవ‌కాశాల ను కూడా క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌యోజ‌నాల ప్ర‌త్య‌క్ష బ‌దిలీ (డిబిటి) వివిధ సంక్షేమ ప‌థ‌కాల లో ల‌బ్ధిదారులుగా ఉంటున్న‌వారికి ఎంతో మేలు చేసింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇది ప్ర‌జ‌ల కు వారికి ఇష్ట‌మైన ఎంపికల ను చేసుకొనేందుకు వీలు ను క‌ల్పిస్తోంద‌న్నారు.  పుదుచ్చేరి లో ప్ర‌స్తుతం అనేక విద్యా సంస్థ‌లు ఉన్నందువల్ల ఇక్క‌డ మాన‌వ వ‌న‌రులు గొప్ప‌ గా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఇది పారిశ్రామికం గా, ప‌ర్య‌ట‌న అభివృద్ధి ప‌రంగా అనేక అవ‌కాశాల‌ను ఇవ్వ‌జూపుతుందని ఆయ‌న చెప్పారు.  ‘‘పుదుచ్చేరి ప్ర‌జ‌లు ప్ర‌తిభావంతులు.  ఈ నేల ఎంతో సుంద‌ర‌మైంది.  పుదుచ్చేరి అభివృద్ధి కి నా ప్ర‌భుత్వం వైపు నుంచి సాధ్య‌మైన అన్ని విధాలుగాను స‌మ‌ర్ధ‌న అందుతుంద‌ని స్వ‌యం గా మీకు భ‌రోసా ను క‌ల్పించ‌డం కోస‌మే నేను ఇక్క‌డికి వ‌చ్చాను’’ అని చెప్తూ ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

 

 

***
 



(Release ID: 1700751) Visitor Counter : 161